రాజకీయ పోస్టులు పెట్టకూడదు అని చాలా కాలంగా నాకై నేను పెట్టుకున్న నియమాన్ని పాటిస్తూ వస్తున్నాను. ఈ పోస్టులో కూడా ఎవరికైనా ఆ ఛాయలు కనపడితే వారికి ఓ నమస్కారం.
సరిగ్గా పుష్కరం క్రితం, 2012 లో రాజధాని ఢిల్లీలో జ్యోతి సింగ్ అనే ఫిజియో తెరపిష్టుపై, అర్ధరాత్రి నడుస్తున్న బస్సులో దారుణమైన మూకుమ్మడి అత్యాచారం జరిగింది. బహుశా అంతటి తీవ్ర స్థాయిలో జరిగిన దారుణ సంఘటన మరోటి లేదు. ఆ సంఘటన గురించి దరిమిలా దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలను మళ్ళీ ప్రస్తావించడానికి నా మనస్సు ఒప్పుకోవడం లేదు.
ఆమె గోప్యతను కాపాడడానికి పేరును నిర్భయగా మార్చారు. జరిగిన సంఘటన తెలిసి ( ఎస్సెమ్మెస్ ల ద్వారా, అప్పటికి వాట్సప్ ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా లేదు) వేలాదిమంది ఆ యువతికి సంఘీభావం తెలుపుతూ ఢిల్లీ రోడ్ల మీదకు వచ్చారు . అప్పటి కేంద్ర ప్రభుత్వం తీవ్రతను గమనించి, దిగివచ్చి మహిళలపై అత్యాచారాలను కట్టడి చేసేందుకు నిర్భయ పేరుతో ఒక కఠినమైన చట్టం చేసింది. ఆ చట్టంలోని కఠిన నిబంధనలు చూసి నోళ్ళు వెళ్ళ బెట్టారు. దీని నుంచి నిందితులు తప్పించుకోలేరని పేపర్లు సంపాదకీయాలు రాశాయి. కానీ ఏమైంది. కేసు విచారణకు రావడానికే ఏండ్లు పూండ్లూ పట్టింది. తర్వాత పుష్కర కాలానికి కూడా ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. అందుకే ఈ నిర్లిప్తత.
ఒక దుస్సంఘటన జరుగుతుంది. పత్రికల్లో పతాక శీర్షికలు, టీవీల్లో ఎడతెగని చర్చలు, సోషల్ మీడియాలో చర్చోపచర్చలు, ఖండన ముండనలు, రాజకీయ పార్టీల ప్రవేశంతో సంఘటన రంగూ రుచీ పూర్తిగా మారుతుంది.
ఇది ఎప్పటి దాకా సాగుతుంది.
ఇలాంటి మరో సంఘటన జరిగే దాకా.
ఇదో అంతులేని కథ. ముగింపు లేని వ్యధ.
నాకూ ఇదే సంఘఠన గుర్తొచ్చింది. ఏదీ యాదృచ్చికంగా జరగవంటారు. రెండూ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసినవేమో అనిపిస్తుంది. మీరు పాత్రికేయులు మీకు తెలియనిదేముంది.
రిప్లయితొలగించండిThe less said better
రిప్లయితొలగించండిCourts in India have become time pass centers
కోర్టులు యేమి చేస్తాయండి. తీర్పులు ఇవ్వగలుగుతాయి. ఆ తర్వాత కార్యనిర్వాహణ శాఖ వారు సమర్ధవంతంగా అమలు చేయగలగాలి కదా
రిప్లయితొలగించండి