రేడియోలో పాటలు వినే శ్రోతలకు చేపలు పట్టేవాడికి వుండేంత ఓపిక వుండాలని పూర్వం చెప్పుకునే వారు. వల వేసి చాలా సేపు నిరీక్షిస్తే ఓ మంచి చేప గాలానికి చిక్కినట్టు, వినగా వినగా ఓ మంచి పాట చెవిలో పడుతుంది.
అలాగే ఈ రాత్రి టీవీలో ఛానల్లు ఓపిగ్గా మారుస్తూ పోతుంటే, ఈ HW తెలుగు గోల్డ్ ఛానల్ రిమోట్ చేతికి చిక్కింది.
ఇందులో విశేషం ఏమిటంటే, ఓ మంచి సినిమా చూస్తున్నప్పుడు ఒక్కటంటే ఒక్క యాడ్ కూడా పంటి కింది రాయిలా అడ్డం రాదు.
చాలా సేపటి నుంచి బాలచందర్ 'మరో చరిత్ర ' హాయిగా చూస్తున్నాను.
ఈ వైభోగం ఎన్నాళ్ళో తెలియదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి