నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. కాకపొతే, ఈ మువ్వురిలో చంద్రబాబు నాయుడిది రాజకీయంగా భిన్నమైన మార్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలభయ్ ఏళ్ళ చరిత్ర ఈ ముగ్గురితో ముడిపడి వుంది. ఈ చారిత్రక పరిణామాలను ఒక సీనియర్ జర్నలిస్టుగా దగ్గరనుంచి పరిశీలించగలిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని దేవులపల్లి అమర్, తన అనుభవ సారాన్ని తాను రాసిన మూడు దారులు అనే ఈ రెండువందల పేజీల గ్రంథంలో సవిస్తరంగా ప్రస్తావించారు.
చంద్రబాబు అనగానే గుర్తు వచ్చే మరో ముఖ్యమంత్రి
కీర్తిశేషులు ఎన్టీ. రామారావు. ఆ పేరు వినగానే తలపుకు వచ్చే మరో పదం వైస్రాయ్
ఎపిసోడ్. ఇప్పుడు మూడు,
నాలుగు పదుల వయసులో వున్నవారికి గుర్తు వుండే అవకాశం లేదు కానీ, కొంత పాత తరం
వారికి తెలుసు. విచిత్రం ఏమిటంటే వారికీ పూర్తిగా తెలియదు. ఆ కాలంలో చురుగ్గా
పనిచేసిన కొందరు జర్నలిస్టులు అప్పటి రాజకీయ పరిణామాలను నిశితంగా చూసిన వారే అయినా,
ఇంకా ఏదో కొంత సమాచారం మరుగున ఉందేమో అనే సందేహం, వారు ఈ
అంశంపై రాసిన రచనలు,
వార్తలు,
పుస్తకాలు చదివినప్పుడు పాఠకులకు కలగడంలో ఆశ్చర్యం లేదు. కారణాన్ని కూడా అమర్ తన
గ్రంథంలో ప్రస్తావించారు. ఆయన అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్రప్రభలో
రిపోర్టింగ్ బ్యూరో ఇంచార్జ్ గా వున్నారు.
‘మరి, అప్పట్లో ఇటువంటి (ఈ గ్రంథంలో పేర్కొన్న)
విషయాలను మీరెందుకు రిపోర్ట్ చేయలేదని కొందరు మితృలు నన్ను ప్రశ్నించారు. వాళ్ళు
అలా అడగడం సబబే. ఇలా అడిగిన వారిలో మీడియా మితృలు కూడా వున్నారు. పత్రికా స్వేచ్ఛ నేతి
బీరకాయ చందం అని వారికి తెలియనిది కాదు.
పత్రిక పాలసీని సంపాదకులు కాకుండా యజమానులే నిర్ణయించే కాలానికి వచ్చాక జరిగిన
ఉదంతం ఇది. అప్పుడు నేను పనిచేస్తున్న పత్రిక యజమాని, చంద్రబాబు నాయుడు పక్షం ఎంచుకున్నారు. ఇక మా
ఎడిటర్ ఆయన్ని మించి బాబు భక్తి ప్రదర్శించేవారు.’ అంటూ రాసుకొస్తూ అమర్ ఆ
రోజుల్లో జరిగిన డిస్టిలరీ అనుమతి ఉదంతాన్ని పేర్కొన్నారు.
‘బాబుకు అనుకూలంగా రాసిన ఆ వార్తను ఈనాడు
పత్రిక మాత్రమే ప్రముఖంగా ప్రచురించడం, ఆ వార్త
మా పత్రికలో మిస్ అవడం తట్టుకోలేని మా ఎడిటర్, మా బ్యూరోను తిట్టిన తిట్టు
తిట్టకుండా తిట్టారు. జరిగిన పొరబాటును
దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మర్నాడు మొదటి పేజీలో, సుదీర్ఘంనైన సంపాదకీయం రాసి,
చంద్రబాబు పట్ల తన విధేయతను చాటుకున్నారు. అయితే సంపాదకుడి వైఖరికి నిరసనగా
ఉద్యోగాన్ని వదిలి వేయవచ్చు కదా అంటే, నిజమే చేయవచ్చు. కానీ అప్పట్లో వెంటనే మరో చోట
ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆ సాహసం చేయలేదు. చాలామంది జర్నలిస్టుల పరిస్థితి అదే.
బయటకు చెప్పుకోలేక పోవచ్చు. ఇప్పుడయినా ఆ
వివరాలన్నీ రాసే అవకాశం వచ్చింది.
వైస్రాయ్ సంఘటనలో నిజానిజాలు గురించి నేటి
యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సవివరంగా రాయడం జరిగింది’ అని అమర్ ఇచ్చిన
వివరణ.
మూడు దారుల్లో ఇదొకటి. మిగిలినవి రెండూ వై.ఎస్.
ఆర్., వై ఎస్. జగన్ ఎంచుకున్న దారులు. ఈ దారులపై మీడియా కావాలని వికృత ధోరణితో
వార్తలు వండి వార్చింది అనే ఆరోపణలకు సంబంధించి కొన్ని దృష్టాంతాలను అమర్ ఈ
గ్రంథంలో పేర్కొన్నారు. నాటి సంఘటనలకు సాక్షీభూతులైన అనేకమందిని కలుసుకుని, చంద్రబాబు
అనుకూల, ప్రతికూల జర్నలిస్టులు, రచయితలు రాసిన పుస్తకాలలోని అంశాలను కూడా ఆయన ఉదహరించి,
తన రచనకు సాధికారతను ఒనగూర్చే ప్రయత్నం చేశారు.
తాను స్వయంగా గమనించిన విషయాలతో పాటు, తనకు తెలియ
వచ్చిన మరి కొన్ని అంశాలను ధ్రువపరచుకునేందుకు
అమర్ చాలా కసరత్తు చేసినట్టు ఈ పుస్తకం చదివిన వారికి తెలుస్తుంది.
కన్నవీ, విన్నవీ విశేషాలతో కూడిన గ్రంధరచన కాబట్టి కొంత
వివాదాస్పదం అయ్యే అవకాశాలు వున్నాయి.
నాటి సంఘటనలకు నేనూ ఒక ప్రత్యక్ష సాక్షిని కనుక
పుస్తకం చదువుతున్నప్పుడు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంగతులు మూగ మనసులు సినిమాలోలా
కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాఠకులను ఇది
ఆకర్షిస్తుంది.
ఈ పుస్తకాన్ని ముందు అమర్ ఆంగ్లంలో DECCAN
POWER PLAY అనే పేరుతొ
ప్రచురించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. తెలుగు అనువాద రచన మూడు
దారులు పుస్తకావిష్కరణ కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం హైదరాబాదు ప్రెస్
క్లబ్ లో మరోమారు జరగనుంది.
తోకటపా: విజయవాడ
ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్
ప్రసంగ ఉవాచ:
‘దేవులపల్లి అమర్ కు
వై.ఎస్. రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ. జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ఇక ఈ
పుస్తకంలో చంద్రబాబు గురించి ఏమి రాసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు’
(మూడు దారులు
– రాజకీయ రణరంగాన భిన్న ధ్రువాలు రచన: దేవులపల్లి అమర్, రూపా పబ్లికేషన్స్ ఢిల్లీ. రెండువందల పేజీలు ,
395 రూపాయలు)
(30-01-2024)
రెండు వందల "పేచీలకు"
రిప్లయితొలగించండిమూడు వందల తొంభై ఐదు కాణీలా !
టూ మచ్చండీ :)
పది కిలోమీటర్లకు ఓల ఉబర్ నాలుగు వందలు, పిజ్జ బర్గర్ కు ఐదు వందలు, మూడు గంటల సైన్మాకు మూడు వందలు ఓకే.
తొలగించండిపిచ్చి అన్న తర్వాత ఇంక పేచీ అనవసరం.
రిప్లయితొలగించండిపచ్చ మీడియా ఏక పక్ష వార్తలు మాత్రమే సత్యం అనే భ్రమలో ఉన్నవారు రెండో వైపు వారి అభిప్రాయం తెలుసుకునే ఉద్దేశ్యం ఉంటే ఇటువంటి రచనలు ఉపకరిస్తాయి.
రిప్లయితొలగించండిపచ్చమీడియాకు ఆవల పిచ్చమీడియా ఉంది కదా ఆ పిచ్చమీడియాకు అభిప్రాయాలూ వార్తలూనా? అవి తెలుసుకోవాలా? భలే.
తొలగించండిశ్యామలీయం గారు. మీ బ్లాగు లో వ్యాఖ్యలు తీసివేసి మీరు మాత్రం ఇంచక్కా ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు రాయడం ఓకేనా?
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీరు వ్యాఖ్యలు ఏ బ్లాగులో అయినా నిరభ్యంతరంగా చేయవచ్చు. అయితే మీ బ్లాగు లో మోడరేషన్ ఉన్నా కూడా పూర్తిగా వ్యాఖ్యాలు తీసివేయడం సరికాదు అనిపిస్తుంది. ఆ పైన మీ ఇష్టం. ఈ లాజిక్ మీకు అసంబద్ధంగా అనిపిస్తుందా ? చదువరుల అభిప్రాయం ఫీడ్ బ్యాక్ వద్దు అన్నమాట. అయితే ఓకే.
తొలగించండిఅజ్ఞాత- పది కిలోమీటర్లకు ఓల ఉబర్ నాలుగు వందలు....
రిప్లయితొలగించండిమీ లా చిక్కు బావుందండీ
//శ్యామలీయం " మూడు దారుల్లో దేవులపల్లి అమర్" పోస్ట్‌పై కొత్త కామెంట్‌ను చేర్చారు:12 ఫిబ్రవరి, 2024 11:41 AMకి
రిప్లయితొలగించండినిష్రయోజకులైన ఇటువంటి అజ్ఞాతల పిచ్చివ్యాఖ్యలు ( అవి ఎలా ఉంటాయో ఉంటున్నాయో కొన్నింటిని చూపానని మీకు తెలిసే ఉండాలి) కారణంగా శ్యామలీయం బ్లాగలో వ్యాఖ్యలకు తలుపులు మూయక చివరికి తప్పలేదు.
నేను వ్యాఖ్యలు చేసేది తక్కువ. అవి మీలాగా నేను తెరచాటు నుండి వ్యాఖ్యలు చేయను. ఆసంగతి కూడా మీకు తెలిసే ఉంటుంది.
నేనేదైనా తప్పువ్యాఖ్య చేస్తే అప్పడు సందర్భాన్ని బట్టి మాట్లాడవచ్చును కదా. నేను మాట్వాడకూడదనే డిమాండ్ చేసే హక్కు మీకెక్కడిది?
అసంబధ్ధమైన లాజిక్కులు లాగకండి.//
మిరు చేత్తె సుంగారం ఎదుటోల్లు చేత్తే ఎబిచారం
ఇక్కడ పొగ మొదలైనట్టుంది :)
తొలగించండిసెగ కేమన్నా విసనకర్ర విసర వలసినచో తెలుపుడీ
' తప్పువ్యాఖ్య చేస్తే అప్పడు సందర్భాన్ని బట్టి మాట్లాడవచ్చును కదా. ' ఇది మీరు కూడా పాటించవచ్చు కదా.
తొలగించండిThe gentleman believes he's an Abdul Kalam and unfortunately projects himself a K A Paul, sadly.
తొలగించండిరాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సీట్లు ఓట్ల బదిలీ విషయం లో జాగ్రత్తగా ఉండాలి. పొత్తులో ఉన్నా నిర్ణయాత్మక సంఖ్యలో జనసేన సీట్లు గెలవనీకుండా చేసే రాజకీయం ఉంటుంది. పదేళ్లు పడిన కష్టం వృధా కాకుండా అచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
రిప్లయితొలగించండివారి బ్లాగు, వారిష్టం కదా?
రిప్లయితొలగించండిYes sir, you're right, one cannot question others how they project themselves, which pleases themselves and his friends.
రిప్లయితొలగించండిఆత్రేయ చెప్పిన మాట ఎంత నిజం. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.
రిప్లయితొలగించండిఈ రోజు తితిదే ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు కలిపి దాదాపు 7200 ( మొత్తం 9000) మందికి ఇళ్ళ పట్టాలు పత్రాలు అందజేయడం జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు లో చూపించారు.దాదాపు 400 ఎకరాల స్థలం కేటాయించారు అని వార్త. శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఇతర అధికారులు ఎంతో శ్రద్ధ శ్రమ తీసుకుని ఈ బృహత్ సత్కార్యాన్ని సాధించారు. ఎంతో అభినందనీయమైన విషయం. ఇది భూమన్ గారి పదిహేను సంవత్సరాల స్వప్నం సాకారమైంది అని ఆనందం తో జన్మ ధాన్యం అయింది అని చెప్పారు.
రిప్లయితొలగించండిఇంత మంచి వార్తను మెచ్చుకునే సహృదయం, సంస్కారం పచ్చ మీడియాకు మాత్రం ఉండదు. ఇలాంటి కార్యక్రమం న భూతో న భవిష్యతి అనిపిస్తుంది.
అజ్ఞాత11 మార్చి, 2024 11:10 AMకి
రిప్లయితొలగించండి"పాపం పవన్ కళ్యాణ్....ఇంతకంటా బిజెపీ లో గౌరవప్రదంగా విలీనం చేస్తే నయం కదా."
It's me - చిచ్చరపిడుగు
అజ్ఞాత:అయయో,బాబును నమ్మినందుకు పవనుకి తిరుక్షవరం ఆయెనే!
గుడిలో అష్టోత్తరం చేయిస్తె పుణ్యం వచ్చేది.
చిచ్చరపిడుగు:చక్కెర పొంగలి చిక్కేది.
ఆ మహా మహా యంటీయారుకే ఓటమి తప్పలేదు భాయి,
నిబ్బరించవోయి.
అజ్ఞాత:మరి నువు చెప్పలేదు భాయి:-(
చిచ్చరపిడుగు:అది నా తప్పు గాదు భాయి:-)
తొలగించండిఎలక్షన్లలో ఖర్చుపెడితే... ఎం.ఎల్.ఏ దక్కేది. మనకు అంతటి లక్కేదీ.
మంచి పాట గుర్తు చేశారు. అన్నట్టు ఈ పాట పాడిన వారు పిఠాపురం.
ఇంతకీ పిఠాపురంలో పవన్ గెలిచే అవకాశం ఉందా చెప్పారు కారు.
వైశాలిpermalink
రిప్లయితొలగించండివైశాలి : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 Report error(s) గ్రంథసంకేత వివరణ పట్టిక
వి.
ఱంకుటాలు.
ఱంకుటాలు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report error(s)
అంటుకత్తె, అనుసృతి, అవినీత, అసతి, అసాధ్వి, ఇత్వరి, కలకూజిక, కాణేలి, కామగ, కులట, కజాక, గుడిసెవేటుది, చపల, చర్చ, చర్షణి, చల, చెడిప, ఛిన్న, జఘన, జఱభి, జారభర, జారిణి, త్రప, దాట్లమారి, దారిక, దిచ్చరి, దర్షకారిణి, దర్షణి, పఱచు, పఱచుచేడియ, పాంసుల, పుంశ్చలి, బంధకి, బజారి, బసిని, బహుమార్గగ, బొజుగులాడి, బుజంగిక, మిండత, మిండలకో(రి)(రు), ముక్త, రండ, ఱంకుబోతు, ఱంకురాట్నము, ఱంకులగొండి, ఱంకులాడి, ఱంకువెలది, ఱంకెత, ఱాగ, లంక, లంజ, లాంఠిని, వండ, వాడవదినె, విటకత్తె, విటి, విటుకులాడి, విటురాలు, వృషభి, వెల్లాటకత్తె, వెల్లాపుగత్త, వైశాలి, వ్యభిచారిణి, షండాలి, సంతబసివి, స్పర్శ, స్మరదీపిక, స్వైరిణి.
అజ్ఞాత:
రిప్లయితొలగించండిఇంతకీ పిఠాపురంలో పవన్ గెలిచే అవకాశం ఉందా చెప్పారు కారు.
17 మార్చి, 2024 1:13 AMకి
చిచ్చర పిడుగు:
పిఠాపురంలో ఉన్న "ఠా" పవన్ కల్యాణ్ పేరులో లేదు గాబట్టి న్యూమరాలజీ స్పెక్యులేషన్ ప్రకారం గెలిచే అవకాసం లేదు.కానీ, అతను కలిసిన "భాజపా"లో ఉన్న "భా"కి ఆ దోషాన్ని విరిచెయ్యగల శక్తి ఉంది కాబట్టి అయోధ్య రాముడు తన మహిమ చూపిస్తే గెలిచే అవకాశం ఉంది.తావీజ్ మహిమై:-)
జై శ్రీ రామ్!
ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా టీజర్ వచ్చింది. అందులో గ్లాసు పగిలింది.
తొలగించండిగాజు పగిలే కొద్దీ పదునెక్కతుంది. ఈ డైలాగ్ బాగుంది.
గ్లాసు అంటే సైజు కాదు సైన్యం అనే డైలాగు అర్థం కాలేదు.
పగిలిన గ్లాసులో టీ ఎలా తాగాలి.
పవన్ కళ్యాణ్ ముఖం లో కూడా గబ్బర్ సింగ్ సినిమా అప్పటి కళ లేదు.
సినిమాలో రాజకీయం మిక్స్ చేస్తే ఉపయోగం ఉండదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"గాజు పగిలే కొద్దీ పదునెక్కతుంది." - ఇది నిజం కాబట్టి మీకు " ఈ డైలాగ్ బాగుంది."
రిప్లయితొలగించండి"గ్లాసు అంటే సైజు కాదు సైన్యం" అనేది అబధ్ధం కాబట్టి మీకు ఆ " డైలాగు అర్థం కాలేదు."
"పగిలిన గ్లాసులో టీ ఎలా తాగాలి" అనే ప్రశ్న ఆ డైలాగు రాసిన ర్చహయితకీ ఓకే చెప్పిన డైరెట్రుకీ పలికిన హీరోకీ రాలేదు - వాళ్ళ కంత తెలివి లేదు,అది మన ఖర్మ!
"పవన్ కళ్యాణ్ ముఖంలో కూడా గబ్బర్ సింగ్ సినిమా అప్పటి కళ లేదు." - అబధ్దాలు చెప్పడానికి అలవాటు పడిన తర్వాత వూసరవెల్లి తనం అలవాటయిన ముఖానికి అబధ్ధాలు చెప్పడానికి అలవాటు పడని అమాయకత్వపు కళ ఎలా తిరిగి వస్తుంది?
"సినిమాలో రాజకీయం మిక్స్ చేస్తే ఉపయోగం ఉండదు." - కల్తీ రాజకీయం మిక్స్ అయితేనే లాభం గూబల్లోకి వస్తుంది.మాక్సిం గోర్కీ నవల విప్లవ రాజకీయం కోసం రాసిన కళయే.ఆ రాజకీయ నవల సక్సెస్ అయ్యింది కదా!షహీద్ భగత్సింగ్ లేఖలూ వ్రాతలూ రాజకీయాల కోసం ఉపయోగించుకున్న సాహిత్య రూపమే.
నిజాయితీ పోయేసరికి ముఖంలో కళ కూడా పోయింది - పపం పవన్ కల్యాణ్!
రఘురామకు దొరకని టిక్కెట్. ఒక పార్టీ పేరు మీద గెలిచి రాజీనామా చేయకుండా స్వంత పార్టీని నాయకుడిపై వ్యతిరేక మీడియా లో విమర్శలు చేస్తూ ఐదేళ్లు గడిపాడు. బయటికి వచ్చి విమర్శ చేస్తే గౌరవం గా ఉండేది.
రిప్లయితొలగించండిఅలాంటి వ్యక్తి కి ఏ పార్టీ అయినా టిక్కెట్ ఇవ్వదు. అతన్ని అవసరానికి వాడుకున్న పార్టీ మీడియా వదిలించుకుంది.
'విన్నకోట మాట వినర మామ' అని కూడా వ్రాయవచ్చు జిలేబి. సరదా సూచన మాత్రమే సుమా.
రిప్లయితొలగించండి'విన్నకోట గోల వినవె మామి'అని కూడా వ్రాయవచ్చు జిలేబి. సరదా సూచన మాత్రమే సుమా.
రిప్లయితొలగించండిశర్మ గారి మాట చల్ది వణ్ణం మూట అని చివరి పాదంతో పద్యాలు వ్రాయవచ్చు జిలేబి.
రిప్లయితొలగించండివృద్ధులకు, దివ్యంగులకు ఇంటి దగ్గర పెన్షన్లు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయకుండా చేసిన వారి శాడిజం ప్రజలు క్షమించరు.
రిప్లయితొలగించండిఎన్నికల తరువాత మళ్ళీ ఇంటివద్దనే వృద్ధులకు పింఛన్లు అందజేస్తే బాగుంటుంది.
తొలగించండి