31, డిసెంబర్ 2022, శనివారం

నో తాతయ్యా!

 


డెబ్బయి వసంతాల పైచిలుకు జీవితంలో మొట్టమొదటిసారి,  పాత సంవత్సరం కొత్త సంవత్సరంలోకి కొత్త విధంగా జారిపోతోంది.  ఏడాది వయసున్న నా  మనుమరాలు జీవిక ఈ రాత్రి  నాకు కంపెనీ ఇచ్చింది. అదేమిటో ఇంత రాత్రి వరకు అది  మేలుకునే వుంది.

పాత అలవాట్ల ప్రకారం ఏదైనా చేయబోయినా, చక్రాలు లాంటి కళ్ళతో వద్దు అనే సంకేతం ఇచ్చింది. కొన్ని విషయాల్లో ప్రాణానికి ప్రాణం అయిన మా ఆవిడ మాటే నేను వినలేదు.

అలాంటిది జీవిక తన  కళ్ళతోనే నన్ను కట్టి పడేసింది.

నో తాతయ్యా అనే సంకేతం నాకు అందులో కనిపించింది.

ఒక్క రోజు నా చిట్టితల్లి చెప్పే మాట వింటే ఏం పోతుంది.

దేవుడు అంతటి వాడే పిల్లల మాట వింటాడు అంటారు.

ఇక నేనెంత?    



(31-12-2022)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి