12, సెప్టెంబర్ 2022, సోమవారం

యాదాద్రి నిర్మాణం ఓ అద్భుతం

 ఆధునిక హంగులతో పురాతన నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న యాదాద్రి దేవాలయం నిజంగా ఒక అద్భుతం.

పునర్నిర్మించిన ఈ గుడి గురించి పత్రికల్లో చదవడం, టీవీల్లో చూడడం తప్పిస్తే కళ్ళారా చూసింది లేదు. గతంలో ఎన్నోసార్లు దర్శించుకున్న యాదగిరిగుట్ట దేవాలయమే మనసులో ముద్ర పడిపోయిన కారణం కావచ్చు,  ఈరోజు ఆ దేవళం  ముందు నిలబడి చూస్తుంటే ఇంత గొప్ప గుడిని ఇంత స్వల్ప కాలంలో ఎలా కట్టారా అని ఆశ్చర్యం వేసింది.

మా మనుమరాలు జీవిక పుట్టు వెంట్రులకు తీయించడం కోసం ఈ ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి యాదగిరిగుట్ట  వెళ్ళాము. మిత్రుడు జ్వాలా మాట సాయం బాగా అక్కరకు వచ్చింది. ఏ గుడికి పోయేవారు అయినా మనసులో  బలంగా కోరుకునే మంచి దైవ  దర్శనం లభించింది. ఈ విషయంలో సహకరించిన దేవాలయం అధికారులు శ్రీయుతులు రాజు, రామప్రసాదరెడ్డి, మహేష్, శంకర్ లకు ధన్యవాదాలు.   

ఎనిమిది నెలల పిల్లకు వెంట్రుకలు తీయించడం ఎలా అని మధన పడిన మాట వాస్తవం. అయితే దేవస్థానం వారి క్షురకుడు ఎంతో నైపుణ్యంగా ఆ పని ఇట్టే పూర్తి చేశాడు. ఏడ్చి గోల చేస్తుందేమో అనుకుంటే ఆ యావత్తు కార్యక్రమాన్ని జీవిక ఆనందంగా ఆస్వాదించడం ఆశ్చర్యం కలిగించింది.

పీవీఆర్కే గారు అన్నట్టు నాహం కర్తా. అంతా ఆ భగవంతుడి లీలావిలాసం.   














(12-09-2022)

5 కామెంట్‌లు:

  1. సుదీర్ఘకాలం పాత్రికేయవృత్తిలో ఉన్న మీరు ఇంత చిన్నవిషయం ఎలా మరచిపోయారా అని ఆశ్చర్యంగా ఉంది. ఆమధ్య బాగా వానలు కురిసినప్పుడు ఈకొత్తనిర్మాణం యావత్తూ ఎంత చక్కగా మునుకకు గురైనదీ అప్పుడే‌ మరచిపోయారు. భలే‌ పొగడుతున్నారు!

    రిప్లయితొలగించండి
  2. So you used recommendation of jwala and got VIP darshan? Fantastic. This is how you preach on TV and tell people the best way to live without recommendations and political scout and yet …. Hmmm. Excellent.

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత అనే పేరుతొ తెలుగులో, ఇంగ్లీష్ లో ఇద్దరు అజ్ఞాతలు (అజ్ఞానులు కాదు గమనించండి) రాసిన వ్యాఖ్యల్లో సామీప్యత వుంది కాబట్టి ఇద్దరికీ ఒకే జవాబు. ఎలాంటి సిఫారసు లేకుండా మీ ఇద్దరూ ఇంతకూ ముందెన్నడు ఆలయాలకు వెళ్లి ఉండని పక్షంలో మీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తాను. కానట్టయితే మీ వ్యాఖ్యలు మొత్తంగా కాకపోయినా కొంత సరిచేసుకోండి. పత్తిత్తుల మాదిరిగా వ్యవహరించడం మానుకోండి.- భండారు శ్రీనివాసరావు (పీ.ఎస్. సొంత పేర్లతో వ్యవహరించే నిబ్బరాన్ని మీరు నమ్మే ఆ దేవుడు మీ ఇద్దరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను)

    రిప్లయితొలగించండి
  4. యాదాద్రి నవ నిర్మిత ఆలయం నిర్మాణం బాగుంది. ఆలయం లోపల చక్కగా విశాలంగా ఉండి దర్శనం బాగా అవుతోంది. అయితే వెలుపల కట్టిన మంటపాలు, నడవాలు చూడడానికి బాగున్నా యాత్రికులు కూర్చునే విధంగా విశాలంగా లేవు. ఎత్తు కూడా తక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. There is nothing wrong in using recommendations or political influence to get things done
    in our best interest. However, when we do it, we lose the moral right to tell others not
    to do it. What's the expression for it, walk the talk?

    రిప్లయితొలగించండి