ఇప్పటి విషయమే కాని కొంత పాత కధ చెప్పాలి.
అప్పుడెప్పుడో
యాభయ్ ఏళ్ళ క్రితం సినిమా రివ్యూలు రాసేందుకు ఫ్రీ వ్యూలు (Free View) చూడడానికి ధియేటర్లకి డుతుండేవాడిని. రిలీజ్ కు ముందు వేసే
Preview లకి ఇవి అదనం. మన వీలూసాలూ చూసుకుని
వెళ్ళడానికి వీలైన ఏర్పాటు అన్నమాట.
ఒక
రోజు అలా ఓ సినిమాకి వెళ్ళాను, గుప్త జ్ఞాన్ అనుకుంటా. బాగా రష్ గా వుంది.
టిక్కెట్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళు నిమిషం ఆలస్యం అయితే ఏ సీను మిస్సవుతామో
అన్నట్టుగా తోసుకుని వెడుతున్నారు. కొంత నిమ్మళించిన తర్వాత అడిగాను గేటువాడిని.
లోపలకి వెళ్ళిన వాళ్ళలో చాలామంది చిన్న పిల్లల మాదిరిగా వున్నారు. ఇది ఏ
సర్టిఫికేట్ సినిమా. ఎలా పంపిస్తున్నావు అని.
అతడు
నవ్వి చెప్పాడు. ‘ఏ అనగానే వచ్చేది వీళ్ళే. వీళ్ళను నీ వయసు ఎంత అని అడిగితే ఆ
సర్టిఫికేట్ తెచ్చుకున్న ఫాయిదా ఏముంటుంది. వీళ్ళే కదా మహారాజ పోషకులు’
యాభయ్
ఏళ్ళ క్రితమే ఇలా వుంది. తెలియంది తెలుసుకోవాలని, చూడంది చూడాలని ఆ వయసులో తప్పకుండా
అనిపిస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని
సినిమా వాళ్ళ తాపత్రయం.
మేజరు
ఎవరు , మైనర్ ఎవరు అని కదా చెప్పుకుంటున్నాం.
పద్దెనిమిది
లోపల మైనరు,
దాటితే మేజరు అని ఓ సర్కారు వారి లెక్క వుంది. కానీ ఆ లెక్కను ఎవరు లెక్క పెడతారు.
అదీ ఈ రోజుల్లో. చిన్నాపెద్దా అందరూ ఐ నో పీ ఎం, ఐ నో సీ ఎం బాపతు అయినప్పుడు అసలు కుదరదు.
అప్పటికీ
ఇప్పటికీ కొట్టవచ్చినట్టు కనబడే కొన్ని మార్పులు వున్నాయి.
పిల్లలు
ఒక వయసు వచ్చేవరకు తలితండ్రుల కనుసన్నల్లో వుండేవాళ్ళు. బయట ప్రపంచంలో తిరిగేది
తక్కువ. ఇంట్లో గడిపేది ఎక్కువ. టీవీలు లేవు, పత్రికలు లేవు. లేవని కాదు, పిల్లల చేతిలో ఉండేవి కావు. దాంతో
చదువే వారికి లోకం. ఇతరేతర లోక జ్ఞానం పూజ్యం. అమ్మాయిల వైపు చూడడానికి భయపడే వారు. ఇక ఆడపిల్లలు బోలెడు
సిగ్గుపడే వారు. అలానే వుండి పోవాలని రచయిత ఉద్దేశ్యం కాదు. మార్పుల గురించి
ప్రస్తావనలో భాగంగా చెప్పింది మాత్రమే. పేరెంట్స్ కూడా పిల్లల పట్ల బాధ్యతగా
వుండేవాళ్ళు. ఇది కాక మంచీ చెడూ చెప్పడానికి ఇళ్ళల్లో తాతయ్యలు, నాయనమ్మలు వుండేవాళ్ళు. ఆ కాలంలో ఇంత పొడగరి పిల్లలు అరుదు. చూడగానే
చిన్నవాడు అని తెలిసి పోయేది. ఇప్పుడలా కాదు. తినే తిండ్లూ, పెరిగే వాతావరణం వారిలో శారీరకపరమైన
మార్పులకు కారణం అవుతున్నాయి. చిన్న
వయసులోనే పెద్దగా కనబడుతున్నారు. ఇళ్ళల్లో పెద్దల భయం బొత్తిగా లేదు. అసలా పెద్దలే
ఇళ్లకు చేరే సరికే నడి ఝాము అవుతోంది. ఇక పిల్లల సంగతి కనుక్కునే తీరిక, ఓపిక వారికి ఎక్కడుంది కనుక.
దానికి
తోడు ప్రపంచం వారి గుప్పిట్లోకి వచ్చేసింది మొబైల్ రూపంలో. అందులో చూడాల్సింది, చూడకూడనిది అంటూ ఏమీ లేదు. మేజరు, మైనరు అనే వివక్ష అసలే లేదు. దీనికి
తోడు నాగరికత పేరుతొ వస్త్ర ధారణలు, నియమాలు
లేని ఆహారవిహారాలు, ఆడా మగా తేడాలేని స్నేహాలు. ఇక వారికి వయసుతో నిమిత్తం లేని లేనిపోని ఆలోచనలు వస్తే అది వారిది తప్పా!
తప్పదు.
చట్టాలు మార్చాలి. మేజరు, మైనరు
అనే తేడా లేకుండా చేసిన తప్పుడు పనులకు తగిన శిక్షలు పడాలి. చేసింది మేజరు నేరం, తప్పించుకునేది మైనర్ పేరుతొ.
ఢిల్లీ
ఉదంతం గుర్తుంది కదా! రాత్రి వేళ బస్సులో వస్తున్న అమ్మాయిపై జరిగిన ఘాతుకం.
ఇనుపరాడుతో మర్మాంగాలను హింసించిన పశువు మేజరు కాదు, మైనరు. ఆ పేరుతొ పడాల్సిన శిక్ష
నుంచి చట్టమే అతడిని కాపాడింది.
ఈ పరిస్థితి
మారాలంటే ముందు తలితండ్రులు మారాలి.
వారికి చదువు చెప్పే విద్య సంస్థలు కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. చట్టాలు మారాలి.
ఇవేవీ
జరగకుండా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ బుల్లి
తెరలపై చర్చలు చేస్తే జరిగేది ఏముంటుంది. జనం ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటారు.
ఎప్పటి వరకు? మరో ఇలాంటి సంఘటన జరిగే వరకు.
టైం చేంజ్ అవుతుంది . జనరేషన్ గ్యాప్ ఎక్కువ ఉంది . ఒకప్పుడు ఇంటర్నెట్ లాంటివి లేకపోవడం వలన, తెలుసుకోవడం లేట్ అయ్యేది , ఇప్పుడు అంత అరచేతిలోనే. అయినా మైనర్ అని చెప్పి వదిలేయడం అమానుషం . ఆ వయసులో కనీసం ఆలోచించే జ్ఞానం కూడా ఉండదు . అభివృద్ధి చెందిన దేశాలలో, ప్రతీ ఒక్కరి వివరాలు ( వేలి ముద్రలు తో సహా ) స్టోర్ అయి ఉంటాయి , అందువలన చాల జాగ్రత్త గా ఉంటారు , ఒక చిన్న మరక పడినా జీవితం మటాష్ . కానీ ఇండియా లాంటి వెనకబడిన దేశం లో అలాంటివి ఉండవు . నేరం చేసి తప్పించుకోవడం చాలా ఈజీ , మీ వెనక ఒక వార్డ్ మెంబెర్ స్థాయి నాయకుడు ఉంటె, హత్య లు కూడా చేసేయొచ్చు .
రిప్లయితొలగించండిమైనర్ ఏజ్ 18 నుండి 14 కి మార్చాల్సిందే .