మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఇదే ప్రశ్నను సంధించారు.
ఇప్పటివరకు జవాబు
లేదు.
ఆయన రాసిన వ్యాసంలో ఒక చిన్న పేరా!
“ఆ మధ్య టెల్ అవీవ్ వెళ్లాను.
అంతకుముందు రోజే అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. కొంతమంది ఆ దాడిలో మరణించారు.
మరునాడు ఉదయం ఒక ఇజ్రాయెలీ పత్రిక తిరగేశాను. మొదటి పేజీలో ఒక ప్రధాన వార్త కనబడింది.
అది బాంబు పేలుడుకు సంబంధించింది కాదు. ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి అయిదేళ్ళు
కష్టపడి పచ్చిక మొలవని ఎడారి భూమిని సస్యశ్యామలం చేసిన వైనం గురించి రాసిన కధనం
అది. అలాటి ఉత్తేజకరమైన సమాచారంతో అక్కడివాళ్లు తమ దినచర్య ప్రారంభిస్తారు.
"బాంబు పేలుడు సంఘటన గురించిన వార్త లోపలి పేజీలో వేసారు. చావులు, చంపడాలు, బాంబు దాడులు, పేలుళ్లు, ఇలాటి వార్తలన్నీ అంత ప్రముఖంగా అక్కడి
పత్రికలు ప్రచురించవన్న సంగతి అప్పుడే అర్ధం అయింది.
“మరి మన దగ్గరో. ఇందుకు పూర్తిగా భిన్నం. చావులు, జబ్బులు, నేరాలు, ఘోరాలు
వీటితోనే మీడియా మనకి సుప్రభాతం పలుకుతుంది.
“ఎందుకిలా జరుగుతోంది? జవాబులేని ప్రశ్న. సమాధానం
వెతుక్కోవాల్సిన ప్రశ్న”
“ఆప్ కా ఆంధ్ర మే ఘర్ ఘర్ మే రాజ్‌నీతి హై”
రిప్లయితొలగించండిసుమారు పాతికేళ్ళ క్రితం విజయవాడలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన కొద్దిసేపటి తరువాత ఒక గుజరాతీ సహప్రయాణికుడు నాతో అన్న మాట ఇది. అప్పుడు నేను గుజరాత్‌లో పనిచేసేవాడిని.
ఇప్పుడైతే గుజరాత్‌లో ఎన్నికలు ఇంత హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి కాని, ఒకప్పుడు ప్రశాంతంగా, అసలు ఎన్నికలు జరుగుతున్నాయో లేదో అన్నట్టుగా ఉండేవి.