11, మార్చి 2022, శుక్రవారం

డీ.జే. టిల్లు! – భండారు శ్రీనివాసరావు

 

“డీ.జే. టిల్లు! ఇదేం! పేరురా! ఆడవాళ్ళకి నచ్చుతుందా అసలు” అన్నాను నేరుగా ఈ సినిమా డైరెక్టర్ తోనే. ఈ డైరెక్టర్ విమల్ కృష్ణ నా మేనల్లుడు  శ్రవణ్ కుమార్ ఏకైక కుమారుడు. బీ. టెక్. చదివాడు. అమెరికా చాన్స్ కూడా వదులుకుని సినిమాల మీద మోజుతో అలాగే ఆ ప్రపంచంలోనే వుండిపోయాడు. అలా కొన్నేళ్ళు. చివరికి ఆ తపస్సు ఫలించింది. పట్టుదల ఫలితం ఇచ్చింది. విమల్ మొదటి చిత్రం  డీ.జే. టిల్లు కనక వర్షం కురిపిస్తోందని అమెరికా నుంచి మా పిల్లలు ఫోన్ చేసి చెప్పారు.   అన్నట్టు నాది  పాత తరం కదా! సర్దుకోవడం కొంచెం ఇబ్బంది. ఇదేం పేరు, ఇదేం కధ అనే భావనే. కానీ నవ తరానికి అపరిమితంగా నచ్చినట్టు వుంది. 

“జనం కోరేది మనం శాయడమా! మనం చేసేది జనం చూడడమా!” అనే అలనాటి పాతాళభైరవి పింగళి మార్కు  మాంత్రికుడి డైలాగ్ నేటికీ వర్తించేలా సినిమా తీసిన కుర్ర బృందానికి అభినందనలు.

పొతే, ఈ సినిమాలో హీరోగా వేసిన సిద్దూ తో మరో బాదరాయణ సంబంధం. అతగాడు ఒకానొక రోజుల్లో నా రేడియో సహోద్యోగి శారద గారి అబ్బాయి. సినిమా విజయవంతం అయిన పుత్రోత్సాహంతో ఆవిడ ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకీ విషయం తెలిసింది. సినిమా నిర్మాణ సమయంలో తరచూ తమ ఇంటికి వచ్చి వెడుతుండే కుర్ర డైరెక్టర్  విమల్  నా మేనల్లుడి కుమారుడు అని నేను చెప్పేదాకా ఆమెకు తెలియదు.  





(11-03-2022)

6 కామెంట్‌లు:

  1. ఇది పెయ్డ్ ప్రమోషనాండీ ?

    రిప్లయితొలగించండి
  2. @అజ్ఞాత: ప్రమోషన్ దశ దాటిపోయిన సినిమాకి ప్రమోషన్ ఏమిటండీ అజ్ఞానం కాకపొతే - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  3. హీరో తెలంగాణా స్లాంగ్ కోసం ఇప్పటికి 6 సార్లు చూసాను. ఆహా...లోనే అనుకోండి.
    మళ్ళీ నా (doubt) అనుమానం ott లో కనక వర్షం ఎలా కురుస్తుంది ?
    డైరెక్టర్ విమల్ కృష్ణ కి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. బాల గంగాధర్ తిలక్ పేరు పెడితే నచ్చక టిల్లు అని మార్చుకున్నాడు...బాగుంది కదా ?

    రిప్లయితొలగించండి
  5. @ నీహారిక: నేను దియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూడలేదు. మీవంటి వాళ్ళు రాసిన రివ్యూలు చూశాను. ఓవర్ సీస్ కలెక్షన్లు అద్భుతంగా వున్నాయని, పెద్ద సినిమాల రేంజ్ లో వచ్చాయని తెలుసుకున్న తర్వాత కనక వర్షం అనే మాట వాడాను

    రిప్లయితొలగించండి