కేంద్ర బడ్జెట్ మీద నా వ్యాఖ్య కోరుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్ ఛానల్ 'సమయం' తరపున సంపత్, రత్నం మా ఇంటికి వచ్చారు. ఇద్దరూ పాత మిత్రులే. సంతోషం అనిపించింది.
కేంద్ర బడ్జెట్ - టైమ్స్ ఆఫ్ ఇండియా వారి తెలుగు ఛానల్ సమయం కు ఇచ్చిన ఇంటర్వ్యూ.
CLICK THE LINK BELOW TO WATCH THE VIDEO
ఆదాయం: ప్రతి రూపాయి లో 35% రుణం ద్వారా వస్తుంది.
రిప్లయితొలగించండివ్యయం : ప్రతి రూపాయి లో 20 % తీసుకున్న అప్పుల పై వడ్డీ చెల్లింపులు.
Is this a healthy and sustainable model? 🤔
2019లో భారతదేశపు మొత్తం ఆదాయం కేవలం 167 లక్షల కోట్లు,కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెల్లించాల్సిన సాలుసరి వడ్డీ ₹4,551,323,407,985 - మొత్తం అప్పు ఎప్పటికి తీరుతుంది?ఇంగ్లీషువాళ్ళు రాకముందు హిందూ ముస్లిం ప్రభువులు ఎవ్వరూ తమ రాజ్యాలని పోషించటానికి బయటివాళ్ళ దగిర అప్పు చెయ్యలేదు - అప్పుడూ ఒక స్థాయిలో వేరే రూపంలో బ్యాంకింగ్ సిస్టం ఉండేది, కానీ రాజులు తమ సొంత ఆస్తుల్ని తనఖా పెట్టి గానీ మరుసటి ఏడాది రాబడి నుంచి తీర్చే ఒప్పందంతో గానీ రాజ్యం లోపలి ధనవంతుల నుంచే అప్పులు చేసేవాళ్ళు, అప్పు చేసేది నిర్మాణాత్మకమైన అభివృద్ధి పనుల కోసం కాబట్టి ఆదాయం రాగానే తీర్చేసేవాళ్ళు!
రిప్లయితొలగించండిభారతదేశం బ్రిటిష్ రాణికి పూర్తి స్థాయి వలస రాజ్యం కాబొయే ముందరి 1834లో East India Company యొక్క అప్పు సుమారు Rs. 36.9 కోట్లు. British Parliament కూడా వాళ్ళ చుట్టమే కాబట్టి ఈ అప్పుని భారతీయుల ఖాతాలోకి వేసేసింది - లేకపోతే కంపెనీ తన పెత్తనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చెయ్యదు మరి!
1834 నాటి Charter Act వల్ల భారతదేశంలో ఏర్పడిన Government మక్కీకి మక్కీ లండనులోని British Government యొక్క ప్రతిరూపమే - It was the Indian Goverment formed by the British, of the British, and for the British!
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుని అణిచివెయ్యటానికి అయిన ఖర్చును కూడా కలిపితే 1860 నాటికి భారతదేశం యొక్క అప్పు Rs. 693 కోట్లకి పెరిగింది.యుద్ధాల ఖర్చుకి తోడు మన దేశంలో జరిగిన ఉత్తుత్తి అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన Home Charges కూడా మననుంచి అప్పు తీసుకుని ఖర్చు పెట్టిన ఉదారులు వాళ్ళు!
అలా 1913 నాటికి భారతీయుల అప్పు Rs. 411 కోట్లకి చేరింది.1914లో వచ్చిన మొదటి ప్రపంచయుద్ధం నాడు భారత ఉపఖండపు ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి Rs. 150 కోట్ల యుద్ధనిధిని కానుక ఇచ్చారు - మన మహాత్ముడి సెంటిమెంటుతో కూడిన ప్రసంగాలకి కరిగిపోయి సామాన్య స్త్రీలు తమ ఒంటిమీద బంగారాన్ని కూడా ఒలిచి ఇచ్చారు!ఇంగ్లీషువాళ్ళకి మనం ఇచ్చిన కానుక వల్ల ఆ తర్వాత ఆరు సంవత్సరాల పాటు వందేసి కోట్ల లోటు బడ్జెట్ కష్టాల్ని అనుభవించిన ఉదారులం మనం!
మొదటి ప్రపంచయుద్ధం మనకి చేసిన మహోపకారం రోడ్లు వేసీ రైళ్ళని తిప్పీ ఇంగ్లీషు నేర్పీ ఇంగ్లీషువాళ్ళు మనల్ని బాగు చేశారని రుజువు చెయ్యటానికి వాళ్ళూ వాళ్ళ తైనాతీలూ మన మార్కెట్ చాలా చిన్నది గనక దాన్ని వాళ్ళు విస్తరించకపోతే కూపస్థ మండూకాల మాదిరి ఉండిపోయేవాళ్ళమని చెప్తున్న అబద్ధాల్ని పటాపంచలు చెయ్యటమే - 1917లో Rs. 53 కోట్లూ 1918లో Rs. 57 కోట్లూ చాలా ఈజీగా నొక్కేశారు!1922 నుంచి అయిదేళ్ళ పాటు రైల్వేస్ మీద Rs. 150 కోట్లు ఖర్చు పెట్టినందుకు గాను Rs. 300 కోట్ల అప్పు పెరిగింది - బాగు చెయ్యటం అంటే అప్పులు పెంచటమా!
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు రెండో ప్రపంచ యుద్ధపు ఖర్చు కూడా మన నెత్తినే పడింది"The Government was able to raise huge loans as can be seen from the fact that the interest-bearing obligations of the Government rose from Rs. 1204 crores in 1939-40 to Rs. 2308 crores in 1945-46." అని ఒక ఆర్ధిక విశ్లేషకుడు అంటున్నాడంటే ఇంగ్లీషువాళ్ళు అంత పిండేసిన తర్వాత కూడా ఈ భూమిలో పోషణనీ సంపదనీ ఇవ్వగల తత్వమూ ఈ దేశప్రజలలో కష్టించే తత్వమూ సంపదని సృష్టించగల సామర్ధ్యమూ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోండి!
అన్ని ప్రతికూలతల మధ్యన ఆస్థాయిలో వార్షిక ఆదాయాన్నీ ఆ స్థాయిలో వృద్ధి రేటునీ ఆ స్థాయిలో మార్కెట్ విస్తృతినీ చూపించిన దేశం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు!మోహన దాసు నుంచి మదన మోహను వరకు అంతా శ్రీవైష్ణవులే అయితే మరి బుట్టెడు చేపలూ ఏమైనాయి అన్నట్టు 1925ల నాడు కూడా ఇంగ్లీషువాళ్ళ ప్రభుత్వం మన అదృష్టం కొద్దీ వచ్చిందని పులకించి పోతూ జరిపిన ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం ఫలించిన 1947 మార్చి నాటికి మన అప్పు Rs. 2331.98 కోట్ల దగ్గిర నిలబడింది!
1947 నాటికి కేవలం ఋస్. 2331.98 కోట్ల దగ్గిర ఉన్న అప్పు 2019 నాటికి అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెల్లించాల్సిన సాలుసరి వడ్డీ ₹4,551,323,407,985 అయ్యేలా అంత అప్పు పెరగడానికి ప్రధానమైనదీ అతి ముఖ్యమైనదీ అయిన ద్రవ్యచట్టం చేసినది భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ అనే ఒక దేశద్రోహి అని ఎంతమందికి తెలుసు?
కేంద్రం మరియు రాష్ట్రాలు ఋణానంద లహరి.
రిప్లయితొలగించండిప్రభుత్వాలకు అప్పుల కుప్పలు.
ప్రజానీకానికి పప్పు బెల్లాలు.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి