‘మీ పుట్టిన రోజున ఏ పనీ పెట్టుకోకండి. ఆ రోజున పనికట్టుకుని వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. అదొక్కటే నేనిచ్చే సలహా’
ఓ పాతికేళ్ళక్రితం డాక్టర్ ప్రసాద్ గారు చెప్పిన మాట.
ఆ మాట ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసిన మాట కూడా
నిజం.
మళ్ళీ ఇన్నాల్టికి, ఈరోజు అంటే సాలు ఆఖరు రోజున ఆ మాట గుర్తుకు
వచ్చింది. డెబ్బయి అయిదేళ్ళ వయస్సులో వింటే పోలా అని ఆ వయసే చెప్పింది.
వెంటనే ఈరోజు పొద్దున్నే లేచి మా ఇంటికి ఆటోకు
దూరం,
నడక్కి దగ్గరగా వుండే విజయ డయాగ్నస్టిక్ సెంటర్ కి వెళ్లాను.
మా ఆవిడ వున్నప్పుడు అక్కడకి తరచూ వెడుతుండే
వాడిని. అందరూ తెలిసిన వాళ్ళే. ఒక్కరే వచ్చారేం అన్నప్పుడు మనసు కలుక్కుమంది.
ఎలాగూ ఫాస్టింగ్ టెస్ట్ కు వచ్చాను కదా అని అన్ని
రకాల టెస్టులు చేయించి ఇంటికి వచ్చాను.
సాయంత్రానికి రిపోర్టులు నెట్లో వచ్చాయి. మా డాక్టర్ కామేశ్వర రావుకి
పంపితే ఎక్సలెంట్ అని మెసేజ్ పెట్టాడు.
షుగర్ ఫాస్టు, పోస్టు, బీపీ.
క్రియాటి నైన్, సీయుయి,
పొటాషియం,
సోడియం, లివర్ ఫంక్షన్ బ్లడ్ యూరియా ఇలా
ఎన్నో నోరు తిరగని టెస్టులు అన్నీ నార్మల్.
బెడ్ రూమ్ టు బాత్ రూమ్ వాకింగ్. అలవాట్లా సరే!
చెప్పేదే లేదు.
మరి ఇది ఎలా!
(31-12-2021)
Congrats. Happy New Year.
రిప్లయితొలగించండిగుండ్రాయిలా ఉన్నారన్నమాట - భేషో భేషు!
రిప్లయితొలగించండిపన్లో పని - హ్యాప్పీ న్యూ యియరు భంశ్రీరా సారూ!!
hari S babu : మీ దయ వల్ల గుండ్రాయిలా కాకపోయినా 'భండ్రాయి'లా వున్నాను.
రిప్లయితొలగించండి