ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రతిపక్ష నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి. రామకృష్ణుడు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు గురించి సుదీర్ఘంగా మాట్లాడి, ప్రభుత్వ పధకాల అమలుకు అవసరమయితే అప్పులు చేసినా తప్పులేదన్న అర్ధం ధ్వనించేలా వ్యాఖ్యానించారు. పైగా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునేందుకు అవకాశం వుందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
రోశయ్య
లేచి ఇలా అన్నారు.
“అప్పులు
అభివృద్ధి కోసం అంటున్నారు, ఇదేమి
లాజిక్కో నాకు అర్ధం కాదు. పరిమితికి మించి ఓడీలు తీసుకుంటే నష్టపోయేది రాష్ట్రమే.
అయినా వంటింట్లో కూరగాయలు కోసే కత్తి
వుందని మెడ కోసుకుంటామా!” అని చమత్కరించారు.
తర్వాత
సభ బయట విలేకరులతో ముచ్చటిస్తూ ఇంకా ఇలా అన్నారు.
‘కాఫీపొడుం, పంచదార అయితే ఏదో అనుకోవచ్చు.
కానీ పప్పూ ఉప్పూ నూనె నెయ్యి
ఇలా ప్రతిదీ పొరుగింటమ్మ దగ్గర
చేబదులు తీసుకుని నడిపే దాన్ని సంసారం అనరు. ప్రభుత్వం అయినా అంతే’
05-12-2021
మంచిది. ఈమాటలు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి గారికి సవినయంగా విన్నవించగలరా?
రిప్లయితొలగించండి@అజ్ఞాత: సవినయంగానే కాదు, ఏ విధంగానూ విన్నవించగల అవకాశం నాకు లేదు. మీకు వుంటే ప్రయత్నించి చూడండి.
రిప్లయితొలగించండిలేరు , ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయ్
రిప్లయితొలగించండిలక్షల కోట్లు అప్పులు ఎవరు ఇస్తున్నారు? వడ్డీ ఎంత? ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేయడం పర్యవసానాలు ఏమిటి? అప్పులు చేయడానికి చట్టపరమైన పరిమితులు ఉన్నాయా? ఏ ధైర్యం తో అప్పులు తీసుకుంటున్నారు. ఇవి తీర్చగలిగే ఋణాలేనా? ఆర్థిక నిపుణులు వివరించాలి.
రిప్లయితొలగించండి