25, నవంబర్ 2021, గురువారం

పోలీసు జులుం – భండారు శ్రీనివాసరావు


ఏకాంబరం ఇంటికి పోలీసులు వచ్చారు. తలుపు తీశాడు. పోలీసులను చూడగానే పక్క పోర్షన్ వాళ్ళు తలుపులు మూసుకున్నారు.

వాళ్లు ఏదో అడిగారు. ఏకాంబరం ఏదో చెప్పాడు. మర్నాడు స్టేషన్ కు పలానా టైముకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.

ఏకాంబరానికి, అతడి భార్యకు భయంతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. సెలవు పెట్టి మర్నాడు పోలీసు స్టేషన్ కు వెళ్ళాడు. గంటలు గంటలు వెయిట్ చేయించి తర్వాత అసలు విషయం చెప్పారు, ఎవరో అనుకుని పొరబాటున అతడి ఇంటికి వచ్చారుట. వాళ్ళ మాటలో ఏమాత్రం క్షమాపణ ధోరణి ధ్వనించలేదు. అయినా  ఏకాంబరం కిమ్మనకుండా బతుకు జీవుడా అంటూ  బయట పడ్డాడు.

అదే రాజకీయ రక్ష రేకు వుంటే... మొత్తం కధే వేరుగా వుండేది.

ఈ దేశంలో చట్టాలు సామాన్యులపట్ల ఒక రకంగా, అసామాన్యుల పట్ల మరోరకంగా అమలవుతాయి.

ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. టీవీ పెడితే చాలు, పేపరు తిరగేస్తే చాలు. ఇవే వార్తలు.

1 కామెంట్‌:

  1. మీకు కనీసం ఒక వార్డ్ మెంబెర్ తెలిసినా చాలు , మర్డర్ కేసు నుండి కూడా బయటకి వచ్చేయొచ్చు .
    మా ఊళ్ళో కేసు రాయాలంటే ఎమ్మెల్యే చెప్పాలి . లేకపోతె అది పెద్ద జంజాటం .

    రిప్లయితొలగించండి