1975 నవంబరులో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో, న్యూస్ యూనిట్ లో చేరినప్పుడు మొదటి నెల జీతం నగదు రూపంలో ఇస్తూ క్యాషియర్ సలహా ఇచ్చాడు, ఏదైనా బ్యాంకులో ఖాతా తెరిచి ఆ వివరాలు ఇమ్మని. రేడియో అక్కౌంట్ కోటీ, బ్యాంక్ స్ట్రీట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ హెడ్ ఆఫీసులో వుంది. అక్కడికి వెళ్లి పలానా చోట పనిచేస్తున్నాను అని చెప్పాను. బ్యాంకు మేనేజరే నాకు రిఫరెన్స్ సంతకం చేయడంతో వెంటనే అక్కౌంట్ ఓపెన్ చేయగలిగాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నలభయ్ ఆరేళ్లుగా నా అక్కౌంట్ ఆ బ్రాంచిలోనే వుంది. ఎన్నో ఇళ్లు మారాను కానీ బ్యాంకు అక్కౌంట్ వేరే బ్రాంచికి మార్చలేదు. ఈ క్రమంలో అక్కడ పనిచేసేవాళ్ళు సిబ్బంది, అధికారులు పరిచయం అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా అదే బ్యాంకు. అదే బ్రాంచి. ఆ బ్యాంకు యాడ్స్ లో పేర్కొన్నట్టు “STATE BANK MY BANK”.
కొద్దిసేపటి
క్రితం ఒకతను ఫోన్ చేశాడు, ‘కోటీ
ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాను, మీ వివరాలు
చెప్పండ’ని.
నేను
అన్నాను. ‘ప్రతి పది రోజులకి బ్యాంకు నుంచి ఓ మెసేజ్ వస్తుంటుంది, వేరేవారికి
మీ వివరాలు చెప్పొద్దు, బ్యాంకు ఎన్నడూ అలాంటివి అడగదు అని. మరి మీరేమిటి, పేరు డిజిగ్నేషన్
కూడా చెప్పకుండా! నా మెయిల్ ఐ డి మీ దగ్గర వుంది, ఏదైనా కావాలి అంటే మెయిల్ చేయొచ్చు కదా’ అని.
అతగాడు అన్నాడు, ‘మీరు నేను చెప్పేది వింటారా, మీరు
చెప్పేదే నేను వినాలా’ అని.
‘చాలాకాలం నుంచి మీ కష్టమర్ గా ఉంటున్నాను, కనీసం ఆ
అవకాశం నాకెందుకు ఇవ్వరు’ అని అడిగాను.
‘మీరు చెబుతారా కాల్ కట్ చేయమంటారా’ అని కాస్త గద్దింపుగా
అన్నాడు. ‘ఫోన్ చేసింది మీరు నన్ను అడుగుతారేమిటి’ అనేది నా జవాబు.
వెంటనే కాల్ కట్ చేశాడు.
అతడు నిజమైన బ్యాంకు ఉద్యోగే అయి ఉండవచ్చు. కానీ ఫోన్
చేసి తన పేరు, హోదా ప్రవర
చెప్పుకుని పలానా శ్రీనివాసరావుతోనే మాట్లాడుతున్నాను అనేది వెరిఫై చేసుకుని
సంభాషణ సాగించి వుంటే ఈ తకరారు వచ్చేదే కాదు. (అతడు ఫోన్ చేసిన నెంబరు ల్యాండ్ లైన్ నుంచి. 04023466703)
పైగా ఎంతో కాలం క్రితమే నేను నా బ్యాంకు ఖాతాను అటు ఆధార్
తో, ఇటు నా
మొబైల్ తో లింక్ చేశాను కూడా.
అయినా ఇప్పుడీ ఈ
వివరాల ఆరాలు ఎందుకో ఏమిటో మరి.
అది ఫ్రాడ్ ప్రయత్నం అని వేరే చెప్పాలా? అందుకే కాల్ కట్ చేశాడు. అంతకు ముందు ఆ గద్దింపు ఎందుకంటే దానికి కొంచెం భయపడిపోయి కొంతమంది అ వివరాలు చెప్పే అవకాశం ఉంటుందని. అ కాల్ అయిపోయిన తరువాత మీకేమైనా మెయిల్ వచ్చిందా ఆ వివరాల కోసం? 99% ఏమీ వచ్చుండదు.
రిప్లయితొలగించండిమీరు ఆ కాల్ ని బాగా handle చేశారు. ఆ కాల్ వచ్చిన నెంబర్ ను Cyber Crime Police వారికి తెలియజేయడం కూడా చెయ్యవచ్చు.
ఈ మధ్య విరివిగా కనిపిస్తున్న మరొక మార్గం మీ SBI account block అయింది, విడుదల కోసం ఈ క్రింది link మీద నొక్కండి అని SMS పంపించడం. అటువంటిదేమీ నొక్కకండి. వెంటనే ఆ మెసేజ్ ని delete చేసి పడెయ్యండి.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న సామెతలాగా తయారయింది ఈ డిజిటల్ లోకం.
@ విన్నకోట నరసింహారావు గారికి ధన్యవాదాలు. మెయిల్ రాలేదు
రిప్లయితొలగించండిits fake call. You know that no one asks for any details.
రిప్లయితొలగించండి