కింది చిత్రంలో మాస్క్ తో వున్నది మా ఆవిడ నిర్మల. ఆమె చనిపోయిన ఆరేడు నెలల తర్వాత కానీ కరోనా మన దేశంలో అడుగుపెట్టలేదు. అప్పటికి ఇలా మాస్కులు పెట్టుకుని తిరగడం అలవాటు లేదు.
అంతకు
ముందు సంవత్సరం అంటే 2018లో
అనుకుంటా, మా
అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్రబోస్, హైదరాబాదులోని మా కుటుంబాలను తీసుకుని మహబూబ్
నగర్ జిల్లాలో కొన్ని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు చూపించాడు. ఆ క్రమంలో మా అందర్నీ ఇనుప చువ్వలు, కడ్డీలు
తయారు చేసే ఓ కర్మాగారానికి తీసుకువెళ్లాడు.
అక్కడి నిబంధనల ప్రకారం మాస్కులు ధరించాలి. కాకపొతే, అవి వాళ్ళే ఇచ్చారు.
అప్పటి
ఫోటో ఇది.
(13-09-2021)
యాద్ గారే
రిప్లయితొలగించండి