18, సెప్టెంబర్ 2021, శనివారం

స్వరం మార్చడమే రాజకీయమా!

 గతంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్నవాళ్ళు ఇప్పుడు అదే నోటితో రాజకీయ కుట్ర అంటుంటారు.

లోగడ ఇలాంటి కేసులు కేవలం రాజకీయ కక్షతో పెట్టినవని ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రస్తుతం చట్టం గురించి ఇలా నీతి బోధలు చేస్తుంటారు.

జనాలకు ఏదీ కలకాలం జ్ఞాపకం వుండదనే ధీమా కాబోలు.


రాజకీయ నాయకుల యాస భాష గురించి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ఇవి చర్చలకే పరిమితం అవుతున్నాయి తప్ప సాధారణజనాన్ని కదిలిస్తున్నట్టు లేదు. కారణం, గొంగట్లో అన్నం తినడం వారికి చాలాకాలంగా అలవాటు అయింది. వెంట్రుకలు గురించి వారికి బెంగ లేదు.

(18-09-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి