గూగుల్ ఇమేజ్ సెర్చ్ చేస్తుంటే ఒక కార్టూన్ కనిపించింది.
కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
కృతజ్ఞతలు తెలపాల్సిన కౌంటర్ దగ్గర మాత్రం ఒక్క మనిషీ కనబడడు.
ఆ కార్టూన్, వర్తమాన ప్రపంచానికి, ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
కొన్నాళ్ళ తరువాతో, కొన్నేళ్ళ తరువాతో పిల్లలకు ‘కృతజ్ఞత’ గురించి తెలియచెప్పాలంటే, మ్యూజియంకు తీసుకు వెళ్ళాలేమో!
బయట ప్రపంచంలో కానరాని వాటిని చూడగలిగేది మ్యూజియంలలోనే కదా!
NOTE: Courtesy Image Owner
మన ఇబ్బందులను మాటల్లో చెప్పక తప్పదు కదా. మన ఇబ్బందులను చెప్పకుండా ఇతరులు తరచుగా కచ్చితంగా ఎలా తెలుసుకుంటారు?
రిప్లయితొలగించండిమన కృతజ్ఞతను మాటల్లో చెప్పనవసరం కూడా లేదు కదా - మరీ ఇంగ్లీషు వాడి ఊతపదం thanks మాత్రమే సరి అనుకొనే అమాయకత్వం లేనప్పుడు.
ఇలా అలోచించి చూడండి.