ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు:
“ఐ.ఐ.టి.
టాపర్ మీరు. ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”
“ఐ.ఏ.ఎస్.
అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని భావించాను”
విలేకరి:
“మీరు
ఒక ఐ.ఏ.ఎస్. అధికారి అయివుండి ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని
అనుకుంటున్నారు?”
“రాజకీయాల్లో
వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”
విలేకరి:
“రాజకీయాల్లోకి
వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”
“అలా
అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”
ఇలాంటి
సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!
చివరికి
ప్రజాసేవ కూడా సోషలిజం లాగా అర్ధం పర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.
తపస్సు
చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.
IAS IPS లు, నటులు కొంతమంది రాజకీయాల్లోకి దూకి బొక్క బోర్లా పడి పోయారు.
రిప్లయితొలగించండిస్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: అని భగవద్గీత బోధిస్తుంది.