కొంతమంది పిల్లలు ఉన్నారు, కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి.
ఒక్కొక్క పిల్లవానికి ఒక్కొక్క పండు
ఇస్తే ఒక పండు మిగులుతుంది. ఒక్కొక్క పిల్లవానికి రెండు పండ్లు ఇస్తే ఒక
పిల్లవానికి పండ్లు తక్కువవుతాయి. అయితే ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి?
జవాబు: ముగ్గురు పిల్లలు, నాలుగు మామిడి పండ్లు
పిల్లలు ముగ్గురు, పండ్లు నాలుగు కాబట్టి ఓకే. పేచీ
లేదు. మా సమస్య అది కాదు. వున్నది ఇంట్లో ముగ్గురం. అందులో ఇద్దరు, నా కొడుకు, కోడలు మామిడి పండ్లు అంతగా ఇష్టపడరు. నా కోసం
వాళ్ళు బజార్లో కొన్ని పళ్ళు కొనుక్కుని వస్తారు, కర్ఫ్యూ లేని సమయంలో. అవన్నీ నేను
తినలేను. పాడయిపోతాయని నేనే వంట మనిషికి, పని మనిషికి ఇచ్చేస్తుంటాను.
అలాంటిది నిన్న ఒక మిత్రుడు, మిత్రుడు అనడం కంటే
పెద్దమనిషి అనడమే సబబు, రెండు
బాక్సులు ఇంటికి పంపారు. తెరిచి చూస్తే అన్నీ మామిడి పండ్లు. అవి వారి తోటలో
కాసినవని చెప్పారు. పేరు బేనిషా మామిడి.
ఏం చేసుకుంటాం అని ఆలోచించే లోగా ఇద్దరూ కలిసి
అపార్ట్ మెంటులో అందరికీ పంచి పెట్టి వచ్చారు. వలలికి (వంటావిడ), పనివాళ్ళకి
పంచేశారు. మంచి పనిచేశారు అనిపించింది.
కాగా మిగిలినవి ఇవి.
ఇప్పుడూ అదే సమస్య. వున్నది ముగ్గురం,
మిగిలినవి ఇన్ని.
చూద్దాం. ప్రతి మామిడిపండు మీద అది తినేవాడి పేరు రాసే
వుంటుంది కదా!
(09-06-2021)
బేనిషా లేకా బేనిషాన్ అని తెలంగాణా ప్రాంతం లో పిలవబడే మామిడిపండు రాయలసీమ ఆంధ్ర ప్రాంతం లో బంగినపల్లి (బనగానపల్లి) గా ప్రసిద్ధం.
రిప్లయితొలగించండిబేనిషాన్ అంటే మచ్చ లేనిది blemishless అన్న అర్థం ఉంది. ఆంధ్ర ప్రాంతం వారు రసాలు ఎక్కువగా ఇష్ట పడుతారు. రాయలసీమ వాసులకు బంగినపల్లి రకం బాగా ఇష్టం.
@GKK _ Thanks for the information.
రిప్లయితొలగించండి