మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
మనం ఒకరిని అభిమానించేది.......
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికేనా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికేనా?
పొద్దస్తమానం ఆగర్భ శత్రువుల్లా పోట్లాడుకోవడానికేనా?
ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో
ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో
ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో
ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడకుండా ఉండడానికి వీలుంటుందో
ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే విశాలమైన మనస్సు ఉంటుందో
ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలనే పంతాలు, పట్టింపులు వుండవో
ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు” మాత్రమే చోటుంటుందో
ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే అలాటివాళ్ళు గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.
ఆలోచించండి.
..... into that heaven of freedom, My Father, let my country awake అన్నాడు కదా టాగోర్.
రిప్లయితొలగించండిపైన మీ కవిత చివరలో ....... into that heaven of maturity let mankind awake అనుకుందామా మనం?
👌👌👌👌👌
రిప్లయితొలగించండి👌👌👌👌👌
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు గారు - అవునండీ
రిప్లయితొలగించండి>>ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో
రిప్లయితొలగించండిGr8