లాక్ డౌన్ విధించడానికన్నా లాక్ డౌన్ ఎత్తివేయడానికి ముందు చూపు కావాలి. లాక్ డౌన్ కాలంలో ఆంక్షలు పాటించేలా చూస్తే సరిపోతుంది. కానీ ఎత్తివేసినప్పుడు జనం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం వుంది. పైగా మూడో వేవ్ ముంచుకు వస్తోందని హెచ్చరికలు వస్తున్న తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా, జాగరూకులుగా ఉండాల్సి వుంటుంది. గతంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన సమయంలో చూశాము. జనం ఒక్కసారిగా వీధుల్లోకి ఎగబడ్డారు. రేపటి నుంచి ఎలాటి ఆంక్షలు ఉండవని అంటున్నారు. సినిమా హాళ్ళు తెరవడానికి సిద్ధం అంటూ అప్పుడే ప్రకటనలు వెలువడుతున్నాయి. విధి విధానాలు ఏమిటో పూర్తిగా ఇంకా వెలుగులోకి రాలేదు. కానీ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. జులై నుంచి స్కూళ్ళు తెరుస్తారు. అలాగే సినిమా హాళ్ళు, జనం పోగయ్యే బార్లూ, క్లబ్బులూ తెరుచుకోవచ్చు. వాళ్ళు వరసలో మొదటే వుంటారు. మెట్రో రైళ్లు, లోకల్ రైళ్లు, సిటీ బస్సులు, జిల్లాల బస్సులు యధాతధంగా నడిచే అవకాశం వుంది. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర మంత్రివత్గం తీసుకున్న ఈ నిర్ణయంలోని పూర్తి వివరాలు వెల్లడవుతాయి. లాక్ డౌన్ ఎత్తివేయడం అంటే నిరుడు మార్చిలో లాక్ డౌన్ విధించడానికి ముందున్న పరిస్థితి అన్నమాట. అంటే పదిహేను మాసాల క్రితం రాష్ట్రంలో జనజీవనం ఎలా సాగేదో మళ్ళీ అలాగే మొదలవుతుందని అర్ధం చేసుకోవచ్చు.
19, జూన్ 2021, శనివారం
సుదీర్ఘ విరామం తర్వాత సాధారణ జనజీవనం దిశగా తెలంగాణా – భండారు శ్రీనివాసరావు
ఒక పక్క కేంద్రం మూడో వేవ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. లాక్ డౌన్ విడతల వారీగా సడలిస్తే మంచిదని సూచనలు చేస్తోంది. అయితే ఈలోగా రాష్ట్ర మంత్రివర్గం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది.
ఇక ఇప్పుడు బంతి ప్రజల కోర్టులో పడింది. స్వీయ నియంత్రణ పాటించాల్సిన బృహత్తరమైన బాధ్యత వారిపై వుంది. ఎవరు తేలిగ్గా తీసుకున్నా దాని దారుణ ప్రభావం సమాజం మొత్తం పైనా పడుతుంది.
స్కూల్లు తెరవడానికి మరో పది రోజుల వ్యవధానం వుంది. ఈ లోగా వాటిని పరిసరాలను పూర్తిగా శానిటైజ్ చేయించాలి. అలాగే సిటీ బస్సులు, రైళ్లు. సినిమా హాళ్ళు తెరవడానికి సిద్ధం అని యజమానులు అంటున్నారు. ఇన్నాళ్ళు మూతపడిన వాటిని తెరిచేముందు మళ్ళీ జాగ్రత్తగా శానిటైజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. అలాగే క్లబ్బులు, బార్ల యజమానులు కూడా.
జనం కూడా తెరవగానే వాటిపై విరగబడడం మానుకోవాలి. కొన్నాళ్ళు వేచి చూసిన తర్వాతనే బార్లకు, క్లబ్బులకు, సినిమాలకు వెళ్ళడం మంచిది.
(19-06-2021)
// “ లాక్ డౌన్ విధించడానికన్నా లాక్ డౌన్ ఎత్తివేయడానికి ముందు చూపు కావాలి. ” //
రిప్లయితొలగించండిఅసలు కిటుకంతా దాంట్లోనే దాగుంది కదా?
————-
// “ స్వీయ నియంత్రణ ” //
మన దేశంలో ఇదొక బూతు పదం లాంటిది. “ఆయనే ఉంటే ……” సామెత. వ్యాపారం ఎలాగైనా చేసుకోవాలనుకునే వాడికి, క్రమశిక్షణా రాహిత్యాన్ని తమ హక్కుగా భావించే జనాలకు .. మీరు చెప్పినవేవీ పట్టవు. రేటింగులే పరమావధిగా వ్యవహరించే మీడియా సంగతి మాత్రం ఏమిటి?
ఏతావాతా చెప్పేదేమిటంటే మరి కొన్ని రోజులు కొనసాగిస్తే శ్రేయస్కరంగా ఉండేదేమో?
కేసీయార్: _సోమవారం నుండి తెలంగాణ లో పూర్తి స్థాయి అన్‌లాక్._
రిప్లయితొలగించండిఅంతరార్థం: _తగలబెట్టండి నిరంజన్ గారు. లాక్‌డౌన్ లోనే కొంత మంది జనాలిలా వారికి తోచినట్టు ఉండి మాస్కు, శానిటైజేషన్, సామాజిక దూరం పాటించ కుండ ప్రభుత్వం పైనే భారం వేస్తే.. కాపాడే మూడూ, ఉత్సాహం రెండూ సర్వనాశనమైపోతాయి. ఇహ మా వల్ల కాదు. డాక్టర్ లంటే చులకన, పోలిసులంటే బేఖాతర్, ఇహ మీ ఆరోగ్యం మీ చేతిలోనే._
#కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ మ్యూటేట్ మే బీ కమింగ్ సూన్. #థర్డ్ వేవ్ ఇన్ క్వెశ్చన్
పూర్తి స్థాయి టికాకరణ వరకైనా ఫూల్ కాకున్న పార్షియల్ లాక్‌డౌన్ ఉన్నా బాగుండేది. అలా అయ్యి ఉంటే జన సాధారణం కావలసి నపుడే వచ్చే వారు. ఇపూడే ఆటోలు కిక్కిరిసి ఉన్నాయి, ట్రిపల్ రైడింగ్ పెరుగుతు వస్తోంది. ప్చ్.. ఇలాగే కొనసాగితే ఎలా ఉంటుందనేదే భయం, విస్తు గొలిపే విషయాలు..!