3, మే 2021, సోమవారం

సబ్బం హరి ఇక లేరు

 నేను ఆలిండియా రేడియోలో పనిచేసేటప్పుడు విశాఖపట్నంలో మా రేడియో ప్రతినిధి, నా సీనియర్ కొలీగ్ బి.ఎన్ రావు (నారాయణరావు) ద్వారా  శ్రీ సబ్బం హరితో  పరిచయం. వైజాగ్ లో వుండే విలేకరులకే కాకుండా మొత్తం ఉత్తరాంధ్రాలోని జర్నలిస్టులు అందరికీ ఆయన ఇష్టుడు. పార్లమెంట్ సభ్యుడు కావడం వల్ల హైదరాబాదులో వుండే మా బోంట్లకు వ్యక్తిగత పరిచయం కాస్త తక్కువే. కాకపొతే, ఫోన్ చేస్తే  ఎక్కడ వున్నా వెంటనే  స్పందించి  ఓపికగా అడిగిన వాటికి జవాబు చెప్పేవారు. నేను రిటైర్ అయిన తర్వాత అనేక టీవీ డిబేట్లలో వారితో కలిసి పాల్గొనే అవకాశం నాకు లభించింది. విషయాన్ని విపులీకరించే తీరు అందర్నీ ఆకట్టుకునేది. విషయ పరిజ్ఞానం కలిగిన రాజకీయ నాయకుడు కావడం వల్ల టీవీ చర్చల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆయన హఠాన్మరణ వార్త కలచి వేసింది. పెద్ద వయసు కాదు. రాజకీయాల నుంచి కొంత పక్కకు తప్పుకుని రాజకీయ విశ్లేషణలకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నారు.

సబ్బం హరి గారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.  

(03-05-2021)

2 కామెంట్‌లు:

  1. అవునండి, సబ్బం హరి గారు మంచి విశ్లేషకుడు. సమతుల్యం పాటించి మాట్లాడేవారు.

    వారి అకాలమరణం దిగ్భ్రాంతి కలిగించే విషయమే.
    వారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏.

    రిప్లయితొలగించండి
  2. రాష్ట్రవిభజన సందర్భంగా ఆంధ్రప్రాంతమిత్రులు చాలామందికి విభజనవిషయంలో వ్యతిరేకత ఉన్నా ప్రొ.కోదండరామ్ గారు ఓపికగా మాట్లాడే విధానానికి అభిమానులైనారు. అలాగే సబ్బంహరి గారిని రెండు రాష్ట్రాల్లో ఎంతో మంది ఇష్టపడుతారు. వారి అకాల మరణం తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ..

    రిప్లయితొలగించండి