8, మే 2021, శనివారం

నస్మరంతి గాడు

 ఇది ముళ్ళపూడి వారు సృష్టించిన పదం

“పెళ్ళయి పదేళ్లవుతున్నా పెళ్ళానికి పుట్టింటి పేరు మీదనే ఉత్తరాలు వస్తుంటే ఆ మొగుడు ముండావాడిని ‘నస్మరంతిగాడు అంటారని అప్పుడెప్పుడో రాఘవయ్య గారి జ్యోతి పత్రికలో ఆయన  రాశారు. అంటే, ఎవరూ పట్టించుకోని వాడిని గురించి ముళ్ళపూడి వెంకట రమణ గారు తనదైన శైలిలో అలా భాష్యం చెప్పారు.

ఫోను సంభాషణలో ఈ విషయం నానుంచి విన్న మిత్రుడు ఒకరు మరో ఆసక్తికరమైన విషయం దీనికి జోడించాడు.

“ఈ ఫేస్ బుక్ ప్రపంచంలో పోస్టు పెట్టి పది గంటలు అయినా ఒక్క లైకు కానీ, చిన్నమెత్తు కామెంటు కానీ రాకపోతే అతడ్ని కూడా నస్మరంతి అంటారుష”

1 కామెంట్‌:

  1. >> పోస్టు పెట్టి పది గంటలు అయినా ఒక్క లైకు కానీ, చిన్నమెత్తు కామెంటు కానీ రాకపోతే అతడ్ని కూడా నస్మరంతి అంటారుష
    ఫేస్‌బుక్ అనేమిటీ బ్లాగులకూ ఇది భేషుగ్గా వర్తిస్తుంది కదా!

    రిప్లయితొలగించండి