మా వాచ్ మన్ భార్య చెప్పింది. వాళ్లకు తెలిసిన వాళ్లకు ఒంట్లో నలతగా వుంటే ఓ డాక్టరు దగ్గరికి వెళ్ళారుట. కన్సల్టేషన్ వంద రూపాయలే తీసుకుంటాడు కనుక మంచి డాక్టరు అని వాళ్ళ నమ్మకం.
తీరా వెడితే, వీళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా ఓ కాగితం మీద సీటీ స్కాన్ అని రాసి, అది ఎక్కడ తీసుకోవాలో అది కూడా చెప్పి, ఆ రిపోర్టుతో రమ్మని తన ఫీజు నూర్రూపాయలు తీసుకుని పంపించేశాడుట.
సీటీ స్కాన్ అంటే వేలతో వ్యవహారం. ఇలా ప్రతి చిన్న విషయానికి అంత పెద్ద టెస్టులు రాయాల్సిన అవసరం ఉంటుందా!
క్లినిక్కుల వాళ్ళే ఇలా చేస్తుంటే, కార్పొరేట్ వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోరు కదా!
“చిన చేపను పెద చేప. చిన మాయను పెను మాయ. అది స్వాహా. ఇది స్వాహా’
(01-05-2021)
కమీషన్లండీ కమీషన్లు.
రిప్లయితొలగించండిచెత్తను ఏ పేరుతో పిలిచినా అది చెత్తే.
రిప్లయితొలగించండిఈ రోజే మా స్నేహితుడ్ని హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చాం. నార్మల్ బెడ్ విత్ ఆక్సిజన్ కోసం రోజుకి 50,000/- వసూలు చేస్తున్నారు.
రిప్లయితొలగించండిఆంధ్రాలో వెంటీలేటర్ మీదుంటే రోజుకి 13,500/- వసూలు చెయ్యాలని ప్రైవేట్ హాస్పిటల్ వాల్లు నిర్ణయించారు.
కోవిడ్ మేనేజ్మెంట్ విషయంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యాడని.. తెలంగాణాలోకూడా చెప్పుకుంటున్నారు.
కాకినాడలో ఈరోజున ఒక ప్రముఖ ఆస్పత్రిలో 50,000 డిపాజిట్ + రోజుకు 25,000 అడీగారు.
తొలగించండిఈ విషయం.. జగన్ కి గానీ, చెంద్రబాబుకి గానీ ప్రూఫ్స్ తో సహా పంపించారా?
తొలగించండిmy brother went to King koti hospital in hyd and came back home totally recovered, he said it is much much better than any pvt hospital
రిప్లయితొలగించండికొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్న వారు సీటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. సీటీ స్కాన్‌లో కొనిపించే కొన్ని ప్యాచ్‌లు ఎలాంటి చికిత్స లేకుండానే మాయమైపోతాయన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. లక్షణాలు లేని 30-40 శాతం మందిలో సీటీ స్కాన్ చేయించుకుంటే కొవిడ్ పాజిటివ్ అనే వస్తోందని పలు అధ్యయనాల్లో వెల్లడైందన్నారు. అలాగే, అందులో కనిపించే ప్యాచ్‌లు ఎలాంటి చికిత్స లేకున్నా మాయమైపోతాయన్నారు.
రిప్లయితొలగించండిఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్‌రేలకు సమానమని, అంతేకాక మున్ముందు కేన్సర్ బారినపడే అవకాశం కూడా ఉంటుందన్నారు. ముఖ్యంగా యువతలో ఈ ముప్పు మరింత ఎక్కువన్నారు. కాబట్టి ఏదైనా అనుమానం ఉంటే తొలుత చాతీ ఎక్స్‌రే తీయించుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో సీటీ స్కాన్‌కు వెళ్లాలా? వద్దా? అనే దానిపై వైద్యులు సరైన సలహా ఇస్తారని గులేరియా పేర్కొన్నారు.
అలాగే, కరోనా పాజిటివ్‌గా తేలి, తేలికపాటి లక్షణాలు ఉన్న వారు రక్త పరీక్షలకు కూడా వెళ్లాల్సిన పనిలేదన్నారు. బయోమేకర్స్ హానికరమని, సీటీ స్కాన్‌ను కూడా అత్యవసరమైతేనే చేయించాలని సూచించారు. కరోనా తొలి దశలో స్టెరాయిడ్స్‌ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల న్యూమోనియాకు దారితీసే అవకాశం ఉందని, ఫలితంగా అది ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉందన్నారు. తేలికపాటి కేసుల్లో సాధారణ మందులతో కొవిడ్ నయమైపోతుందని డాక్టర్ గులేరియా వివరించారు.
దారుణం కదా. ఈ మధ్య ఒక చిన్న స్కిన్ ప్రాబ్లెమ్ అని వెళితే తలలోని పేలకు మందు రాసిచ్చింది మా డాక్టర్. ఆమె పొరపాటు నేను కనుక్కోవడానికి నాలుగు నెలలు అయ్యింది!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇక మా సంగతి చూడండి. మన గోడు ఎవరూ పట్టించుకునే వారు లేరు. కానీ, మనలో మనకన్నా తెలియాలని చెపుతున్నా. 10రోజుల క్రితం మా పాపకి నడుము నొప్పి అని ఏడ్చింది. ఏదోలే అని జండూబామ్తో సరిపెట్టాం. ఆ రాత్రికి ఓకే. తర్వాత రోజు రాత్రి కూడా ఇదే తంతు. అసలే కరోనా టైం. ఏదైతే అది అయిందని.. రాత్రి 11 గంటలకు ఓ పిల్లల హాస్పటల్కు వెళ్ళాం. మామూలుగా ఫీజు 300. 10దాటితే 500 అంట. సరే ఇచ్చుకున్నాం. తీరా కనీసం పాపను పట్టుకోకుండానే ఏంటి? అన్నారు డాక్టర్. నడుము నొప్పి అని బాధ పడుతుంది అని చెపితే MRI SCAN తీసుకురమ్మన్నాడు. అది అంత మంచిది కాదుకదా చిన్నపిల్లలకు అని అడిగితే ఏం కాదు అంటూ వారి కన్సల్టెంట్ చీటి రాసి తీసుకు రమ్మన్నాడు. ఎంత దుర్మార్గమో చూడండి. మరి ఇప్పుడు నొప్పి సంగతి సార్ అని అడిగితే ఒక కాంబిఫామ్ వేయమన్నాడు. పేరుకు ఎం.డి. ఎందుకు పనికిరాని వెధవవాడు. కాంబిఫామ్ కోసం అర్ధరాత్రి వెళ్ళి ఎమ్. ఆర్.ఐ స్కాన్ చేయించాలని సెలవిచ్చాడు సదరు డాక్టర్. అవన్నీ చెత్తకుప్పలో వేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాం. వాళ్ళ తప్పు కాదు. మనమో తెగ హడావుడి పడతాం. ఎంతైనా ప్రాణం అంటే తీపి కదా మనిషికి.
రిప్లయితొలగించండి