ఫేస్
బుక్ మిత్రురాలు శ్రీమతి షమీర్ జానకిదేవి,
సంజీవరావు దంపతులకు కరోనా గర్భశోకం మిగుల్చింది. ముప్పయ్యేళ్లు కూడా నిండని వారి చిన్న కుమార్తె ఈ
తెల్లవారుఝాఅమున కన్ను మూసింది. ఆరేడు నెలల పసివాడిని ఈ లోకంలో వదిలేసి.
బ్యాంకు
ఉద్యోగం చేస్తున్నప్పుడు,
రిటైర్ అయిన తర్వాత కూడా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఉత్సాహం చూపే
జానకి గారెకి ఈ దుర్ఘటన శరాఘాతం.
రెండేళ్ల
క్రితం మా ఆవిడ చనిపోయినప్పుడు ఆ విషయం తెలుసుకున్న జానకి గారు, ఆవిడ భర్త సంజీవరావు గారు అతికష్టం మీద అడ్రసు పట్టుకుని వచ్చి పరామర్శించి
వెళ్ళారు.
కుమార్తె
భౌతిక కాయాన్ని వారికే అప్పగించడానికి వీలులేని రోజుల్లో ఆ దంపతులను ఓదార్చడానికి ఎవరు వెళ్ళాలి?
ఈ
కష్టం పగవారికి కూడా రాకూడదు.
కింది ఫోటో: జానకి గారి అల్లుడు, చనిపోయిన కుమార్తె, ఆరేడు నెలల బాబు
అవునండి, రాకూడని కష్టమే.
రిప్లయితొలగించండిఒకప్పుడు నా క్లాస్-మేట్ చెల్లెలు అలాగే పోయింది, తల్లితండ్రులు బతికుండగానే. వివాహిత కూడానూ.
క్రితం వారమే నా రిటైర్డ్ కొలీగ్ యొక్క 40 యేళ్ళ కూతురు (వివాహిత) హాస్పిటల్లో పోయింది.
ఇవన్నీ కడుపుకోతలు.