21, ఏప్రిల్ 2021, బుధవారం

అతి విలువైన సంచితం – భండారు శ్రీనివాసరావు

 

పుస్తక ప్రేమికులు దేవినేని మధుసూదన రావు గారు. సాంఘిక మాధ్యమాల ద్వారానే పరిచయం. ఎప్పుడో ముప్పయ్యేళ్ల క్రితం నా మాస్కో అనుభవాలను బ్లాగులో రాసుకుంటే వరసగా చదివి, వాటిని పుస్తకంగా తీసుకుని రావాలన్న వయోధిక పాత్రికేయ సంఘం వారి పూనికకు మద్దతుగా నిలిచారు. తనకు నచ్చిన పుస్తకాన్ని వందల ప్రతులు ముద్రించి తెలిసిన వారి వివాహాలలో పెళ్లి కానుకగా అందచేయడం ఆయనకు ఉన్న ఓ గొప్ప అలవాటు. అందుకే వారికి పుస్తక ప్రేమికులు అని ట్యాగ్ లైన్ తగిలిస్తుంటాను.
మళ్ళీ ఇన్నాళ్ళకు మరో పుస్తక ప్రేమికులు ఫేస్ బుక్ లో దర్శనం ఇచ్చారు. వారి పేరు సుప్రసిద్ధం. V. Chowdary Jampala గారు. పరిచయం అక్కరలేని నామధేయం.
జీవిత చరిత్రలకు సంబంధించి జంపాల గారు ఈరోజు రెండు పోస్టులు పెట్టారు. అసూయ కలిగించే విధంగా వున్నది వారి గ్రంధ సేకరణ అలవాటు. దాదాపు నూట అరవై జీవిత చరిత్రల పుస్తకాల ముఖచిత్రాలను ఈ పోస్టుల్లో పొందుపరిచారు. ఈ సేకరణ నిమిత్తం వారు ఎంతగా శ్రమ పడివుంటారో అనిపించింది. ఏమైనా ఇంతటి విలువైన సంపదను కష్టపడి సముపార్జించుకున్నందుకు అభినందనలు, అభివాదాలు. అన్నీ అని చెప్పలేను కానీ అతి కొద్దిగా అయినా వీటిలో కొన్ని నా దగ్గర కూడా వున్నందుకు గర్వపడ్డాను.
మరొక గర్వ కారణం కూడా వుంది. నేను రాసిన వాటిలో మొట్టమొదటిసారి, బహుశా చివరి సారి కూడా కావచ్చు, ‘అచ్చు మొహం’ చూసిన నా ఏకైక పుస్తకం మాస్కో అనుభవాల సమాహారం ‘మార్పు చూసిన కళ్ళు’ కూడా వారి పుస్తక ఖజానాలో చోటు చేసుకుంది. ఈ అద్భుత అవకాశం కల్పించిన వారికి, వారి పుస్తక ప్రేమకు సహస్రాధిక వందనాలు. – భండారు శ్రీనివాసరావు
(21-04-2021)
May be an image of book and text that says 'మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు) భండారు శ్రీనివాసరావు தனး పాత్రికేయ Meser Journalists ప్రచురణ వయోధిక త్రికేయ సంఘం ఆంధ్రప్రదేశ్'

Like
Comment
Share

0 Comments


4 కామెంట్‌లు:

  1. అవునండి, డాక్టర్ జంపాల చౌదరి గారు సాహితీపిపాసి. నేనొకసారి అమెరికా లోని చికాగో నగరం వెళ్ళినప్పుడు అక్కడే నివసిస్తున్న జంపాల గారింటికి కూడా వెళ్ళడం జరిగింది (నిజానికి మా తమ్ముడు, ప్రవాసకవి అయిన విన్నకోట రవిశంకర్ కు జంపాల గారితో బాగా పరిచయం). చౌదరి గారు తన ఇంటిలోని తన గ్రంథాలయాన్ని చూపించారు. ముఖ్యంగా తన ఇంటి బేస్-మెంట్ కు కూడా తీసుకువెళ్ళి చూపించారు - అదంతా పుస్తకాలతో నిండి పోయి ఉంది. అంత ఓపిక, సమయం వెచ్చించి అమర్చుకున్నారు ఆ గ్రంథాలయాన్ని. దాంట్లో మీ పుస్తకం ఉండటం ఆశ్చర్యమేమీ లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. భండారు వారు తమ పొత్తంబక్కడ చూసి సంతోష పడిపోతే వినరావారు అబ్బే ఇందులో ఆశ్చర్యమేమీ లేదని తుస్సుమనిపించేసేరు :)

      ఇది న్యాయమా అధ్యక్షా :)



      జిలేబి

      తొలగించండి
    2. తమరికలా అర్థం అయిందా? అవున్లెండి, మామూలుగా అర్థం అయితే అంటే తంపులు పెట్టడానికి వీలవదుగా.

      అవున్లెండి, జంపాల చౌదరి లాంటి పుస్తక ప్రియుడి దగ్గర మీ పుస్తకం ఉండడం ఆశ్చర్యం లేదు అని భండారు వారిని నేను మెచ్చుకోలుగా అన్న మాటల్ని మీరు ట్విస్ట్ చెయ్యడం ఆశ్చర్యమేమున్నది? చెయ్యకపోతేనే వింత గానీ 🤨.

      తొలగించండి
  2. అపార్ధాల జీవి ఆందోళన జీవి తెలుని బతికించుది సార్.

    రిప్లయితొలగించండి