కరోనా కళ్ళప్పగించి చూస్త్తూ ఇక తోక ముడిచే పనిలో ఉన్నట్టుంది.
కరోనా భయ పడుతోంది దేశంలో ప్రజలూ ప్రభుత్వాలు ఏకమై తనని తరిమి కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసికాదు. బహుశా మన దేశానికి మాత్రమే పరిమితమైన వింత వ్యాధిని చూసి. మందు లేని ఆ వ్యాధి పేరు ఇంగ్లీష్ లో GREED తెలుగులో దురాశ.
కరోనా సెకండ్ వేవ్ కోరలు సాచి విస్తరిస్తున్న సమయంలో ఎవరి ప్రాణానికి పూచీ లేని పరిస్థితి. అయినా తాము మాత్రం చిరకాలం బతుకుతామనే నమ్మకంతో డబ్బులు పోగేసుకుంటున్న జనాలను చూస్తుంటే ఆ కరోనాకే మతి పోతున్నట్టు వుంది. అలా సంపాదించే డబ్బు కట్టుకు పోయేది కాదు, పట్టుకుపోయేది కాదు.
లేకపోతె ఏమిటీ బ్లాక్ మార్కెట్? మందులు, మూతి గుడ్డలు, శానిటైజర్లు, ఆసుపత్రులలో ఎడ్మిషన్లు, బెడ్లు, ఆఖరికి అంబులెన్సులు అన్నిటికీ కృత్రిమ కొరతలు పెరిగాయి. ధరలు పెరిగిపోయాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఒకవైపు ప్రాణాలు పోతున్నా కనికరించని కరకు గుండెలు చూసి గుండెలు బాదుకుంటున్నారు.
ప్రళయం అంటే ఇదే. భూమి బద్దలు కావడం కాదు. సముద్రాలు ఉప్పొంగడం కాదు.
ఈ దురాశే నిజమైన ప్రళయం.
అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం!
మీ బ్లాగ్ లో అప్పుడప్పుడు కామెంట్ పెట్టె అజ్ఞాత ని నేనే . మా నాన్నఇప్పుడు కోవిద్ తో హాస్పిటల్ లో ఉన్నారు .
రిప్లయితొలగించండిICU లో . ఆక్సీజెన్ లెవెల్ 80 తో పోరాడుతున్నారు . రెమిడీస్వెర్ ఇంజెక్షన్స్ కోసం నేను పడ్డ కష్టం పగవాళ్లు కూడ పడకూడదు .
లోపల ఏం ట్రీట్మెంట్ అవుతుందో , ఎలా అవుతుందో తెలియడం లేదు . గూగుల్ రివ్యూ లో చెత్త రేటింగ్ ఉన్న హాస్పిటల్ ఇది , అయినా నాకు వేరే దిక్కు లేదు . ఇక్కడ కూడా బెడ్స్ ఫుల్ . అయిదుగురు పేషెంట్స్ చనిపోయారు , మా నాన్న రోజు ఏడుపు తీసుకుని వెళ్ళిపో నన్ను వీళ్ళు చంపేస్తారు అని . ఎక్కడకి తీసుకునివెళ్ళాలి , వైజాగ్ లో ఉన్న ఏ కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా బెడ్స్ ఖాళీ లేవని చెప్తున్నారు , సీఎం లెవెల్ లాంటి రెకమెండేషన్ ఉంటె తప్ప . రోజు రోజు బిక్కు బిక్కు మంటూ ఉంటున్నాను , ఏ క్షణం లో ఏ న్యూస్ వినాలో అని . ...
🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊
రిప్లయితొలగించండి*_🙏ముఖ్యమైన సమాచారం🙏_*
*_తప్పకుండా చదువుతారని ఆశిస్తున్నాను_*
*_ఒకరి కుటుంబంలో జరిగిన ఒక సంఘటనను వివరిస్తున్నారు. అతని కోడలు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.కోవిడ్ మరియు ఆక్సిజన్ స్థాయి 80-85కు పడిపోయింది.ఆమెని వెంటనే ఆసుపత్రిలో చేరాలని సిఫారసు చేశారు.ఆసుపత్రులలో చికిత్సలు సందేహాస్పదంగా ఉండటం వల్ల, దానికి బదులుగా హోమ్ రెమెడీని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు._*
*_ఒక స్పూన్ వాముతో, కర్పూరం పొడి కలిపి కాటన్ గుడ్డలో కట్టాడు. తరువాత అతను ఆమెను ఆ కాటన్ గుడ్డను ముక్కు దగ్గర పెట్టుకుని దీర్ఘ శ్వాసలతో 10-15 సార్లు వాసన చూసేలా చేశారు. మరియు ప్రతి రెండు గంటలకు అదే చర్యను పునరావృతం చేశారు_*
*_24 గంటల్లోగా ఆమె ఆక్సిజన్ లెవల్ ఎలాంటి ఆసుపత్రిలో చేరకుండానే 98-99కు చేరుకుంది._*
*_దీని తరువాత, అదే నివారణతో కోవిడ్ కొరకు ఆసుపత్రిలో చేరిన తన స్నేహితుల్లో ఒకరికి అతడు సాయం చేశారు. ఫలితంగా చాలా త్వరగా సులువుగా అతని స్నేహితుడు కోలుకున్నారు. హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించారు_*
*_"వాము, కర్పూరం" ఈ రెండిటిని ఒక గుడ్డలో తీసుకుని, గట్టిగా దంచి, ముక్కు దగ్గర వాసన చూపిస్తే, గట్టిగా శ్వాసలు తీసుకోమని ప్రోత్సహిస్తే కొద్దిసేపట్లో ఆక్సిజన్ లెవెల్స్ 90 నుండి 99 వరకు పెరుగుతున్నాయి అని ఆయన అందరికీ తెలియజేయాలని సంకల్పంతో ఈ సమాచారం ఇలా షేర్ చేస్తున్నారు_*.
*_మీ గ్రూపుల్లో కూడా ఈ సమాచారాన్ని ప్రచారం చెయ్యండి_*.
సేకరించడం జరిగింది, ఇది 100% వాస్తవం
*ధన్యవాదాలు*
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Forwarded message👆
రిప్లయితొలగించండిమంచి చిట్కా లాగానే ఉందే? మరి ఆల్రెడీ హాస్పిటల్ లో ఉన్న వ్యక్తికి
రిప్లయితొలగించండిబయటి వాళ్ళు వచ్చి ఇటువంటివి ప్రయత్నించడానికి హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకుంటారని ఆశిద్దాం.
ఆక్సిజన్ కోసం రోజుకి లక్ష కట్టగలిగేవాళ్ళు హాస్పిటల్ కి వెళతారు. కట్టగలిగినా కూడా అస్థమా ఉన్నవాళ్ళు బ్రతుకుతారని నమ్మకం లేదు.విధిలేని పరిస్థితిలో ఇటువంటి రెమెడీలు అదృష్టవంతులకు ఉపయోగపడవచ్చు అని ఆశ.
రిప్లయితొలగించండిఓపన్ ఎయిర్ వచ్చేలా డాబా మీదకెల్లి ఉండడం కూడా కొంచెం సాయం చేస్తుంది. నాకు ఒకసారి ఊపిరి ఆడలేదు. నేను వెంటనే బయటకి పరిగెత్తి బయట కాసేపు పడుకున్నా... కొంచెం బెటరుగా అనిపించింది.. ఊపిరి పీల్చుకోగలిగాను. అలానే.. ఏదైనా వెహికలులో ఊరిబయట తిరగడం కూడా లాభిస్తుంది. ఊరి బయట గాలిలో ఏదైనా వెహికలులో తిరగడం వలన ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది..
రిప్లయితొలగించండి