అమ్మాయిలూ ఇలా చేసి చూడండి !
ఆ భవనంలో మీరు వెళ్ళాల్సింది ఆఖరు
అంతస్తులోకి. బాగా పొద్దుపోయింది. లిఫ్ట్ లోకి మీతో పాటు పరిచయం లేని ఓ మగవాడు కూడా ఎక్కాడు.
అతడి చూపులు, ప్రవర్తన మీకు అనుమానం కలిగించాయి. అప్పుడు ఏం చెయ్యాలంటే, మీరు వెళ్ళాల్సిన అంతస్తు పన్నెండు
అనుకోండి. పన్నెండు లిఫ్ట్ బటన్లు ఒకేసారి వరసగా ప్రెస్ చేయండి. దాంతో లిఫ్ట్
ప్రతి అంతస్తులో ఆగుతూ వెడుతుంది. అలా ఆగుతూ వెళ్ళే లిఫ్ట్ లో ఎలాటి అఘాయిత్యం
చేయడానికీ ఏ మగవాడు సాహసించడు.
ఇంట్లో మీరు ఒంటరిగా వున్నారు. ఎవడో
ముక్కూ మొహం తెలియని మనిషి లోపల ప్రవేశించి మీ మీద దౌర్జన్యం చేయబోయాడు. వెంటనే వంట గదిలోకి వెళ్ళిపొండి. కారపు పొడి
డబ్బా ఎక్కడ వుంటుందో మీకు మాత్రమే తెలుసు. కత్తులూ, ప్లేట్లు
ఎక్కడ ఉంటాయో తెలిసిందీ మీకే. వాటిని మీ రక్షణ కవచాలుగా మార్చుకోండి. స్టెయిన్
లెస్ స్టీల్ ప్లేట్లు, చెంచాలు గదంతా విసరడం మొదలు పెట్టండి. ఆ చప్పుడుకు ఇరుగూపొరుగూ రావడం ఏమో కాని ఆ ఆగంతకుడి గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖాయం. కాలికి బుద్ది చెప్పడం అంతకంటే
ఖాయం.
రాత్రి వేళ వొంటరిగా ఆటోలోనొ, టాక్సీలోనొ వెళ్ళాల్సిన అవసరం పడింది. ఆటో ఎక్కే
ముందే దాని నెంబరు రాసుకోండి. ఎక్కగానే మొబైల్ ఫోనులో ఇంటి వారికి వివరాలు ఆటో
డ్రైవర్ వినేటట్టు పెద్దగా చెప్పండి. అవతల లైను
కలవకపోయినా సరే, ఆటో వివరాలు ఎవరికో చెబుతున్నట్టు కాసేపు నటించండి. ఇక అంతే! అప్పటిదాకా వాడి
మనసులో వేరే చెడు ఉద్దేశ్యాలు వున్నా ఆ ఫోను
కాలుతో అన్నీ సున్నా. తన వివరాలు మీకు తెలుసనీ, మీకే
కాకుండా మీ వాళ్లకు కూడా తెలిసిపోయాయని తెలుసుకుని భయపడి పోతాడు. మీరు వెళ్ళాల్సిన చోటుకు భద్రంగా తీసుకువెళ్ళి దింపుతాడు.
ఎందుకంటె మీకేదైనా జరిగిందంటే ముందు చుట్టుకునేది వాడి మెడకే అని వాడికి అప్పటికే అర్ధం అయి వుంటుంది.
మీరు ఎక్కిన ఆటోవాడు హఠాత్తుగా వేరే
సందులోకి మళ్ళాడనుకోండి. గాభరా పడకండి. అదును చూసి మీ చున్నీతో వాడి మెడ గట్టిగా
వెనక్కి లాగండి. ఊపిరాడక వాడే గిజగిజలాడుతాడు. అపాయం నుంచి తప్పించుకోవడానికి ఆ
మాత్రం వ్యవధానం చాలు.
ఇంతకీ చెప్పేదేమిటంటే...
'మృగాళ్ళ' నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి
వేరే ఆయుధాలు అక్కరలేదు. మానసికంగా చురుగ్గా, సంసిద్ధంగా
వుంటే చాలు, అదే మీ చేతిలో కనబడకుండా వుండే 'బ్రహ్మాస్త్రం'.
ఏమంటారు?
ఎంటో! అమ్మాయిలను జాగ్రత్తగా ఉండమని నేర్పుతాము కని అబ్బయిలను తప్పు చెయ్యకండ్రా అని గట్టిగా చెప్పలేం.
రిప్లయితొలగించండిఏదైనా జరిగితే ఎవరికి నష్టం అధికంగా ఉంటుందో వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పటం సహజం.
రిప్లయితొలగించండి