సారీ
చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే – భండారు శ్రీనివాసరావు
ఏదైనా అంశం పట్ల నాకున్న అభిప్రాయం నేను చెప్పిన
తర్వాత దానిపై జరిగే వాదోపవాదాలతో నేను నిమిత్తం పెట్టుకోను. నా అభిప్రాయం తప్పని
సహేతుకంగా ఎవరైనా చెబితే సరిదిద్దుకోవడానికీ, ఆ విషయం బహిరంగంగా అంగీకరించడానికి
కూడా నేనెప్పుడు వెనుకాడింది లేదు.
నిన్న
సుమన్ టీవీ వాళ్ళు రఘురామ కృష్ణం రాజు గారి ఎపిసోడ్ పై నా వివరణ ఇవ్వమని అడిగారు.
ఇక ఆ విషయంలో చెప్పేది ఏమీ లేదని, నేను పొరపాటు మాట మాట్లాడి వుంటే తప్పకుండా
వివరణ ఇచ్చేవాడిని కానీ ఇది ఆ సందర్భం
కాదని బదులిచ్చాను.
చివరికి
సుమన్ టీవీ వాళ్ళే రాజుగారి నుంచి వివరణ తీసుకుని ఈ గందరగోళానికి శుభం కార్డు
వేసినట్టున్నారు. ఈ విషయం SIVARAMAPRASAD
KAPPAGANTU గారి పోస్టు చూసేదాకా నాకు కూడా తెలియదు. వారికి
కృతజ్ఞతలు.
(13-04-2021)
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండి@నీహారిక: ధన్యవాదాలు. మీము మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి