26, మార్చి 2021, శుక్రవారం

Y2K

 1998,  1999 ప్రాంతాల్లో ఈ Y2K  అనే పదం చాలా పాపులర్. ఈ పేరుతొ హైదరాబాదులో కొన్ని బార్లు, రెస్టారెంట్లు కూడా వెలిశాయి.

డిసెంబరు 31 తర్వాత జనవరి ఒకటి రావాలి. ఇదేమంత వింత విషయం కాదు. కానీ ఆ రోజుల్లో ఇదొక వింత విషయమే కాదు చాలా పెద్ద విషయమే అయికూర్చుంది. అప్పటివరకు 1998 తర్వాత  1999 ఇలా ఆటోమేటిక్ గా గడియారాల్లో, కంప్యూటర్లలో తేదీలు మారిపోయేవి. మరి 1999 31 తర్వాత 2000 వస్తుందా రాదా అనేది కంప్యూటర్ వర్గాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇదేదో ఒక్క దేశానికి సంబంధించింది, ఏదో ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇప్పటి కరోనా లాగా అప్పుడు ఈ Y2K కొరకరాని కొయ్యగా తయారైంది. ఇందుకోసం చాలా సంస్థలు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చాయి. అమీర్ పేట పేరు ప్రఖ్యాతులు విశ్వవ్యాప్తం కావడానికి Y2K ఒక కారణం అని చెప్పుకునేవారు. 1999 31 తర్వాత 2000 అంకె రావడానికి వీలుగా చాలా పరిశోధనలు జరిగాయని చెప్పుకునేవారు. మొత్తం మీద ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయిందనుకోండి.

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే నా బ్లాగులో వీక్షకుల సంఖ్య తొమ్మిది లక్షలు దాటింది. మరో ముప్పయి రెండు వేలు అయితే అది పది లక్షల మార్కు చేరుకుంటుంది. అక్కడ ఉన్నవేమో ఆరు గళ్ళు. 10,00000 కనపడాలంటే మరో గడి అవసరం అవుతుంది.  



అంత పెద్ద Y2K సమస్యే పరిష్కారం అయినప్పుడు ఇంత చిన్న విషయం గురించి మధనపడే అవసరం  ఏముంటుంది?

(26-03-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి