26, మార్చి 2021, శుక్రవారం

ఇందిరాగాంధి పొట్టలో చుక్క – భండారు శ్రీనివాసరావు


ముప్పయ్ అయిదేళ్ళ పై మాటే.
పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్. ఆయనకు సహాయకుడిగా పనిచేస్తున్న ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సెలవులో వెళ్ళడం వల్ల కొన్నాళ్ళు ఆయన బాధ్యతలు నా భుజాన పెట్టారు ఎడిటర్ నండూరి రామమోహనరావు గారు.
వార పత్రికలో పనిచేయడం నాకు కొత్త. కానీ శర్మ గారు కొత్త కాదు. ఆయన వినీవినపడకుండా జోకులు పేల్చి నవ్వించడంలో దిట్ట.
ఓరోజు పురాణం గారు ‘ఇల్లాలి ముచ్చట్లు; రాస్తూ, ఆయన ఇలా అడిగారు యాధాలాపంగా.
‘ఇందిరాగాంధి పొట్టలో చుక్క ఉంటుందా?’
ఆయన జోకులు ఒక పట్టాన అర్ధం కావు. అర్ధం చేసుకున్నవాళ్ళకి ఆయనలోని మేధావి కనపడతాడు.
అదే శీర్షికతో మరుసటి వారం వారపత్రికలో ఇల్లాలి ముచ్చట్లు అచ్చులో వచ్చాయి.
తెలుగులో ‘ద’ ‘ధ’ తో పాటు ‘ధ’ పొట్టలో చుక్క వున్న మరో ‘ధ’ వుంది. నా కంప్యూటర్ కి మొదటి రెండే తెలుసులా వుంది.
ఆయన కవి హృదయం ఏమిటంటే ఇందిరాగాంధి అనే పేరులో గాంధి అనే పదం వుంది. ఆ పదంలో వున్న 'థీ' అనే అక్షరంలో పొట్టలో చుక్క ఉంటుందా! ఉండదా!
(చదువరులలో ఎవరికైనా ఇలా పొట్టలో చుక్క పెట్టడం వస్తే నాకు ఆ విధానం తెలియచేయగలరు)

1 కామెంట్‌: