30, మార్చి 2021, మంగళవారం

వెలుగు చూడని వార్తలు – భండారు శ్రీనివాసరావు

 అప్పుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ సీపీ ఎం నాయకుడు రాఘవులు ఒక ఆరోపణ చేశారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో వంద కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందన్నది ఆ ఆరోపణ సారాంశం.

మర్నాడు ఒక ‘ప్రముఖ’ దినపత్రిక ఒక కార్టూన్ ప్రచురించింది. వై ఎస్ బొమ్మ పెద్దగా, పక్కనే చంద్రబాబు బొమ్మ చిన్నగా వుంటుంది. ఆయన వై ఎస్ ని ఉద్దేశించి ఏదో అంటుంటాడు. సీపీఎం నాయకుడు రాఘవులు వైఎస్ఆర్ నోట్లో చేయిపెట్టి ఒక డబ్బు మూట బయటకు తీస్తుంటాడు. వై ఎస్ ఆర్ అవినీతిని టీడీపీ కన్నా సీపీఎం బాగా బయట పెడుతోందన్న అర్ధం అందులో అంతర్లీనంగా వుంది.

అది చూసిన వై ఎస్ కి పట్టరాని కోపం వచ్చింది. దాన్ని ఆయన దాచుకోలేదు. ఆ కార్టూన్ వేసిన పత్రిక యజమానిపై మండిపడ్డారు. అప్పుడు అక్కడే వున్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ నచ్చ చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు. ఆ పత్రిక రాసేవన్నీ అభూత కల్పనలు అనే పద్దతిలో ఎదురు దాడి మొదలు పెట్టడమే మంచిదని వైఎస్ నిర్ధారణకు వచ్చారు. ‘ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధి వున్నప్పుడు ఇప్పటి నుంచే పత్రికలతో తగాదా ఎందుకన్నది’ కిరణ్, కేవీపీ ల అభిప్రాయం. కానీ వైఎస్ ఒప్పుకోలేదు. ‘ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఎన్నికల నాటికి ప్రజలు నమ్మే పరిస్తితి వస్తుంద’ని ఆయన నమ్మకం. అప్పటి నుంచి వైఎస్ సందర్భం వచ్చినప్పుడల్లా ఆ పత్రిక రాతల్ని ఎండగట్టే ప్రయత్నం ప్రారంభించారు. తరువాత అది ‘ఆ రెండు పత్రికలూ..’ అంటూ రెండు తెలుగు దిన పత్రికలని ఎద్దేవా చేసే ప్రచార కార్యక్రమంగా రూపు దిద్దుకుంది.

 

10 కామెంట్‌లు:

  1. ఎంత గొప్ప విషయం. పత్రికలు దొరతనానికి తందానా అనకపోతే అధికారంలో ఉన్నవారు ఆపత్రికలభరతం పట్టాలి అన్న గొప్ప సందేశం. బాగుంది. అనంతరకాలంలో తందానా అనేందుకు స్వంతపత్రికలూ ఛానెళ్ళ వరకూ ధీవిశాలత వ్యాపించింది. ప్రస్తుతం స్వంతసైన్యంగా విస్తరించింది. బ్రహ్మాండం కదా.

    రిప్లయితొలగించండి
  2. ఔను గురూగారు. ఇటు ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవి5 తేదేపాకీ, సాక్షి జగన్ కి చేసే మితిమీరిన భజన చూడలేక చవ్చ్చిపోతున్నాం

    రిప్లయితొలగించండి
  3. మీరు సాక్షిని, జగన్ ని ఎన్నైనా అనుకోండి, కానీ.. "ఆ" పత్రికల్ని, చంద్ర బాబుని, మోడీని అంటే మాత్రం శ్యామలీయంగారు ఊరుకోరు.

    రిప్లయితొలగించండి
  4. పత్రికలు విలువలు వదిలేసి , రాజకీయాలు లోకి వచ్చి , నాయకులకి పాదసేవ చేయడం ఈనాడు తోనే మొదలైంది . అంతకు ముందు ఉన్నా అవి తెర చాటు యవ్వారాలు . ఈనాడు మాత్రం బహిరంగంగా సమర్ధించింది .

    రిప్లయితొలగించండి
  5. నువ్విక చచ్చావ్. ఈ రాత్రికే శ్యామలీయం నీమీద క్షుద్రపూజ చేయబోతున్నాడు. హన్నా! పవిత్రమైన ఈనాడునంటావా?

    రిప్లయితొలగించండి
  6. @Chiru, Now Jagan wants to ally with Modi since ties between TDP and BJP are not so strong.

    రిప్లయితొలగించండి
  7. @ Pravin

    జగన్ కి బీజేపీతో దోస్తీ చెస్తే తప్ప గెలవలేని పరిస్థితి ఉందంటారా?

    రిప్లయితొలగించండి
  8. అది కూడా మీరే చెప్పండి మరి. అలాగే ఆ విషయంలో దానితోబాటు తేదేపా కూడా బీజేపీని ఏమనట్లేదు. అంటే వీల్లుకూడా బీజేపీ తోడు లేకుండా మనలేరంటారా?

    రిప్లయితొలగించండి
  9. పన్లో పనిగా, ఆంధ్రాలో బీజేపీ అంత సడ్డెన్ గా కింగ్ మేకర్ ఎలా అయ్యిందో మీ విశ్లేషణ తెలుసుకోవాలని వుంది

    రిప్లయితొలగించండి