“ఏకగ్రీవాలని మించిన ప్రజాతీర్పు’ అన్నారు మహా న్యూస్ ఎండీ శ్రీ వంశీ, రాత్రి తన విశ్లేషణ కార్యక్రమంలో. బహుశా పురపోరులో వైసీపీ సాధించిన అద్భుత విజయం గురించి ఇంత సూటిగా, అర్థవంతంగా వినబడిన వ్యాఖ్య ఇదే అనుకుంటాను.
“విజేత
తనకు దక్కిన విజయాన్ని మొట్ట మొదటిది అనుకోవాలి,
అప్పుడే తదుపరి విజయ సాధనకు నిరంతరం శ్రమిస్తాడు. పరాజితుడు తన పరాజయాన్ని చిట్ట
చివరిదిగా భావించాలి. అప్పుడే మరోసారి విజయం సాధించడం కోసం పరిశ్రమిస్తాడు”
2019 అసెంబ్లీ
ఎన్నికల ఫలితాల అనంతరం ఒక టీవీ చర్చలో
నేను చెప్పిన మాట ఇది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు తాత్కాలిక స్పందనలే. వాటిల్లో నిజం
పాలు తక్కువ.
సవివరమైన విశ్లేషణకు మరిన్ని వివరాలు అందాల్సివుంది.
పొతే ఒక హిత వచనం:
విజయం వినయాన్ని పెంచాలి. అపజయం అసహనాన్ని
తుంచాలి.
(15-03-2021)
వినబడలేదా విజయవికటాట్టహాసవిలాసం
రిప్లయితొలగించండికనబడలేదా పరాజయోదితప్రస్ఫుటనైరాశ్యం
పెద్దగుంపులో చేరి ప్రశాంతంగా ఉండండి
వినిపించవలసినవే వినిపిస్తాయి
కనిపించవల సినవే కనిపిస్తాయి
చిన్నదౌతున్న గుంపుకు దూరం కాకపోయారో
వినకూడనవి వినవలసివస్తుంది
కనకూడనవి కనవలసివస్తుంది
ఐనా మనందరికీ తెలిసిందే అనుకోండి
గెలిచినవాళ్ళే మనవాళ్ళు
అదెప్పుడూ అంతే.
--శ్యామల రావు.
బాధపడకండి శ్యామలీయం గారూ! ఇలాంటి డక్కా మొక్కీలు మన చంద్రబాబుగారు ఎన్నొ తిన్నారు, ఇంకొకల్లకి పెట్టారు కూడా. తప్పకుండా తొందరలో మనదే అధికారం. మీరు నైరాశ్యంలోకి పోబడ్లేదు.
రిప్లయితొలగించండిమన రాముడికే తప్పలేదు వనవాస కష్టాలు. ఇక మన నాయుడుగారెంతండి.. సీతమ్మ తల్లి లాంటి రాష్ట్రాన్ని రక్షించుకోడానికి, త్వరలో బరిలోకొస్తాడు. అప్పటివరకు మనం రామ భజనతో బాటు, నాయుడిగారి భజన చేసుకుంటూ కాలక్షేపం చేసుకుందాం.
రిప్లయితొలగించండిజగన్ తన 22 నెలల పాలనలో ప్రజల నాడిని పట్టుకోవడంలో సఫలీకృతుడయ్యాడనే భావించాలి. కానీ ఆయన విజయం అప్పనంగా రాలేదని గ్రహించాలి. విజయం కోసం అతని అవిరళ కృషిని ఎవరైనా తక్కువ చూపు చూశారంటే అది వాళ్ళ అవగాహనా లేమి మాత్రమే. 40 ఏళ్ళ రాజకీయానుభవం ఉండి కూడా చంద్రబాబు ఎలా నెగ్గాలో తెలియక బొక్క బోర్లా పట్టానికి కారణం మరేం కాదు అహంకారం, స్వీయ పొగడ్తలు, తప్పుడు మనుషుల సలహాలు, ఎప్పటికప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగడే స్వపక్ష మీడియా, తప్పులు చేసిన చోట ఒప్పుకోక బుకాయించడం వగైరాలు ఆయన పతనానికి కారణం. ఆయన ధోరణిని బట్టి, ఆయన మీడియాని బట్టి నెక్స్ట్ టైం కూడా ఆయనకు విజయం అందని ద్రాక్షే. కరెక్టీవ్ మెజర్స్ కనీసం పాలన ఆఖరి సంవత్సరంలో తీసుకున్నా ప్రజలు ఆదరించే వారు. జగన్ లాంటి బచ్చా చేతిలో ఓడిపోవడం, అది కూడా ఇంతలా - చాలా బాధాకరం. ఏమైనా బలమైన ప్రతిపక్షం, నాయకుడు లేకపోవడం ఆంధ్రా ప్రజల దురదృష్టం. ఇలాంటి విజయం ప్రజాస్వామ్యానికి మేలు చేసేది కాదు. ప్చ్, ఒక్క విషయంలో కూడా ఆంధ్రాకు కలిసిరాదు ఏంటో ఖర్మ!
రిప్లయితొలగించండిఏం పర్లేదు, బీ.జే.పీ వచ్చి బలమైన ప్రతిపక్షం లేని లోటును 2024లో కచ్ఛితంగా తీర్చుతుంది. వై.సీ.పీని ప్రతిపక్షములోకి నెట్టి లేదా తానే ప్రతిపక్షములో కూర్చుని. ఇక టి.డి.పీ OLX ఆంద్రాలో కూడా !
రిప్లయితొలగించండిప్రజలంతా ఒక్క పెట్టున "బాబోరు మాకొద్దు..." అంటూ నినదించినా, మాకూ, మా స్వాతిముత్యం శ్యామలీయం గారికి, శాంతమూర్తి హరిబాబు గారికీ.. బాబోరే దేవుడు. ప్రజలంతా తెలివి తక్కువోల్లు.
రిప్లయితొలగించండి