“అర్ధం చేసుకోగలిగితే వేదాంతం చాలా గొప్పది.
పారమార్ధికం, పారలౌకికం ఈ రెంటినీ సరైన పాళ్ళలో కలిపితే అదే వేదాంతం
అవుతుంది. గీతలో భగవానుడు బోధించింది అదే.
“నీ పని నువ్వు చెయ్యి. ఫలితం నాకు వదిలేయ్”
ఎవరి పని వాళ్ళు చేయడం పారలౌకికం. ఫలితాన్ని
పరమాత్ముడికి వదిలేసి దేనికీ తాపత్రయ పడకపోవడం పారమార్ధికం.
ఇలా చేస్తే స్వార్ధరహిత కర్తవ్యపాలన జరుగుతుంది.
దాన్ని పరిపాలన అనండి, ఉద్యోగం
అనండి,
కుటుంబ బాధ్యతలు అనండి, ఇంకేదైనా
అనండి. అన్నిటికీ ఈ సూత్రాన్ని పాటిస్తే సమాజానికి మేలు జరుగుతుంది.
కానీ జరుగుతున్నది తద్విరుద్ధం. పారమార్ధిక
భావాలు బాగానే ప్రబలుతున్నాయి. అలాగే పారలౌకిక భావనల్లో స్వార్ధ తలంపులు కూడా.
భగవద్గీతను భక్తిగా తలమీద పెట్టుకుంటాం కాని, అందులో
చెప్పిన దాన్ని నిబద్ధతతో తలకెక్కించుకో౦!
కలివిడిగా వున్నప్పుడు కూడా మనసును విడిగా ఉంచుకోగలగాలి.
విడిగా వున్నప్పుడు సైతం నలుగురితో కలిసివున్నామన్న భావన పెంచుకోవాలి.
ఏమిటో శంకరాభరణం శంకర శాస్త్రిగారి మాటల్లాగా
ఒక్కటీ అర్ధం కావడం లేదనిపిస్తోందా!
అందుకే దాన్ని వేదాంతం అన్నారు శిష్యా!”
అనుగ్రహభాషణ ముగించారు ఏకాంతానందస్వామి.
(20-02-2021)
★అనుగ్రహభాషణ ముగించారు ఏకాంతానందస్వామి.
రిప్లయితొలగించండిఏ కాంత ఆనందస్వామి?
నిర్మలానంద స్వామి!
రిప్లయితొలగించండినిర్మల + ఆనంద => నిర్మలానంద. సవర్ణదీర్ఘసంధి.
రిప్లయితొలగించండినిర్మలానంద => నిర్మలమైన ఆనందము కలవాడు. బహువ్రీహి సమాసము. లేదా మరొక విధంగా సమసిస్తే,
నిర్మల యందు ఆనందము కలవాడు. మళ్ళీ ఇలాక్కూడా బహువ్రీహి సమాసమే.