థాంక్స్ చెప్పడం మినహా ఏం చేయగలను ?
నేను ఆకాశవాణి/ దూరదర్శన్ నుంచి రిటైర్ అయి అప్పుడే
పదిహేను ఏళ్ళు
గడిచిపోయాయా! నాకయితే గుర్తు లేదు. కానీ
కంప్యూటర్ గుర్తు పెట్టుకుంది.
ఉద్యోగ విరమణ చేసే సమయంలో పింఛన్ మొత్తం నుంచి
కొంత కమ్యుటేషన్ కింద తగ్గించి ఇస్తారు. ఓ పదిహేను ఏళ్ళ తరువాత మళ్ళీ పింఛన్ లో ఆ
మొత్తం కలుపుతారు.
నేను రిటైర్ అయింది 2005 డిసెంబరు
31వ
తేదీన. 2021
జనవరికి పదిహేను సంవత్సరాలు పూర్తవుతాయి.
అంటే ఆ ఏడాది జనవరి నెల పెన్షన్ లో ఈ మొత్తం కలపాలి.
పదిహేను ఏళ్ళు అంటే మాట కాదు. నిన్నా మొన్నా
జరిగిన విషయాలే గుర్తుండి చావడం లేదు. మరి ఇంతకాలం అయిన తర్వాత ఈ విషయాన్ని గుర్తు
చేయడానికి ఎన్ని మహజర్లు పెట్టుకొవాలో, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలో అని అనుకున్న మాట కూడా నిజం.
ముందే చెప్పినట్టు ఈ విషయాలు ఏవీ నాకు గుర్తు
లేవు, ఈరోజు ఉదయం పెన్షన్ మెసేజ్ వచ్చిన దాకా.
ఎప్పుడో అలారం పెట్టిన గడియారం ఆ సమయానికల్లా ఖచ్చితంగా
అలారం కొట్టినట్టు, పదిహేను ఏళ్ళు గడవగానే పించను కార్యాలయంలోని కంప్యూటర్లు ఠంచనుగా
ఈ కమ్యుటేషన్ మొత్తాన్ని నా బ్యాంకు
ఖాతాకు జత చేసాయి. ఆ విషయాన్ని ఈరోజు ఉదయం
ఆరుగంటలకల్లా ఒక ఎస్సెమ్మెస్ రూపంలో
తెలియచేశాయి.
అద్భుతం అనిపించింది.
రిటైర్ అయి పని లేకుండా ఉన్న మా బోంట్ల కోసం ఎవరో ఎక్కడో బాగానే
పనిచేస్తున్నారు. వారందరికీ థాంక్స్. (27-01-2021)
ఆ సిస్టం ని అలా మైంటైన్ చెయ్యడానికి ఎందరో ఇంజనీర్లు రాత్రి పగలు శ్రమిస్తారు సర్!
రిప్లయితొలగించండి@సూర్య : అవునండీ అందుకే వారందరికీ ధన్యవాదాలు తెలిపేందుకే ఈ పోస్టు.
రిప్లయితొలగించండి