2018 ఎన్నికలు. ఒక పక్క టీఆర్ఎస్. మరో పక్క మహాకూటమి. రాజకీయంగా ఉత్తర దక్షిణ ధృవాలయిన కాంగ్రెస్, టీడీపీ ఈ ఎన్నికల్లో చేతులు కలపడం ఓ విశేషం. ప్రచారాలు తారా స్థాయిలో సాగుతున్నాయి. ఫలితాలు గురించి అనేకరకాల ఊహాగానాలు.
కొందరు విలేకరులు ఒక పోలీసు ఉన్నతాధికారితో చిట్ చాట్ చేస్తున్నారు.
“మీ అంచనా ఏమిటి” ఓ విలేకరి ఆరా.
ప్రభుత్వ ఉద్యోగి. తెలిసిన సమాచారం అయినా, అలా బాహాటంగా ఎలా పంచుకుంటాడు? అదీ విలేకరులతో.
అందుకే చిన్నగా నవ్వాడు. నవ్వి చెప్పాడు.
“రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది అవేవీ నేను చెప్పను కానీ, ఆన్ రికార్డ్ ఒక విషయం నిర్ధారణగా చెప్పగలను. పాత బస్తీలో ఆ ఏడు సీట్లు వాళ్ళవే”
అలాగే జరిగింది.
రెండేళ్ల గడిచాయి.
తాజాగా, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు గురించి వెలువడిన సర్వేలు అన్నీ మటాష్ అయ్యాయి. కాకపొతే, ఒక్క ఎం.ఐ.ఎం. పార్టీ గురించి ఆ సర్వేల్లో వచ్చిన ఫలితాలు మాత్రం వాస్తవ ఫలితాలకు దగ్గరగా వున్నాయి.
ఆ అధికారి చెప్పినట్టుగా, ఆ పార్టీ విజయావకాశాలు గురించి అంచనా వేయడానికి ఏ సర్వేలు అక్కరలేదేమో!
(05-12-2020)
>> ఆ పార్టీ విజయావకాశాలు గురించి అంచనా వేయడానికి ఏ సర్వేలు అక్కరలేదేమో!
రిప్లయితొలగించండిఓడలు బండ్లు అవటమూ బండ్లు ఓడలు అవటమూ కూడా ఏదో ఒకనాడు జరుగవచ్చునండీ.
నేను బిజెపి మద్దతు దారుణ్ని కాదు , కానీ , ఫేస్బుక్ లో సెక్యూలరిస్టు లు అంటూ చెప్పుకునే జనాలు మాటలు ఏంటంటే , బిజెపి జనాలని మత ప్రాతిపదిక న విడగొడుతుందని , విడగొట్టేసిందని విపరీతంగా బాధపడిపోతున్నారు . ఈ జనాలు పాతబస్తీ లో ఆవగింజంత అభివృద్ధి లేకపోయినా ఎంఐఎం ఎలా గెలుస్తుందని ఏ రోజు రాసిన పాపాన పోలేదు . సికింద్రాబాద్ లో వైస్సార్ జయసుధని ఎందుకు నిలబెట్టాడో రాయడానికి వీళ్ళ పెన్నుల్లో ఇంకు అయిపొయింది . ఇప్పుడు బిజెపి గెలిస్తే అది మత తత్త్వం అయిపొయింది, జనాలు కలుషితమయిపోయారు . న్యూట్రల్ గా ఉండే జనాలు పోలరైజ్ అయిపోవడానికి కారణం ఈ సూడో సెక్యూలరిస్టు లే . ఒకప్పుడు పాతబస్తీ లో బీజేపీ కూడా గెలిచింది. బద్దం బాలిరెడ్డి, నరేంద్ర ( కి. శే ) etc..
రిప్లయితొలగించండి:Venkat
https://bonagiri.wordpress.com/2019/01/09/ఆ-7-చోట్ల-ఎన్నికలు-అవసరమా/
రిప్లయితొలగించండిఇదే విషయం మీద నేను గతంలో వ్రాసిన టపా.
అసలు బీజేపీ ఎంఐఎం కలసి మేయర్ ని ఎంచుకుంటే? ప్రపంచానికే ఓ గొప్ప సందేశం వెళ్లదూ?!
రిప్లయితొలగించండికాకపోతే అద్భుతాలు అంత ఈజీగా జరగవు.
ఏమో! గుర్రం ఎగరచ్చు. బెర్లిన్ గోడ కూలిపోలేదూ! మొన్నీ మధ్య ఒక ముంబై ఎమ్.ఎల్.ఎ ఇండియా,పాకిస్తాను, బంగ్లాదేష్ ని ఏకం చేసేద్దామన్నాడు. మచి ఆలోచనే కదా! నేను చూడలేకపోవచ్చుగాని మీరు ఆరోజు చూడాలని నా కోరిక :)
రిప్లయితొలగించండి