ఎలా ఈ పుస్తకం అనుకుంటూవుంటే పుస్తకమే ఇంటికి నడిచివచ్చింది. ఒకప్పుడు సాక్షి టీవీ చర్చల్లో క్రమం తప్పకుండా వారంవారం పాల్గొంటూ వుండేవాడిని. బహుశా ఆ కారణం కావచ్చు, ఆ ఛానల్ వాళ్ళే మనిషికి ఇచ్చి మా ఇంటికి పంపారు. వారికి ధన్యవాదాలు. తెచ్చిచ్చిన సతీష్ కు కృతజ్ఞతలు.
ముందు చదవడం, తరువాత రాయడం నాముందున్న ప్రాధాన్యతలు.
వైస్ విజయమ్మ గారు , క్రైస్తవులు అని అందరికి తెలిసిన విషయమే , ఒక ఇంటర్వ్యూ లో నేను చదివాను , ఆవిడ రోజూ నిద్ర లేచి ఒక గంట సేపు ప్రార్థన చేస్తానని , ప్రార్థన చేయకుండా ఏ పని మొదలు పెట్టనని చెప్పారు . అందరి నమ్మకాలు గౌరవించాలి . కానీ ఆవిడ మొదట్లో బొట్టు లేకుండానే ఉండేవారు . ఈ పుస్తకం లో చుస్తే , బొట్టు , పాపిట్లో సింధూరం కూడా ?? ఇలా మర్చి ఉండకుండా ఉండి ఉంటే , క్రైస్తవ సంప్రదాయాల మీద చర్చ జరిగి , ఎక్కువ మందికి ఒక అవగాహన వస్తుంది . అంతే కాదు , విమర్శించే జనాల కి బుద్ది చెప్పినట్టు ఉండేది .
రిప్లయితొలగించండి