ఏకాంబరం
హాల్లో పడక కుర్చీలో కూర్చుని, డిటెక్టివ్ వాలి మాదిరిగా కళ్ళు మూసుకుని టీవీ ‘వింటున్నాడు’.
జర్మనీ
నుంచి వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన ఏకాంబరం కొడుకు పీతాంబరం తండ్రి పక్కనే కూర్చుని
టీవీ చూస్తూ రిమోట్ తో ఛానల్స్ అటూ ఇటూ మారుస్తున్నాడు.
కళ్ళు
మూసుకుని వున్న ఏకాంబరం, ఛానల్ మారగానే అది పలానా ఛానల్ అని పైకి చెప్పడం పీతాంబరానికి ఆశ్చర్యం కలిగించింది.
అలా సుమారు పది పదిహేను టీవీల పేర్లు ఏ తప్పు లేకుండా కళ్ళు తెరవకుండానే చెబుతూ వుండడం
చూసి అతడు నివ్వెరపోయి తండ్రిని అడిగాడు, చూడకుండానే అలా ఎలా
చెప్పగలుగుతున్నావని.
ఏకాంబరం
ఇలా జవాబు చెప్పాడు.
‘ఇదేమి బ్రహ్మవిద్య కాదు. ఎలాగూ ఇంకొన్నాళ్లు ఇక్కడే వుంటావు కదా! లాక్ డౌన్ ఎత్తేసేసరికి నీకూ ఈ దివ్య దృష్టి అలవడుతుంది.
కార్యక్రమం వింటూనే అదే ఛానలో ఇట్టే చెప్పేస్తావు’
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి