24, మార్చి 2020, మంగళవారం

కేటీఆర్ ది గ్రేట్ – భండారు శ్రీనివాసరావు


ఈ సాయంత్రం ఒక బ్లాగు మిత్రులు శ్యామల రావు గారు ఫోన్ చేసారు. వారి శ్రీమతికి వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయించాలి. భార్యాభర్తలు ఇరువురూ వృద్ధులు. ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి  మధ్యలో కొరానా కర్ఫ్యూ. ఆయనకి కాళ్ళూ చేతులు ఆడక నాకు ఫోన్ చేశారు. నేను మాత్రం ఏం చేయగలను? ఆలిండియా రేడియో నుంచి రిటైర్ అయి ఇప్పటికి పుష్కరం గడిచింది. నా మాట ఎవరు వింటారు. అంచేత ఓ సలహా ఇచ్చాను. కేటీఆర్ గారికి ట్వీట్/ వాట్సప్ చేయండని. ఆయన అలాగే చేశారు. నిమిషం గడవక ముందే ‘Will take care’ అని జవాబు వచ్చింది. మరి కాసేపటిలో కానుగుల శ్రీనివాస్ గారు అనే ఆయన వారికి ఫోన్ చేసి చిరునామా నోట్ చేసుకున్నారట. ఆ ముసలి దంపతుల ఆనందం ఇంతా అంతా కాదు.
“ముందు మీ సలహా విని తప్పించుకోవడానికి అలా చెప్పారని అనుకున్నా. కానీ ఫోన్ వచ్చేసరికి నా చెవులను నేనే నమ్మలేకపోతున్నా. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ప్రభుత్వ స్పందన అద్భుతం” ఫోనులో చెబుతున్నారాయన, కానీ ఆయన కంటి వెంట కారుతున్న ఆనంద భాష్పాలు ఆ మాటల్లో  నాకు కనబడుతూనే వున్నాయి.
సామాన్యులు కృతజ్ఞత తెలిపే విధానం ఇలాగే వుంటుంది.
‘నేనున్నాను’ అని భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని వారెప్పుడు మరచిపోరు.  

9 కామెంట్‌లు:

  1. పులి మీద పుట్రలా కరోన-కర్ఫ్యూ పడి మిత్రులు శ్యామలరావు గారికి పెద్ద ఇబ్బందే వచ్చిందే. ప్రభుత్వం వారి స్పందన వెంటనే రావడం మెచ్చుకోదగినదే, అది solid కార్యరూపం దాలుస్తుందని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
  2. Very sad to note that Shyamal rao sir's mrs. is suffering. In these times it is very difficult indeed. I sincerely PRAY GOD for her complete restoration of health.

    రిప్లయితొలగించండి
  3. Really KTR sir very great , hope she will get well soon. God is great.

    రిప్లయితొలగించండి
  4. పెద్దలు శ్యామలీయం మాస్టారు సహృదయులు, అందరి క్షేమం కోరుకునే అజాతశత్రువు. వారిని కొన్నేళ్ల కింద కలిసినప్పుడు ఎంతో ఆప్యాయతతో మాట్లాడారు. మేడం గారు బాగుండాలని మనసారా కోరుకునే అభిమానులలో నేనూ ఒకడిని.

    రిప్లయితొలగించండి

  5. ఒక్కొకప్పుడు చిన్న సలహాగొప్ప ఉపకారం చేస్తుంది.
    ''పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమ్.''
    You are great sir.

    రిప్లయితొలగించండి
  6. Update:
    ఈరోజు ఉదయం 10గం. కు మా తమ్ముడు సత్యప్రకాశ్ రాయదుర్గం PS కు వెళ్ళి పాస్ అందుకున్నాడు. తదనంతరం 11ః30కు డయాలసిస్ కోసం కుకట్‍పల్లి లోని రాందేవ్ రావ్ హాస్పిటల్‍కు సకాలంలో మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. దారిలో ఆ పాస్‍ను అనేక సార్లు పోలీసులకు కారు అద్దాల్లోంచే చూపుతూ పోగలిగాం. అలాగే సా. 4ః00గం కు మాతమ్ముడు మరలా హాస్పిటల్ వద్దకు వచ్చి మమ్మల్ని పికప్‍ చేసుకొని ఇంటిదగ్గర దింపి వెళ్ళాడు. ఈపాస్ ఈనెలాఖరువరకే పనిచేస్తుంది. ఆ పాస్ అందచేసిన అబ్బాయి మరలా 30న కాంటాక్ట్ చేయమని మరొక పాస్ ఇస్తామని మాతమ్ముడికి చెప్పాడట. ఈవిధంగా ఇబ్బందిని అధిగమించి సకాలంలో వైద్యసహాయం పొందగలిగాం. ఈవిషయంలో సహాయపడ్డ మిత్రులు భండారు శ్రీనివాస రావు గారికీ, చురుగ్గా స్పందించి తగిన పాస్ ఇచ్చిన కేటీఆర్ & టీమ్‍కూ మేం కృతజ్ఞులం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. All is well that ends well శ్యామలరావు గారు. KTR and team సకాలంలో మీకు ఎంతో అవసరమైన సహాయం చేశారు.

      తొలగించండి
  7. చాలా సంతోషం.

    ఈ-పాస్ సౌకర్యం కూడా వచ్చింది లేదా ఒకటిరెండు రోజులలో రాబోతుందని వింటున్నాము. అదొస్తే ఇంకా బాగుంటుంది.

    విన్నకోట వారన్నట్టు all is well that ends well.

    కష్టకాలంలో తాము తిన్నా పస్తులున్నా పట్టించుకోకుండా, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి దేశానికి సేవ చేస్తున్న వైద్య, ఆహార, పోలీసు, మునిసిపల్, రవాణా, నెట్వర్క్, సెక్యూరిటీ తదితర సిబ్బందికి & వాలంటీర్లకు వందనం. May their tribe increase!

    రిప్లయితొలగించండి
  8. this is simply great. just another example of humanity exemplified in most difficult times. thanks to all who took the extra step and helped Mr.Syamalrao gaaru.

    రిప్లయితొలగించండి