గంటలు గంటలు ప్రెస్ బ్రీఫింగ్ అనగానే మనదగ్గర నవ్వులాటగా
చెప్పుకుంటారు కానీ, అమెరికాలో కరోనా వైరస్ విస్తరించినప్పటినుంచి ప్రెసిడెంట్
డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ లో ప్రతిరోజూ సాయంత్రం రెండుగంటల పాటు విలేకరులతో
మాట్లాడడం అనేది ఒక రొటీన్ అయిపొయింది. ప్రెసిడెంట్ తో పాటు అమెరికా వైస్
ప్రెసిడెంట్ కూడా పాల్గొనే ఈ ప్రెస్ బ్రీఫింగ్ లో ఒకరిద్దరు వివిధ రంగాల నిపుణులు
కూడా పక్కనే వుంటారు. మనకు విచిత్రంగా అనిపించే విషయం ఏమిటంటే వీళ్ళు ఒక్కోసారి బహిరంగంగానే
ప్రెసిడెంట్ చెప్పేదానితో తాము ఏకీవభించడం లేదంటూ బహిరంగంగానే తమ అనంగీకారం
తెలియచేస్తుంటారు. ఈ రెండూ రెండున్నర గంటలసేపు ప్రెసిడెంట్ నిలబడే ఉంటాడు. ఇటీవల
అంటే మార్చ్ 23 న జరిగిన ప్రెసిడెంట్ ప్రెస్ బ్రీఫింగ్ ని క్లుప్తీకరిస్తే ఇదిగో
ఇలా వుంటుంది. మరో విచిత్రం ఏమిటంటే ఆ నాటి ప్రెస్ బ్రీఫింగులో ఒక విలేకరి అడిగిన
ప్రశ్నకు ట్రంప్ గారికి కోపం వచ్చి మధ్యలోనే అంటే గంటన్నర కూడా కాకుండానే
వెళ్ళిపోయారు. వైట్ హౌస్ లో మీడియా విభాగం అధికారి జేమ్స్ ఎస్. బ్రాడి జారీ చేసిన
అధికారిక ప్రకటనకు ఇది సంక్షిప్త రూపం. అసలుది ఇరవై వేల పదాలకు పైగా వుంది. ప్రెస్
బ్రీఫింగ్ ఇలా సాగింది.
ప్రెసిడెంట్: మంచిది ధన్యవాదాలు. అందరూ
వచ్చినట్టులేదు. బహుశా వైరస్ సమస్య కావచ్చు. సాధారణంగా అయితే చాలామందికి ఈ గదిలో స్థలం
సరిపోయేది కాదు.
ఈ వైరస్ మీద పోరాటానికి మన సమాజంలో ప్రతి ఒక్కరినీ
కలుపుకుపోయే ప్రయత్నాన్ని అమెరికా ఇక ముందు కూడా కొనసాగిస్తుంది. ఈ పోరాటంలో మనం
విజయం సాధిస్తామని అమెరికన్లు విశ్వసించాలని నేను కోరుకుతున్నాను. మళ్ళీ సాధారణ
పరిస్తితులు వస్తాయి. కష్టాలు ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయి. మన ఆర్ధిక వ్యవస్థ
కూడా బాగా కోలుకుంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ జాతీయ విపత్తు నడుమ
చిక్కుకుపోయిన మనందరం ఈ పోరాటంలో విజయం
సాధించడంపైనే దృష్టి కేంద్రీకరించాలి.
ప్రతి ఒక్క అమెరికన్ ఒక సంగతి గమనంలో పెట్టుకోవాలి. ఈ
సమయంలో మనం చేస్తున్న త్యాగం అనేకమంది ప్రాణాలు కాపాడుతుందని తెలుసుకోవాలి.
అమెరికాలోని
అమెరికన్లతో సహా, ఇతర ఆసియా అమెరికన్ల ప్రాణాలను కాపాడడం చాలా చాలా ముఖ్యం. ఈ
వ్యాధి /వైరస్ విస్తరించడానికి వాళ్ళు కారణం కాదు.
ఈ వైరస్ తలెత్తినప్పటి
నుంచి దేశంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల సలహాలు ఎప్పటికప్పుడు
తీసుకుంటూ ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ
వైరస్ ని తుదికంటా నిర్మూలించేవరకు ఈ కృషి కొనసాగుతుంది. మన ప్రజారోగ్య నిపుణులు
ఎప్పటికప్పుడు పరిస్తితిని గమనిస్తూ దేశంలో ఈ వ్యాధి విస్తరిస్తున్న పోకడను అధ్యయనం
చేస్తూ తగిన సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అహరహం
పనిచేస్తున్నారు. తరువాత ఏం చేయాలి? మన తదుపరి అడుగులు ఏమిటి అనే విషయంలో పెద్దపెద్ద బృందాలు నిర్విరామంగా
పనిచేస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళు ఓకె
చెబితే మళ్ళీ మనం మన పాత జీవన విధానం వైపు మళ్లిపోతాము.
మన దేశాన్ని
నిర్మించుకున్నది షట్ డౌన్ చేయడానికి కాదు.
లక్షలాదిమంది
అమెరికన్ శ్రామికులకు, చిన్న వ్యాపారులకి, ప్రపంచంలో అమెరికాకు ఒక సమున్నత స్థానం
కల్పించిన బడా పారిశ్రామిక వేత్తలకు ఈ
సంక్షుభిత సమయంలో సత్వర సాయం అందించే బిల్లు విషయంలో ఏకాభిప్రాయ సాధనకోసం నా
ప్రభుత్వం డెమోక్రాట్లతో, రిపబ్లికన్స్ తో కలిసి పనిచేస్తుంది.
మూడు నాలుగు మాసాలు
లేదా అంతకంటే ముందుగానే, ఇంకా త్వరగానే అమెరికా తన వ్యాపార కార్యకలాపాలను తిరిగి
ప్రారంభిస్తుంది. వీలయితే ఇంకా ముందుగానే. సమస్యకంటే పరిష్కారం ప్రమాదకరమయ్యే
పరిస్తితిని అమెరికా కొనితెచ్చుకోదు.
రెండు
వారాల క్రితమే ప్రజలకు జీతంతో కూడిన సిక్ లీవ్, ఫ్యామిలీ లీవ్ ఇవ్వడానికి ఎనిమిది
బిలియన్ల డాలర్లు ఖర్చయ్యే బిల్లు ఆమోదానికి రికార్డు స్పీడ్ తో పనిచేసాము. ఇందులో
వైద్యం ఖర్చులు, వాక్సిన్ల ఖర్చులు కూడా వున్నాయి. కాబట్టి ఈ బిల్లును ఆమోదింప
చేయడంలో పార్టీలకి అతీతంగా అమెరికన్ కాంగ్రెస్ పనిచేయాలి.
వైరస్ వ్యతిరేక
పోరాటంలో ఏం జరుగున్నదో చెబుతాను. ఎనిమిది లక్షల N95 మాస్కులను, కోటీ
ముప్పయి లక్షలకు పైగా సర్జికల్ మస్కులను పంపిణీ చేస్తున్నాము. ఈ బృహత్తర కార్యక్రమంలో
ఫెడరల్ ప్రభుత్వంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు పార్టీలకి అతీతంగా చేయీ చేయీ
కలిపి పనిచేస్తున్నారు.
నా ఆదేశాల ప్రకారం
క్లోరోక్విన్ మందును పెద్ద పెద్ద పరిమాణాల్లో తెప్పించడానికి భారీ ఏర్పాట్లు
జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి ఏ నిమిషంలో నైనా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు
న్యూయార్క్ చేరతాయి.
మీరు కూడా ఈరోజు
వచ్చిన వార్తల్ని చదివారనుకుంటా. ఒక పెద్దమనిషి ప్రాణాపాయంలో పడ్డాడు. బతికే
చాన్స్ లేదని అతడూ నమ్మాడు, ఆయన కుటుంబమూ నమ్మింది. ఏదో ఉపశమన వైద్యం కింద అతడి
కుటుంబం అతడికి ఆ మాత్ర వేసింది. అందరూ అంతా అయిపోయిందనే అనుకున్నారు. కానీ కొన్ని
గంటలు గడవక ముందే అతడులేచి కూర్చున్నాడు. అతడిప్పుడు మామూలుగా వున్నాడు. ఈ
వ్యాధికి ఈ మందు పనిచేస్తుంది అని ఆమోదం తెలిపే ప్రక్రియకు మేము ఎక్కువ సమయం
తీసుకోనందుకు అతడిప్పుడు సంతోషిస్తున్నాడు.
మలేరియా వ్యాధితో
కునారిల్లిన దేశాల్లో ఈ మందును ఆ వ్యాధి నిరోధానికి వాడారు. ఆసక్తికరమైన విషయం
ఏమిటంటే ఆదేశాల్లో ఈ వైరస్ ప్రభావం చాలా తక్కువగా వుంది.
మరో విషయం. ఈ రోజు
ఉదయమే నేను అధ్యక్షుడిగా నాకున్న అధికారాలను ఉపయోగించుకుని ఒక ఆర్డరు మీదసంతకం
చేసాను. ముఖ్యమైన వైద్య పరికరాలను, మాస్కులను అక్రమంగా దాచిపెట్టడాన్ని నిషేధించే ఉత్తర్వు
ఇది.
ఈ సమావేశంలో ప్రెసిడెంట్ ట్రంప్
ప్రశ్నలు అడిగేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారు. విలేకరులను పేరుతో పిలిచి
ప్రశ్న వేయమని కోరారు. ఒక్కొక్కరూ ఒకటి కంటే ఎక్కువగానే అడిగారు. “వ్యాధి కంటే
చికిత్స ప్రమాదకరం కాకూడదు” అంటూ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యపై విలేకరులు బాణాలు
సంధించారు.
శ్రీనివాసరావు గారూ ఇప్పుడే వెలువడిన ఈ క్రింది వ్యాసం చదవండి:
రిప్లయితొలగించండిHow the Pandemic Will EndThe U.S. may end up with the worst Covid-19 outbreak in the industrialized world. This is how it’s going to…Ed Yong in The Atlantic 22 min read
https://medium.com/the-atlantic/how-the-pandemic-will-end-c6200beea706