గరుడ పురాణంలో పాపులకు విధించే శిక్షలు
జ్ఞాపకం ఉన్నాయా!
అనగనగా ఓ అమ్మాయి. బుద్ధి తక్కువై ఓ
అబ్బాయిని ప్రేమించింది. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకుంది. దాంతో మొదలయ్యాయి
ఆ అమ్మాయికి అంతులేని కష్టాలు.
అలాగని అతడు పెళ్ళాన్ని రాచిరంపాన
పెట్టే బాపతు కాదు. ఆ అమ్మాయి అతడ్ని ప్రేమించినంత గాఢంగా, ఘాటుగా కాకపోయినా భార్యపై ఓ మోస్తరు ప్రేమకి తక్కువేమీలేదు.
మరిక కష్టాలు ఏమిటంటారా!
అతడికి దేవుడు అంటే నమ్మకమే. కానీ మూఢ
భక్తి కాదు. గ్రహణాల పేరుతొ చూలింతలను చీకటి గదిలో పగలంతా పడుకోబెట్టడం వగయిరాలు నచ్చవు. భార్య తొలిచూలుతో
వున్నప్పుడు సూర్య గ్రహణం వచ్చింది. చుట్టపక్కాల మాటల్ని, సలహాల్ని ఖాతరు చేయకుండా గర్భిణి అయిన భార్య చేత గోధుమ
పిండి తడిపించాడు. ముద్దలు చేసి, చపాతీలు చేయించాడు. ఉల్లిపాయలు కోయించాడు. రోజువారీ పనులన్నీ పట్టుబట్టి అవసరం లేకపోయినా
చేయించాడు. మూర్ఖంగా ఇవన్నీ చేయించాడే
కానీ మనసు మూలల్లో ఏదో కలవరం. గ్రహణ కారణంగా పుట్టబోయే శిశువు అవకరంగా పుడితే... ఆ
భయం అతడికి ఏ కొద్దోగొప్పో వుండివుండవచ్చేమో కానీ ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె
ప్రేమలో ఏమాత్రం స్వార్ధం లేదు. అందుకే అతడు చెప్పినవన్నీ నిశ్చింతగా చేసేసింది. తన
భర్తపై ఆమెకు ఉన్న నమ్మకమే మూఢనమ్మకాలను జయించేలా చేసింది. మూఢాచారాలపై తన భర్త పెంచుకున్న అపనమ్మకాలకు ఒక
విలువ దక్కేలా చూసింది. ఈ క్రమంలో అంత చిన్న వయస్సులోనే అంతులేని ధైర్య సాహసాలను ప్రదర్శించింది.
ఇప్పుడు చెప్పండి. గరుడ పురాణం నిజమే
అయితే, భార్యను మానసికంగా ఇన్ని చిత్ర హింసలు
పెట్టిన నాకు ఆ శిక్షలు పడాలంటారా లేదా!
మరీ అంతొద్దు. "నన్ను పెళ్లి చేసుకోవడం నీ ఖర్మం. నాకు సేవ చేసుకోవడం నీ ధర్మం." మనదేశంలో అందరూ భర్తలు ఇలాగే ఉంటారు. గరుడ పురాణం లెవిలుకు ఎక్కడికో వెళ్లిపోయారు. మెల్లిగా తెప్పరిల్లి జమకు జమా లస్కులపా చర్చలు టీవీల్లో చేసుకోండి.
రిప్లయితొలగించండిపరామర్శకు వచ్చిన ప్రముఖులకు కృతజ్ఞతగా ఒక పోస్టు పెట్టండి.
రిప్లయితొలగించండిరాబోయే జన్మల్లో భర్తలు భార్యలుగా భార్యలు భర్తలుగా మారి అంతకంత వడ్డీతో సహా చెల్లు వేసుకుంటారు.
రిప్లయితొలగించండి''jaatsya maranam dhruvam''
రిప్లయితొలగించండిLoosing a life partner is very very sad part of one's life.
It is but natural, you get depressed. Don't continue in depression. Get out of it. No body can console you except yourselves.
You are your own guide,friend and philosopher as your external guide,friend and philosopher had joined you by leaving her body. She had not gone elsewhere. Now she is you, find out and you will come of depression. Get out of depression, yourselves and continue life, that is the beauty of life.
It is easy to spell out but difficult to implement. Wish you all the best in this time of depression.
Please read the earlier post and comment I posted on your blog. Seems you still did not read and noticed anything.
రిప్లయితొలగించండి@ అజ్ఞాత: చదివానండి. ధన్యవాదాలు. అందరూ పేరు పెట్టకుండా అజ్ఞాత అని రాస్తున్నారు. ఎలా జవాబు ఇవ్వాలో తెలియడం లేదు.
రిప్లయితొలగించండిమంచి పాయింట్ శ్రీనివాసరావు గారూ. చెయ్యగలిగినది ఒకటే - మీరు జవాబిస్తే గనక Anonymous అని వ్రాసి పక్కన ఆ Anonymous గారి కామెంట్ యొక్క తేదీ, టైము కూడా పేర్కొనండి.
తొలగించండిఅయినా పరామర్శ కూడా Anonymous గా చెయ్యడమేమిటో?
@విన్నకోట నరసింహారావు గారు. నేనూ అదే అనుకున్నాను. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి