14, మార్చి 2019, గురువారం

ఏది నిజం



కంటికి కనిపించేది, చెవికి వినిపించేది నిజమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.
పలానా పార్టీకి పలానా నాయకుడి గుడ్ బై. పలానా పార్టీలో చేరబోతున్న పలానా.
ఈ స్క్రోలింగులు అన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఈ లీకులన్నీ ఎలా వస్తాయి, ఎవరు ఇస్తారు అనేది జర్నలిజంలో అంతోఇంతో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఆ ఊహాగానాల మీద ఊహాగానాలు. ఈ చర్చలు అవసరమా అంటే అవసరమే. జనాలకు అవసరం కాకపోవచ్చు కానీ,  ఆ అభ్యర్దులకు ఇవి చాలా అవసరం. తమ అభ్యర్ధిత్వం పట్ల బేరసారాల్లో పై చేయి సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆ లీకులకి మరింత బలం చేకూర్చడానికి వాళ్ళే మళ్ళీ ప్రకటనలు చేస్తుంటారు, వాటిని నమ్మవద్దనీ, అవన్నీ ఆధారరహితమనీ.
ఈమధ్య ఒక పార్టీ అభ్యర్ధుల అధికార జాబితా అంటూ అన్ని టీవీల్లో స్క్రోలింగులు అదేపనిగా పరుగులు పెట్టాయి. చివరకి ఆ పార్టీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటన చేయాల్సివచ్చింది, వాటిని నమ్మవద్దని, తాము అధికారికంగా ఎలాటి జాబితా విడుదల చేయలేదని.
అధ్యక్షుల వారి ప్రకటన కూడా అధికారికమా, లేక లీకుల్లో భాగమా అని సందేహించే స్థాయికి ఈ లీకుల వ్యవహారం సాగుతోంది.
కాబట్టి, కావున చెప్పేది ఏమిటంటే స్క్రోలింగులు చూసి వ్యాఖ్యానాలు చేస్తే తర్వాత నాలుక కరుచుకునే ప్రమాదం లేకపోనూ లేదని.      
   

1 కామెంట్‌:

  1. జనాలకు అవసరం లేనివాటిని గురించి మీడియా స్క్రోలింగ్ మీద స్క్రోలింగ్ చూపించడం అవసరమా?! అవసరం లేదు. కానీ ఆకలి తీరిందని అడుక్కోవడం మానెయ్యరు ఈ కలికాలంలో.

    రిప్లయితొలగించండి