18, నవంబర్ 2018, ఆదివారం

చిన్న విజ్ఞప్తి – భండారు శ్రీనివాసరావు


అనేక సంవత్సరాలు అయింది రామాంజనేయ యుద్ధం సినిమా చూసి. అందులో ఆంజనేయుడు శ్రీరాముడితో వాదం పెట్టుకుంటూ ఒక పద్యం చదువుతాడు. ఒకప్పుడు కలిసివుండి, ఒకరికొకరు సాయం చేసుకుని ఇప్పుడు విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే రాజకీయ పార్టీల ప్రతినిధులను చూస్తున్నప్పుడు నాకీ పద్యం ఎందుకో జ్ఞాపకం వస్తుంది.
నిన్ననో మొన్ననో ఈటీవీ ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో విశ్వనాద్ గారు, బాలూ గార్ల  సమక్షంలో ఒక పిల్లపిడుగు  ఈ పద్యం పాడుతుంటే   చటుక్కున కాగితం తీసుకుని కొంత రాసుకున్నాను. అయినా కొన్ని గ్యాపులు మిగిలిపోయాయి. మీలో ఎవరికయినా తెలిస్తే దయచేసి పూరించి పూర్తి పద్యం పంపాలని నా కోరిక.
నేను రాసుకోగలిగినంతవరకు ఆ పద్యం:
ఆంజనేయుడు:  
“సీతమ్మ జాడ మీ చెవివేయమైతిమా నాటితో రామాయణంబు సున్న
“సేతుబంధన మాకు చేతగాదంటిమా రావణు౦డిందాక రాజ్యమేలు
“మైరావణుని ప్రాణ మర్మంబు తెలపమా యుద్ధమ్ము లంక అబద్ధమగును
“నిశిరాత్రివేళ సంజీవి తేమైతిమేని సౌమిత్రి స్వర్గాన సభలుదీర్చు
“ఆలుబిడ్డలు మాకు ప్రాణాలటంచు అపుడు, ఆనాడు కిష్కిందవీడి రామైతిమేమి..........”
“......... అది మా కోతి లక్షణ౦బు, మా జాతి లక్షణంబు.... ఇపుడు నేడు ఇటుల చింతించి చింతించి వగచిన వగచిన  ఏమి ఫలము?”     

3 కామెంట్‌లు:

  1. ఆలుబిడ్డలు మాకు ప్రాణాలటంచు కిష్కిందవీడి రామైతిమేమి,పట్టాభిషేకమె హుళక్కి.
    మాజాతి లక్షణంబులు,మా కోతి లక్షణంబులు ఆనాడు అపుడె మీకు తెలియు
    ఈనాడు ఇపుడు చింతించి వగచిన వగచిన ఏమి ఫలమూ రామా!.........

    రిప్లయితొలగించండి