ఎమ్మెస్సార్ కృష్ణారావు గారు. రేడియోలో
నా సీనియర్ కొలీగ్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు అధికారిగా హైదరాబాదులో, ఢిల్లీలో పనిచేసి
రిటైర్ అయ్యారు. ఆయనకు తెలుగంటే ప్రాణం. ‘మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడండి, లేదా
పూర్తిగా తెలుగులో మాట్లాడండి, అంతేకాని ఇంగ్లీష్ తెలుగు కలిపి సంకరం చేయొద్దు’ అనేవారు.
‘నా వైఫ్’ అని ఏదైనా చెప్పబోతే ఆయనకు
చర్రున కాలేది. ‘నా వైఫ్ ఏమిటి ఛండాలంగా, మా ఆవిడ అని హాయిగా అనొచ్చుగా’ అనేది ఆయన వాదన.
అలాగే ‘సతీమణి’ అనే పదం పట్ల
కృష్ణారావు గారికి కొన్ని అభ్యంతరాలు ఉండేవి.
‘సతీమణి అంటే సతులలో మణి అని అర్ధం. రుక్మిణి
కృష్ణుడి సతీమణి. ఆయనకున్న అష్ట సతుల్లో ఆవిడ మణి అని. పలానా వారి సతీమణి అని
వార్తల్లో చెబితే తప్పు అర్ధం వస్తుంది, ఆయనగారికి ఇంకా వేరే భార్యలు వున్నారని.
అలా కాకుండా పలానా వారి భార్య’ అని రాయమనేవారు.
టీవీ వంటల కార్యక్రమంలో తెలుగు పరిస్థితి- బౌల్ లోకి వన్ కప్ రైస్, త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసి సోక్ చేయండి . ఫ్రెష్ వెజిటబుల్స్ పీసెస్ గా కట్ చేసుకుని అయిల్ లో ఫ్రై చేసి మిక్స్ చేయండి. సాల్ట్ యాడ్ చేసి ట్వంటీ మినిట్స్ కుక్ చేయండి. హాట్ హాట్ గా ప్లేట్స్ లో సర్వ్ చేయండి.
రిప్లయితొలగించండిఇది మాత్రం నిజం. పైగా సిగ్గుపడాల్సిన విషయం.youtubeలో తెలుగు వంటలు వండి చూపించే నారీమణులు కూడా అన్నీ ఇంగ్లీషు పదాలే మాట్లాడుతుంటే "పరమాన్నం తింటుంటే రాయి తగిలినంత" అసౌకర్యంగా ఉంటోంది.
తొలగించండిసతీమణికి అర్ధంలో ఏదో తేడా వుందని కొన్నాళ్ళుగా పీడిస్తున్న సందేహం మీ ఈ టపాతో తీరింది సార్!
రిప్లయితొలగించండిపాలిగమీకి అడ్డులేని పురుషాధిక్య సమాజం కాయిన్ చేసిన పదం అయివుంటుంది. ఏదో ఒకనాడు సుప్రీంకోర్టు దీన్ని బాన్ చేసేస్తుంది. తృప్తి దేశాయ్ లాంటి వాళ్ళకే ఇంకా తెలిసినట్టు లేదు.
సతీమణి అంటే ఒకవ్యక్తి సతులలోకెల్లా మంచిదని ఎందుకు అనుకోవాలి? గుంపులోని సతులలోకెల్లా ఉత్తమమైనది అని కూడా అర్థం ఉండొచ్చుగా. ఈ విషయం పై భాషా వేత్తల అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది.
రిప్లయితొలగించండి@“బుచికి”
రిప్లయితొలగించండి// “హాట్ హాట్ గా ప్లేట్స్ లో సర్వ్ చేయండి.” //
—————————
...... యమ్మీ ఉంటది. సుప్పర్ ఉంటది.
—————————
ఖర్మ 😢.
“సతీమణి” పదం గురించిన హాస్యం నా చిన్నతనం నుంచి వింటున్నదే.
రిప్లయితొలగించండిసతీమణి, భార్యామణి పదాలకి ... మణి లాంటి సతి, మణి లాంటి భార్య అనే అర్థం తీసుకోవాలని నా అభిప్రాయం.
ఈ లెక్కన సతీబండ అనేది కూడా తెలుగు పదమే అధ్యక్షా!
తొలగించండి