10, అక్టోబర్ 2018, బుధవారం

మీ టూ – భండారు శ్రీనివాసరావు


యాభై ఏళ్ళ క్రితం కాబోలు ఓ కధ చదివాను.
ఆఫీసులో తన కింద పనిచేసే ఓ అమ్మాయిని అధికారి ఎన్నో ఆశలు చూపి లోబరుచుకోవాలనుకుంటాడు.
ఆ అమ్మాయి ఇలా అంటుంది.
“నేను పొద్దున్నే లేచి మూడు బస్సులు మారి ఆఫీసుకు వస్తాను. నాకు పెళ్లయింది. పిల్లాడు వున్నాడు. కుటుంబానికి ఆసరాగా వుండడం కోసం జీతం తక్కువయినా ఈ పనిచేస్తున్నాను. మీరు చెప్పే  విధంగా డబ్బు సంపాదించే ఆలోచన వుంటే నేనింత కష్టపడాల్సిన అవసరమే వుండేది కాదు, మీరే మా ఇంటికి వచ్చేవారు”
ఆఫీసరుకు కళ్ళు తెరిపిళ్ళు పడతాయి.
 అది కధ కనుక సుఖాంతం అయింది అలా.
అర్ధశతాబ్దం గడిచినా పరిస్తితి మారలేదు అనడానికి ‘మీ టూ’ సంచలనం ఓ ఉదాహరణ. 
Image may contain: one or more people and text 


ఈరోజు బుధవారం మధ్యాహ్నం మోజో టీవీ ప్రత్యేక చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు: కృష్ణ కుమారి, సామాజిక కార్యకర్త, నీహారిక రెడ్డి (న్యాయవాది) యాంకర్: మోజో కిషోర్. అంశం: Me too
LINK:
https://www.youtube.com/watch?v=k8_-9xLUcCI&t=464s

16 కామెంట్‌లు:

  1. బేసిక్ గా చూస్తే ఆల్మోస్ట్ ప్రతి మగవాడు ఓ చిత్తకార్తెకుక్క. రుజువు కావాలంటే ఓ ఆడది వెళుతుంటే ఎన్ని జతల మగ కళ్ళు (వయసుతో నిమిత్తం లేదు) వెంబడిస్తాయో గమనించండి, అదే కాస్తంత ఒంపు సొంపూ ఉన్న ఆడది (వయసుతో నిమిత్తం లేదు) అయితే గనుక ఎంత ఆబగా (వయసుతో నిమిత్తం లేదు) కళ్ళతోనే మింగేస్తాయో కనిపెట్టడం చూసేవాళ్లకు పెద్ద కష్టం కాదు (ofcourse ఇది మగవాళ్లకు వర్తించదు ఎందుకంటే వాళ్లకు (వయసుతో నిమిత్తం లేదు) ప్రక్కనోళ్ళను గమనించే తీరికెక్కడ ఉంటుంది, వాళ్ళు కూడా చొంగలు కారుస్తూ కళ్ళు మిటకరించి గుటకలు మింగుతూ ఉంటారు గనుక). ప్రతి మగవాడు (వయసుతో నిమిత్తం లేదు) ఆడది అందకుండా ఉన్నంత వరకే మగవాడిగా కనబడతాడు. అవకాశం దొరకగానే లంఘిస్తాడు. చిత్తకార్తెకుక్కావతారం ఎత్తుతాడు (వయసుతో నిమిత్తం లేదు).

    మగవాళ్లలో మంచివాళ్ళు లేదా అని మీరడగవచ్చు. ఎందుకు లేరూ ! వందలో ఒకడు కూడా దొరకడు గానీ ఓ వెయ్యిలో ఓ నలుగురైదుగు రు దొరకవచ్చు (వయసుతో నిమిత్తం లేదు). వాళ్లలో కూడా ఆడది ఒంటరిగా దొరికితే ఎంతమంది (వయసుతో నిమిత్తం లేదు) నిలబడతారో నిస్సంశయంగా చెప్పలేం! ఇదే లెక్క. బహుత్ పక్కా! ఒరే సాంబా రాసుకోరా!

    ఈ లోకాన్ని ఎవరన్నా మారుస్తారేమో అన్న ఆశే వద్దు. అదసలు మగవాళ్లా అన్న మాటే వద్దు. ఎందుకంటే అసలు ఇలా లోకముందంటే కారణం వాళ్ళే. ఇదో లుచ్చా లోకం - నాలుగు నెలల పసిపాపలను కూడా వదలని లుచ్ఛాగాళ్ళ లోకం.

    రిప్లయితొలగించండి
  2. మగంగులు 'ఆ' అవకాశం కోసం ఎవర్ రెడీ. ఈ 'నాక్కూడా' లో ముందుకొస్తున్న సినీ తారలు, మొడల్లు తాము కూడా కారణం కాదా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రతి వెబ్ సైట్ లో , ఇన్స్టాగ్రాం లో బరితెగించి బట్టలు విప్పుకొని అంగప్రదర్షన అందాలను ఆరబొయడమెమిటి. ఇది కూడా ఒక రకం వ్యభిచారమే. మగవాడు ఒక జంతువు గా ప్రవర్తిస్తాడు. వీళ్ళు అర్ధ నగ్నంగా బికినీలు ధరించి మగంగులను రెచ్చకొట్టదం లేదా. వీళ్ళ వల్ల మగంగులకు పైత్యం ప్రకోపించి జంతువులుగా మారి అమాయక స్త్రీలపై బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  3. వంశపారంపర్యంగా నటీనటుల వారసులు మరియు రాజకీయ నాయకుల కుటుంబాలలోని వారు తప్ప మిగతా వాళ్ళు సినిమాలలోకి రావాలన్నా, రాజకీయనాయకులు అవ్వాలన్నా వేధింపులకు సిద్ధపడే వస్తారు.మీరు చెప్పిన కధ 50 సం ల క్రితం సంగతి అదీ ఉద్యోగస్తుల సంగతి. అప్పట్లో ఉద్యోగస్తులను వివాహం చేసుకునేవారు చాలా తక్కువ.

    ఇపుడు మీ టూ ప్రకంపనల వల్ల ఏం సాధిస్తున్నారో అర్ధం కావడం లేదు.ఎవరైనా ఆరోపణలను ఒప్పుకుంటారా అని చూస్తున్నాను.

    సినిమాలలో బికినీ వేసుకోడానికి ఒప్పుకుంటారు,పొట్టి గౌను వేసుకోడానికి ఒప్పుకుంటారు, ముద్దు పెట్టుకోడానికి ఒప్పుకుంటారు, ఆఖరికి తాళి కూడా కట్టించుకుంటానికి కూడా ఒప్పుకుంటారు ఇన్ని చేసేసిన తరువాత ఇక మిగిలిందేవిటీ ?

    మహానటిలో ఒక డైలాగ్ ఉంది...
    జీవితంలో నటించవచ్చు కానీ జీవితాన్ని నటించకూడదు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీనివాసరావు గారూ... ఆడది డాక్టర్ లేదా టీచర్ అవ్వాలనుకున్నంత సులభంగా వేశ్య అవ్వాలనుకోదు. ఆల్రెడీ ఉద్యోగం ఉన్న ఆడది ఆ పని చెయ్యడానికి ఎలా ఒప్పుకుంటుంది? పూర్వం మగవాళ్ళకి ఆ అవసరం తీర్చడానికి భోగం కులంవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు భోగం వృత్తి లేదు కానీ లైంగిక వేధింపులు & రేప్‌లు మాత్రం ఉన్నాయి.

    నీహారిక గారూ... ఇప్పుడు జనానికి తిరగనివాళ్ళ మీద సానుభూతి కంటే తిరిగేవాళ్ళ మీదే సానుభూతి ఎక్కువగా ఉంది. శ్రీరెడ్డి విషయంలో గొడవ జరుగుతున్నప్పుడు ఫేస్‌బుక్‌లో ఉష అనే ఆవిడ వ్రాసారు "శ్రీరెడ్డి నిర్మాతలతో పడుకున్నంత మాత్రాన వాళ్ళు ఆమెకి అవకాశం ఇస్తారని గ్యారంటీ లేదు, అది ఆమె రిస్క్" అని. ఉష గారు చెప్పినది కరెక్టే కదా అని నా వాల్‌లో కూడా అదే విషయం వ్రాసాను. అంతే, కొంత మంది నన్ను పురుషాహంకారి అనుకున్నారు. అలా అనుకున్నవాళ్ళలో ఒక స్త్రీవాద పత్రిక ఎడిటర్ కూడా ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  6. "మి టూ" లాంటి రగడలు చూస్తుంటే 2013 లో అప్పటి కేంద్రమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా గారు వెలిబుచ్చిన అభిప్రాయం గుర్తొస్తోంది. ఆడవాళ్ళను పర్సనల్ సెక్రటరీ గా పెట్టుకోవడానికె కూడా భయమేస్తోంది, వాళ్ళు ఎప్పుడేం లైంగికవేధింపు ఆరోపణలు చేస్తారో జైలుకు వెళ్ళాల్సొస్తుందేమో అనే భయం వలన ... అన్నాడు ఆయన. నిజమే కదా అనిపిస్తుంది. తరవాత ఆయన్ని మెడలు వంచి ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకునేలా చేశారు లెండి. ఈ క్రింది లింక్ చూడండి.

    మహిళా ఉద్యోగుల గురించి ఫరూఖ్ అబ్దుల్లా కామెంట్లు

    ఈ మధ్య ఇటువంటి ఆరోపణలు ఎక్కువవుతున్నాయి అనిపిస్తోంది. మూడు రకాలు - (1). నిజమయ్యుండవచ్చు (శ్రీరెడ్డి లాంటి సన్నకారు ఆర్టిస్టుల విషయంలో ఇటువంటి దోపిడీకి అవకాశాలు ఎక్కువగా? (2).కక్షసాధింపు గానీ, ఏమన్నా లాభం పొందాలని గానీ అయ్యుండవచ్చు. ఒక సంస్థలో వృద్ధుడైన ఎమ్.డి. గారి మీద ఆయన గారి లేడీ సెక్రటరీ లైంగికవేధింపు ఆరోపణలు చేసి, తరవాత దాన్ని ఉపసంహరించుకోవడానికి తన ప్రమోషన్ కు బేరం పెట్టి సాధించుకున్నది. (3). సెన్సేషన్ చేసి పబ్లిసిటీ సంపాదించడం కోసం (attention seeking) కావచ్చు. తద్వారా అవకాశాలు వస్తాయనే ఆశ కావచ్చు.

    అయినా సంవత్సరాల తరబడి మాట్లాడకుండా ఉండి ఎప్పుడో "మి టూ" అంటూ బయటకి వస్తే (ఉదా:- అమెరికాలో 53 ఏళ్ళ జడ్జ్ Kavannaugh మీద స్కూలు రోజుల్లో వేధించాడు అని ఇప్పుడు ఆరోపణ. అఫ్కోర్స్ ఉన్నతపదవులలో నియామకానికి సదరు వ్యక్తి నైతికంగా మచ్చలేని వ్యక్తి అయ్యుండాలని సమాజం ఆశించడంలో తప్పులేదు. అయితే ఏ లెవల్ ఉద్యోగానికయినా అదే స్టాండర్డ్ వర్తించాలి) వారి ఆరోపణల విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంటుంది. విమానప్రయాణాల్లో కూడా చెయ్యి తగిలిందనో, కాలు తగిలిందనో స్త్రీలు ప్రక్కసీటు ప్రయాణీకుడి మీద కంప్లైంట్ ఇవ్వడం, అరెస్ట్ చేయించడం కూడా తరచూ వినబడే వార్తే.

    ఏమయినప్పటికీ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువవుతున్న ఇటువంటి ఆరోపణల వెనక సీరియస్-నెస్ సరిగ్గా ఉండేలా ఆరోపణలు చేసేవారు చూసుకోవాలి.

    రిప్లయితొలగించండి
  7. "గుదిబండ" హరిబాబుది అని తెలిసిపొయ్యాక కూడా విశ్వ వీక్షణం మీద నిందలెయ్యడం తప్పు..

    రిప్లయితొలగించండి
  8. నరసింహారావు గారు, శ్రీరెడ్డిని అలా వాడుకోవడం తప్పే. మోసం చెయ్యడం తప్పైనప్పుడు వేశ్యని కూడా మోసం చేసే అధికారం ఎవరికీ లేదు. అందంతో ఏమాత్రం సంబంధం లేని గుమాస్తా ఉద్యోగం చెయ్యడానికి వచ్చిన స్త్రీని కూడా కాస్టింగ్ కౌచ్ చేసేవాళ్ళని చూస్తోంటే చాలా రోత పుడుతోంది.

    రిప్లయితొలగించండి
  9. When it is the case of Srireddy, there certainly is something fishy about her acts. I think only 10% to 20% might be correct from what she says. In any case, whatever she says, she is not at all innocent, and she is fully aware of her deeds. She is more interested in scheming to fulfill her ulterior motives than to what is shown to the world.

    రిప్లయితొలగించండి
  10. నేను శ్రీరెడ్డిని ఏమాత్రం సమర్థించడం లేదు కానీ ఆమెతో పడుకున్న సినిమా నిర్మాతలది కూడా తప్పే కదా. "నేను మీతో పడుకుంటాను, మీరు నాకు సినిమాలో ఆఫర్ ఇవ్వండి" అంటూ శ్రీరెడ్డి తన క్లీవెజ్ చూపించినా కూడా నిర్మాతలు ఆమెతో పడుకోకూడదు. ఆమెకి ఆఫర్ ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇవ్వము అని డైరెక్ట్‌గా చెప్పాలి కానీ ఆమెతో పడుకుని ఆమెని జోకర్‌ని చేసి ఆడుకునే అధికారం వాళ్ళకి లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Sir, then how should we understand her making copies of her indecent acts and threatening to throw them out, in the guise of exposing them? Do you really think scheming people should be rewarded rich? And her body language, her abusive, foul language? Dou you really think that everything looks fair on her side?

      తొలగించండి
  11. ఆమెతో పడుకున్నవాళ్ళకి మాత్రం డీసెన్సీ ఉందా? "నీకు ఆఫర్ ఇవ్వము" అని డైరెక్ట్‌గా చెప్పాలి కానీ ఆమెతో పడుకుని వదిలెయ్యడం ఏమిటి?

    రిప్లయితొలగించండి
  12. ఒక "Me Too" వ్యవహారాన్ని గమనిస్తున్న వారి వైపు కోణం గురించి ఈ క్రింది లింక్ లో చదవచ్చు.

    "Me Too" untold side

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందులో రియా అనే వ్యక్తి రాసిన విషయం చదివితే షాక్ అవుతాం.

      Ria Nyesterday

      Greetings readers,
      I have observed a very unique agenda of this imported #Metoo movement. which is spreading like wildfire in BOLLYWOOD with new cases everyday rather every hour...It is not that these women did not have police help, union help or legal help available.These were in place since many years...even social media is very active since 2005 or rather even before that.. but they never approached them and waited for this imported movement from US, bought by an actress who is currently settled in US and has now come to India to rake up this decade old case...Here I am not belittling any of the victims or their agonies.
      The whole world watches Bollywood and it carries a certain image which represents our country India..This image is completely maligned now because all the harrassed but priveledged ladies have suddenly woken up after decades and demanding sympathy for themselves. This image of the country is absorbed by the world and the residents of this country are brainwashed in believing India to be very dangerous for women..because Bollywood's voice is more louder than any other industry..
      India is growing economy and is growing at good speed...and not many countries are happy with the growth of this country. Do you know that according to 2018 Thompson Reuters Foundation's survey, India has been propogated as the World's most dangerous country for women ...even ahead of war torn Afghanistan and Syria, Somalia is fourth and Yemen is eighth...[You can google more about this report] why is this survey report not protested by Indians...but this #Metoo movement will surely confirm this report and send a derogatory image of our country to the whole world]
      Do all the supporters of this imported #Metoo movement still believe that India is that bad for working women? Can't anyone see the hidden agenda behind this.
      Thanks for reading..

      తొలగించండి
  13. సూర్య గారూ,
    రియా అనే ఈవిడ చెప్పినదానిలో నిజం లేక పోలేదు. న్యాయం కోసం సకాలంలో పోరాడకుండా ఎప్పుడో వచ్చి “మి టూ” అంటే ఎలాగ? న్యాయం చెయ్యగలిగినవారి వద్దకు ఆ నాడే ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న తలెత్తడం సహజం. గమనిస్తే ఈ గొడవ సినిమా రంగం లోనూ, మోడలింగ్ రంగం లోనూ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఆఫీసు ఉద్యోగుల్లో అంత ప్రబలంగా లేదు .... పూర్తిగా లేదని కొట్టిపారెయ్యలేం కానీ ఎంతైనా చెదురుమదురు సంఘటనలే అని చెప్పాలి. M J అక్బర్ గారు ఈ ఆరోపణల వెల్లువను “viral fever” అన్నాడు మొన్న (ఆయన మీద ఆరోపణల్లో నిజం చివరికి అటో ఇటో తేలుతుంది, అది వేరే సంగతి కానీ ఈ “మి టూ” లు ఒకరిని చూసి మరొకరు ఇలా రచ్చ చేస్తున్నారా అనిపించక మాత్రం తప్పదు).

    నిన్ననొక ఆసామీ చెప్పాడు - ఆఫీసులో మహిళా ఉద్యోగిని మీ డ్రెస్ బాగుంది అనడం కూడా నిషిద్ధంట ... అది sexist remark కోవలోకి వస్తుందని వారి ఆఫీసు వారి రూలట. అది విని నాకు మతి పోయినంత పోయింది. ఆఫీసులో సహోద్యోగులతో మాటామంతీ కూడా ఆపేసుకుంటారు ఇలా భయపెడితే 😳. ఇదే కామెంట్ ఒక మహిళ మరో మహిళతో గనక అంటే ఆ మొదటి మహిళ స్వలింగ సంపర్కం కోసం ప్రయత్నిస్తోందేమో, ఆ రకంగా అది కూడా sexist remark కిందే జమకట్టకూడదా ఈ ఆధునిక కాలంలో ... అనలేమా అంట 🤔? మామూలు దైనందిన సంభాషణను కూడా వక్రీకరిస్తే ఎలాగ? ఎనీవే Thank God, నేను రిటైరయిపోయాను ... ఆఫీసులో ఇటువంటి మనస్తత్వాలు రాక ముందే 🙏.

    రిప్లయితొలగించండి
  14. వాట్సప్ లో తిరుగుతున్న ఓ రెండు మెసేజ్ ఫార్వర్డ్ లు 👇 (చాలా మంది చూసే ఉంటారు. అయినా ఆలోచింపజేసేవిగా ఉన్నాయని ఇక్కడ షేర్ చేస్తున్నాను) 😀😀😀.
    ——————
    BEWARE !!!
    Today’s “SWEET U” may be
    Tomorrow’s “ME TOO”.
    ——————
    “Found my old schoolmate on Facebook today. I just told her that
    I’m missing those school days.
    She replied immediately
    👇
    #MeToo.

    I got so scared that I blocked her.
    😜😀😂”
    ——————-

    రిప్లయితొలగించండి