10, ఆగస్టు 2018, శుక్రవారం

"సైకిల్ కాంగ్రెస్" - సాక్షి ఫోర్త్ ఎస్టేట్

గురువారం రాత్రి సాక్షి 'అమర్' ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు: మల్లాది విష్ణు (వైసీపీ), నరహరిశెట్టి నరసింహులు (కాంగ్రెస్), శ్రీపతి రావు (బీజేపీ).
అంశం : "సైకిల్ కాంగ్రెస్"
LINK:
https://www.sakshi.com/video/daily-programmes-fourth-estate/fourth-estate-9th-august-2018-tdp-congress-alliance-1106019

12 కామెంట్‌లు:

  1. Hello Sir,
    If we follow your blogs regularly majority of us understands that your weights of balance pushes south. However shall we replace TDP with SAMAJWADI PARTY as they both have CYCLE symbols???

    రిప్లయితొలగించండి
  2. ఎన్నికైన సభ్యులు ఎవరైనా చట్టసభకు హాజరవకుండా నెలల తరబడి పాదయాత్రలు చేస్తూ గడుపుతుంటే అటువంటివారి చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేసే వీలుండేలా ఏదన్నా నిబంధన ఉందాండి భండారు వారూ? ఉంటే ఎంత బాగుండును - ప్రజాస్వామ్యం పరిహాసం పాలవకుండా?

    రిప్లయితొలగించండి
  3. చట్టసభల్లో కూడా హాజరు గురించిన నిబంధనలేవో ఉన్నా యనుకుంటానండీ.

    ఎంతవరకూ నిజం అన్నది తెలియదు కాని, ఎవర్జన్సీ రోజుల్లో సుబ్రహ్మణ్యస్వామిని అరెష్టు చేయాలని ఇందిరమ్మా అది తప్పించుకొనాలని స్వామిగారూ యత్నిస్తున్నరోజుల్లో ఒక చిక్కు వచ్చిందట. హాజరు నియమాన్ని అతిక్రమించకుండా ఉండేందుకు సుబ్రహ్మణ్యస్వామికి ఒకరోజున ఆఖరిదినం ఐనది. ఆయన వస్తే పట్టుకుందుకు అంతా సిధ్ధం అయింది ఇందిరమ్మ మంత్రాంగమూ యంత్రాంగమూ. ఐతే ఆయన రానేలేదు పర్లమెంటుకు. ఇంకేం. హాజరుపట్టిలో సంతకం చేయలేకపోయాడు కాబట్టి రూల్ అతిక్రమించినందుకు నోటీసు జారీ చేసి ఆయన సభ్యత్వం కొట్టేద్దామని - హాజరుపట్టీ తెరచి చూస్తే అందులో సుబ్రహ్మణ్యస్వామి సంతకం దర్శనం ఇచ్చింది. ఆరాతీస్తే ఆయన ఆడవేషంలో వచ్చి సంతకం పెట్టి మాయమైనాడని తేలిందట.

    ఐతే హాజరు నియమాలు అన్ని చట్టసభలకూ ఉంటాయా అవెలా ఉంటాయీ అన్నది జైగారు చెప్పా లనుకుంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్సండీ. విషయపరిజ్ఞానం దండిగా ఉన్న జైగారే చెప్పాలని నేనూ అనుకుంటున్నాను.

      ఇందిరాగాంధీ గారి రోజుల్లో సెక్యూరిటీ చెకింగ్, డిజిటల్ చెకింగ్ పద్ధతులూ ఇంత విరివిగానూ స్ట్రిక్ట్ గానూ లేవేమో, కాబట్టే సుబ్లహ్మణ్య స్వామి గారు ఆడవేషంతో దూరిపోగలిగినట్లున్నారు ☺. అసలు విషయం - ఈ ఉదంతం బట్టి చూస్తే అటువంటి నిబంధనలేవో ఉన్నాయనే అనిపిస్థోంది. ఉంటే వాటిని అమలుఅమలుపరిచాలంటే పొలిటికల్ విల్ అవసరమనుకోండి.

      తొలగించండి
  4. 19 లో పుట్టగోచి ఎన్నికలవరకు యాత్రలు పచ్చ మీడియా పైశాచికం తప్పదు.

    రిప్లయితొలగించండి
  5. @శ్యామలీయం, @విన్నకోట నరసింహా రావు:

    నాకు ఈ విషయం అంతబాగా తెలీదండీ. వరుసగా ఫలానా (30/60/90?) రోజులు డుమ్మా కొడితే సభ్యత్వం రద్దు అవుతుందని నియమాలు ఉన్నట్టే ఉన్నాయి కానీ సదరు continuous unsanctioned absence సంఖ్య bylaws/rules of procedure తరహాలో ప్రతి సభ ఏర్పాటు చేస్తుందని అనుకుంటాను.

    ఒకానొక దశలో వీపీ సింగ్ & కెసిఆర్ గార్లు కూడా చివరి రోజు just-in-time attendance సంతకం చేసి సభ్యత్వం రద్దు కాకుండా జాగ్రత్త పడ్డారని గుర్తు.

    రాజు తలుస్తే దెబ్బలకు కొదవా? ఏలిన వారు నియమాలు, సాక్ష్యాలు, రికార్డులు & కమిటీలు అన్నీ తారుమారు చేస్తే ఎవరూ ఆపలేరు.

    Catch 22 page 73: "The case against Clevinger was open and shut. The only thing missing was something to charge him with"

    సుబ్రహ్మణ్యం స్వామి హాజరీ వివాదం రాజ్యసభ సైటులో దొరికింది:

    https://rajyasabha.nic.in/rsnew/privileges_digest/priv-19.pdf

    రిప్లయితొలగించండి
  6. థాంక్స్ జై గారూ. అయితే అటువంటి వెసులుబాటు ఉండటానికి ఉందన్నమాట.
    మీరిచ్చిన రాజ్యసభ లింక్ చూశాను. స్వామి గారి ప్రవర్తన అనుచితంగా ఉందని భావించినట్లున్నారు సభవారు. తెలిసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఆడవేషంలో వచ్చినట్లు పేర్కొనలేదు గానీ వారు సభకు హాజరవకపోయినా వేరేవారెవరో హాజరుపట్టీలో స్వామి గారి సంతకం చేసినట్లు తేలిందని వ్రాశారు కదా Curious. ఆహా, మన ప్రజాప్రతినిధులు 🙁.

    రిప్లయితొలగించండి
  7. @విన్నకోట నరసింహా రావు:

    "హాజరవకపోయినా వేరేవారెవరో"

    కాలేజీలో అన్నిటి కంటే ముందు ఇదే నేర్చుకుంటాం కదండీ :)

    రిప్లయితొలగించండి
  8. ఓహో, అది కూడానా “జిలేబి” గారూ? నటనాగ్రేసరులన్నమాట. వివిధ వేషాలు వేసే తెలుగు ఎమ్.పి. కూడా ఒకాయన ఉన్నట్లున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ఏ వేషం వేసినావెయ్యి గాని మా వేషం వేస్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయి"అంటోంది ఒక వర్గం.

      తొలగించండి