11, జులై 2018, బుధవారం

పత్రికల్లో పేరు చూసుకోవాలనే దశ దాటి పోయాను - భండారు శ్రీనివాసరావు


చాలా కాలం క్రితం నేను రాసిన ‘మార్పు చూసిన కళ్ళు’ (నా మాస్కో అనుభవాలపై పుస్తకం) ఆవిష్కరణ రవీంద్ర భారతిలో జరిగింది. అప్పటి తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు ఆవిష్కరించారు. పత్రికా సంపాదకులు కూడా కొందరు పాల్గొన్నారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు ఒకతను వచ్చి పలానా పత్రిక విలేకరిని అని పరిచయం చేసుకున్నాడు. రవీంద్ర భారతిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను కవర్ చేయడానికి విలేకరుల బృందం తరపున వచ్చాననీ, ఫొటోకు అయితే ఇంత, వార్తకు అయితే ఇంత అని ఏదో చెప్పబోయాడు. నేను మిమ్మల్ని రమ్మని పిలిచానా అని అడిగాను. ‘లేదు, ‘మేమే నగరంలో నేడు’ అని పత్రికల్లో వచ్చే సమాచారం తెలుసుకుని వస్తాము’ అన్నాడు. అప్పుడతనితో చెప్పాను.
‘చూడు బాబూ, నేనూ ఇదే వృత్తిలో నాలుగు దశాబ్దాలు పనిచేసాను. నా పేరు పత్రికలో చూసుకోవాలనే దశ దాటిపోయాను. ఇక నీ ఇష్టం’ అని వచ్చేశాను.


మర్నాడు ‘తల్లి’ పత్రికలు చదివాను కానీ ‘పిల్ల’ పత్రికల వైపే చూడలేదు.

5 కామెంట్‌లు:

  1. హ్హ హ్హ హ్హ, మీ సమాధానం విని ఆ విలేకరి మొహం ఎలా మాడిపోయుంటుందో ... తలుచుకుంటే నవ్వాగడం లేదు 😀😀. అయినా మీ సభకు వచ్చినవాడు కార్యక్రమంలో వేదిక మీద ఇతరులు మీ గురించి ప్రసంగించినప్పుడైనా తెలుసుకోలేకపోతే ఎలా?

    రిప్లయితొలగించండి
  2. వేదిక మీద , రోశయ్య, మిగతా సంపాదకులు ఉన్నారన్న సంగతి తెలియనంత అమాయకుడు కాదు ఆ విలేఖరి. అవన్నీ చూసి కూడా అడిగాడంటే , ఇది ఎంత deep rooted అయిపోయిందో ఆలోచించండి

    రిప్లయితొలగించండి
  3. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడితె విలేఖరులు కొందరు ఇదే పనిమీద ఉంటారు.మీరంటే జర్నలిష్టులు కనక వదిలేసారు. పెళ్ళిలో ఈవెంట్ మేనేజర్ లు ఉన్నట్లు విలేఖరులు కూడా ప్యాకేజీలు చెప్తారు.

    ఔత్సాహిక రాజకీయ నాయకులు వీరి మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. కేసీఆర్,చంద్రబాబు నాయుడు గారు లాంటివాళ్ళకి ప్రొఫైల్ క్రియేట్ చేసి చూపించుకోడానికి ఈ క్లిప్పింగ్స్ చాలా ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరనుండి మోదీ వరకూ ఇలాగే ముఖ్య మంత్రులయ్యారు.

    మనం ఏం చేసామన్నది మనకు మాత్రమే తెలిస్తే సరిపోదు, ఈ ప్రపంచానికి ఎంత అందంగా, ఆకర్షణీయంగా తెలియపర్చామన్నది చాలా ముఖ్యం !

    నేను టీ అమ్ముకునేవాడిని,పార్టీ ఆఫీస్ లో కుర్చీలు తుడిచేవాడిని అని ప్రధాన మంత్రి అయ్యాక చెప్పుకుంటే బాగుంటాయి.

    మీరు కేవలం జర్నలిస్ట్ మాత్రమే ....మీకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేదు కాబట్టి ఇవన్నీ మీకు అవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  4. This is not a new phenomenon. I think you know very well such practices have been prevailing since the days you were in active journalism.

    రిప్లయితొలగించండి