సోషల్ మీడియాలో ఏదైనా రాస్తే ఎవరు
చదువుతారు అనే అనుమానం చాలామందితో పాటు నాకూ వుంది. కేన్సర్ హాస్పిటల్ లో వైద్య నిపు ణుడు డాక్టర్ సెంథిల్ రాజప్ప నాకు ఈ రోజు పంపిన ఈ సందేశం ఆ
సందేహాన్ని పటాపంచలు చేసింది. ఇప్పటివరకు వారెవ్వరో నాకు ఛాయా మాత్రంగా కూడా
తెలియదు.
పొత్తూరి వారి అనుభవాన్ని నేను నా
మాటల్లో రాసాను. అంతే! నందిరాజు వంటి
మిత్రులు స్పందించారు. అది అంతటితో ముగిసింది అనుకున్నాను. కానీ అది చేరవలసిన
వారికి చేరింది. వారికి తెలుగు చదవడం రాదు, అయితే భావం అర్ధం అయినట్టుంది. అందుకే
ఇలా స్పందించారు.
“Dear Srinivas, Thank you so
much for the kind gesture. I shall ask
someone to read it for me. Blessed to be able to take care of a noble soul like
Venkateswara Rao garu.”
థాంక్యూ డాక్టర్!
సరిగ్గా అర్థం కాలేదు శ్రీనివాసరావు గారూ. పొత్తూరి వారికి ఆరోగ్యసమస్యేదైనా తలెత్తిందా?
రిప్లయితొలగించండి