17, అక్టోబర్ 2017, మంగళవారం

తీరు మారుతున్న పార్టీ మార్పిళ్లు


పార్టీ మార్పిడుల విషయంలో వార్తల స్క్రోలింగులు వారాల తరబడి సాగుతాయి ఇలా:
పార్టీ మారాలనే ఆలోచనలో పలానా
పార్టీ మారే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన పలానా
పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన పలానా
తుది శ్వాస వరకు పార్టీలోనే కొనసాగుతానని  స్పష్టం చేసిన పలానా
పార్టీ అధినాయకత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పలానా
నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే తీవ్ర నిర్ణయాలు తప్పవంటున్న పలానా
అధికార పార్టీ అగ్రనేతతో సమావేశమైన పలానా
దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదంటున్న పలానా
ఏ నిర్ణయమైనా కార్యకర్తలతో చర్చించి నిర్ణయిస్తానన్న పలానా
రేపోమాపో పార్టీ మారనున్న పలానా
పార్టీ మారి కొత్త కండువా కప్పుకున్న పలానా

( కొన్ని రోజుల పాటు వార్తల్లో ఉండడానికి ఇదొక కొత్త టెక్నిక్ అని గిట్టని వారి ఆరోపణ) 

7 కామెంట్‌లు:

  1. చివరాఖరుగా - ఫలానా పార్టీ తీర్థం పుచ్చుకున్న ఫలానా.
    ఇటువంటి వాటికి విలువేముంది?

    రిప్లయితొలగించండి
  2. పార్టీలు అనేవి ప్రజలకోసం మాత్రమే ...వ్యక్తిగతంగా పార్టీల అధినాయకులు పెళ్ళిళ్ళలో కలుసుకుని ఆలింగనాలు చేసుకుంటారు కదండీ ? జనం కూడా ఎవరు ఏ పార్టీలో ఉన్నారన్నది పట్టించుకోరు. మనకి ఉపయోగపడతాడా లేడా అన్నది మాత్రం చూస్తారు. మండలి బుద్ధప్రసాద్ గారు మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లో తిరుగులేని నేత విభజన తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళాక స్పీకర్ పదవి వచ్చింది. ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. ఈ రోజు రేవంత్ రెడ్డిగారు తాను పార్టీ మారటంలేదని ప్రకటించారు :)

    రిప్లయితొలగించండి
  5. @ భండారు గారు..మీరు రాసిన తీరు బాగుంది..చాలా మంది స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతారు తప్ప సమాజసేవకకోసం కాదు..నీతిలేని రాజకీయం ధర్మనిరతి లేని అధికారం మన దేశ దౌర్భాగ్యం..

    రిప్లయితొలగించండి
  6. "మధురవాణి"లా సమాజసేవ చేద్దామనుకున్నా ఎవరో ఒకడు దొరకాలి కదా ? అంతా ఏంటీ నాచ్ బృందమాయే !

    రిప్లయితొలగించండి
  7. అంటే ప్రతిపక్షసభ్యుల నియోజకవర్గాలు అభివృద్ధి చెయ్యటంలేదని అధికారపార్టీలు ఒప్పుకుంటున్నట్టే కదా!

    రిప్లయితొలగించండి