ముఖ్యమంత్రులను, సీనియర్
అధికారులను విలేకరుల సమావేశాల్లో కొందరు ప్రశ్నించే తీరుతెన్నులు గమనించిన
తరువాత ప్రశ్నలు అడిగే పద్దతికే నేను స్వస్తి చెప్పాను. కీర్తిశేషులు హిందూ
పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ గారి నుంచి నేను నేర్చుకున్న
పాఠం ఇది. ఆయన ఒకసారి నాతో అన్నారు, ‘ఒక
తమాషా చూశారా. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నవారినీ, వారు
అడిగే ప్రశ్నలను గుర్తు పెట్టుకోండి. రేపు వాళ్ల పత్రికల్లో వాటిని గురించి
ప్రస్తావన ఏమైనా వుంటుందేమో గమనించండి.’
అయితే ఇది ఆయన చేసిన
ఒక సాధారణ పరిశీలనగానే పరిగణించాలి తప్ప జర్నలిస్టులను అందరినీ
ఉద్దేశించి చేసినదిగా భావించనక్కరలేదు.
అయితే, ఆయన
మరో మాట కూడా చెప్పారు. ‘
‘కొందరు
విలేకరులు ఆర్భాటం కోసం వేసే ప్రశ్నలకు నాయకులు చెప్పే జవాబులను జాగ్రత్తగా
గమనిస్తే మంచి వార్తను పట్టుకునే అవకాశం వుంటుంది. కాబట్టి ఎంతో అవసరం అనుకుంటే
తప్ప ప్రశ్నల జోలికి పోకుండా ‘వినదగునెవ్వరుచెప్పిన’ పాలసీ
పెట్టుకుంటే మనం సవివరమైన వార్త అందించడానికి వీలుంటుంది.’
చూసి
నేర్చుకోవాలంటారు. కానీ వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు.
వినడం నిజంగానే ఒక సుగుణం. మీరొక ఉదాహరణని కూడా ఉదాహరిస్తే బాగుండేది.
రిప్లయితొలగించండి@anyagaami: దేవుడు, (నమ్మితేనే సుమా) మనిషికి పుట్టుకతోనే వినడానికి రెండు చెవులు ఇచ్చి, మాట్లాడడానికి ఒకే ఒక నోరు ఇచ్చింది – ఎక్కువ విను, తక్కువగా మాట్లాడు అని చెప్పడానికే అని పెద్దలు అంటారు.
రిప్లయితొలగించండి