ఎనభయ్యవ దశకం ఉత్తరార్ధంలో నేను
మాస్కోలో కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తున్న రోజుల్లో శాకాహారుల మైన మమ్మల్ని ఒకే
ఒక్క కొరత బాధిస్తుండేది. సరయిన బియ్యం దొరికేవి కావు. అవి ఎక్కడ దొరుకుతాయన్నది
అక్కడి తెలుగు కుటుంబాల వాళ్ళం ఒకరికొకరం ఫోన్లు చేసుకుని చెప్పుకునేవాళ్ళం. ఆ రోజుల్లో హుషారుగా షికారు చేసిన జోకు ఇది.
“మాస్కోలోని ఇండియన్ ఎంబసీకి కొత్త
అధికారి వచ్చారు. ఆయన మహా స్ట్రిక్టు. ప్రతి రోజూ ఉదయం స్టాఫ్ మీటింగు జరిగేది. ఒక్క
నిమిషం ఎవరయినా ఆలస్యంగా వచ్చినా ఆయన మండిపడే వారు. ఇలా వుండగా ఒకరోజు ఒక చిన్న
ఆధికారి ఆ మీటింగుకి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. పెద్ద ఆధికారి చిందులు వేస్తూ
“ఎందుకీ ఆలస్యం, ఏమా కధ” అంటూ సంజాయిషీ కోరారు. బాగా బెదిరిపోయిన ఆ చిన్న అధికారి చిన్న గొంతుకతో మెల్లగా చెప్పాడు.
“ఆఫీసుకి వస్తుంటే దారిలో ఒక దుకాణంలో
బియ్యం అమ్ముతున్నారు. క్యూలో నిలబడి కొనుక్కుని వచ్చేసరికి లేటయింది, మన్నించాలి”
అంతే!
కొత్తగా వచ్చిన పెద్ద అధికారి, లేటుగా
వచ్చిన చిన్న అధికారి తప్ప అక్కడ ఎవరూ లేరు. ఒక్కసారిగా అందరూ మాయం అయిపోయారు. బియ్యం దొరుకుతున్న షాపుకు పరిగెత్తుకు పోయారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి